Mallu Ravi: త్వరలో జరగబోయే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఊహించని ఫలితాలు ఉంటాయని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి(Mallu Ravi) వ్యాఖ్యానించారు. తెలుగు ఎంపీలంతా ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికే మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం రవి ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డికి ఏ పార్టీలో సభ్యత్వం లేదని, రాజ్యాంగ పరిరక్షణ కోసమే ఇండియా కూటమి అభ్యర్థిగా ప్రకటించిందన్నారు. ఆయన గెలుపు కోసం తెలుగు ఎంపీలంతా కృషి చేయాలన్నారు. త్వరలోనే అభ్యర్థి పలు రాష్ట్రాల్లో పర్యటిస్తారన్నారు. తనకు మద్దతు ఇవ్వాలని వివిధ పార్టీలను, ఎంపీలను కోరతారన్నారు. సుదర్శన్ రెడ్డి త్వరలో ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్తారని, యూపీలో అఖిలేష్ యాదవ్, బెంగాల్‌లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్ మద్దతు కోరతారన్నారు.
Also Read: Hydraa: జూబ్లీఎన్‌క్లేవ్‌లో ఆక్రమణలు తొలగింపు.. పార్కులు కాపాడిన హైడ్రా
సమయం ఆసన్నం..
ఎన్టీఆర్-చంద్రబాబు మధ్య పార్టీ గుర్తు కోసం కేసు నడిచిన సమయంలో సుదర్శన్ రెడ్డి సుప్రీం కోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారని, ఇప్పుడు చంద్రబాబు కృతజ్ఞత చూపాల్సిన సమయం వచ్చిందన్నారు. సుదర్శన్ రెడ్డి జడ్జిగా ఉన్నప్పుడు ఎన్నో కీలక తీర్పులను చెప్పారన్నారు. పార్లమెంట్‌లో ఉభయ సభలను నిర్వహించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలం అయ్యిందన్నారు. ప్లాన్ ప్రకారం సభల్లో గందరగోళ పరిస్థితులు సృష్టించారన్నారు. విభజన సమస్యల పరిష్కారం, సెమీ కండక్టర్ యూనిట్స్, తెలంగాణలో ఎయిర్‌పోర్టులు, మూసీ నదీ ప్రక్షాళన వంటి అంశాలపై సంబంధిత మంత్రులకు లేఖలు రాసినట్టు ఎంపీ రవి వెల్లడించారు.
Also Read: Lord Vinayaka Marriage: వినాయకుడికి పెళ్లి జరిగిందా? పురాణాలు ఏం చెబుతున్నాయంటే?