Lord Vinayaka Marriage: హిందూ పురాణాల ప్రకారం, వినాయకుడు (గణేశుడు) పెళ్లి చేసుకోలేదని, ఆయన బ్రహ్మచారిగా ఉన్నాడని చెబుతుంటారు. అయితే, కొన్ని గ్రంథాలలో వినాయకుడికి వివాహం జరిగినట్లు కొన్ని కథలు ఉన్నాయి. ఇవి ఆమోదించబడినవి కావు. మనకీ తెలిసినంత వరకు వినాయకుడు బ్రహ్మచారి అని. మన ఆయనను “విఘ్న వినాశకుడు”గా, సర్వసిద్ధి ప్రదాతగా పూజిస్తాము. పురాణాల్లో ఆయన వివాహం గురించి కూడా ఎక్కడా స్పష్టమైన ఆధారాలు లేవు.
పురాణ కథలు ఏం చెబుతున్నాయంటే?
సిద్ధి, బుద్ధి కథనం:
కొన్ని స్థానిక కథనాలు పెళ్లి జరిగినట్లుగా చెబుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో, వినాయకుడు “సిద్ధి”, “బుద్ధి” అనే ఇద్దరు భార్యలను పెళ్లి చేసుకున్నాడని చెబుతున్నాయి . సిద్ధి (విజయం), బుద్ధి (జ్ఞానం) ఆయన ఆధ్యాత్మిక శక్తులను సూచిస్తాయని, ఇవి వివాహం రూపంలో వ్యక్తీకరించబడ్డాయని కొందరు నమ్ముతుంటారు. ఇవి మాత్రమే కాకుండా.. సిద్ధి, బుద్ధి నుండి ఆయనకు “క్షేమ”, “లాభ” అనే ఇద్దరు కుమారులు జన్మించారని చెబుతున్నాయి.
ఒక ప్రసిద్ధ పురాణ కథ ప్రకారం, వినాయకుడు, ఆయన సోదరుడు కుమారస్వామి (కార్తికేయుడు) మధ్య వివాహం కోసం ఒక సవాలు జరిగింది. శివుడు, పార్వతి, తమ ఇద్దరు కుమారులలో ఎవరు మొదట వివాహం చేసుకోవాలో నిర్ణయించడానికి, ప్రపంచాన్ని మూడు సార్లు చుట్టి రావాలని సవాలు విధించారు. కుమారస్వామి తన నెమలిపై ప్రపంచాన్ని చుట్టడానికి బయలుదేరగా, వినాయకుడు తెలివిగా తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి, “తల్లిదండ్రులే ప్రపంచం” అని చెప్పాడు. దీనికి మెచ్చిన శివపార్వతులు వినాయకుడిని గెలిచినవాడిగా ప్రకటించారు. అయినప్పటికీ, ఈ కథలో వినాయకుడు వివాహం చేసుకున్నట్లు స్పష్టమైన ప్రస్తావన లేదు.
Also Read: Chinese Woman: జైలు శిక్ష తప్పించుకునేందుకు.. గర్భాన్ని ఆయుధంగా మార్చుకున్న మహిళ.. ఎలాగంటే?