Star Hero Family: దగ్గుబాటి కుటుంబం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, సాధారణంగా ఈ సినిమా గురించి పెద్దగా నెగెటివ్ ప్రచారం కనిపించదు. అయితే, దగ్గుబాటి అభిరామ్ విషయంలో మాత్రం వివాదం తలెత్తింది. నటి శ్రీరెడ్డి, అభిరామ్ తనను అవకాశాల పేరుతో వాడుకున్నాడని ఆరోపిస్తూ, ఫిల్మ్ ఛాంబర్ ముందు నగ్నంగా నిరసన తెలిపిన సంఘటన గతంలో సంచలనం సృష్టించిన విషయం మనకీ తెలిసిందే.
ఈ సంఘటనతో అభిరామ్ ఇమేజ్ గట్టిగా దెబ్బతినడమే కాక, దగ్గుబాటి కుటుంబానికి కూడా ఒక మచ్చ వచ్చింది. ఇదిలా ఉంటే, ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ గీతా కృష్ణ దగ్గుబాటి కుటుంబంపై సంచలన కామెంట్స్ చేశారు. “దగ్గుబాటి కుటుంబంలో అందరూ రసికులే” అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
Also Read: GWMC Commissioner: చెత్త తరలింపు వాహనాల సమాచారం నమోదు చేయాలి.. బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్
ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం, రానా దగ్గుబాటి త్రిషతో డేటింగ్ చేశాడా అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్న. దీనికి గీతా కృష్ణ సమాధానంగా, ” అందరూ డేటింగ్ చేయలేదనే చెబుతారు. కానీ నిజం ఏంటంటే డేటింగ్ అందరూ చేస్తారు. అని షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాదు, ఆయన, “రామానాయుడు గురించి మాట్లాడుతూ.. ఆయన కొడుకులకు కూడా అతని లాంటి బుద్ధులే వస్తాయి . జామ చెట్టుకు జామకాయలే కాస్తాయి కదా.. ఇంత చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా? రానా, అభిరామ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్లందరూ మంచి రసిక మాస్టర్స్. పెళ్లయ్యాక రానా తగ్గి ఉండొచ్చు, కానీ పెళ్లికి ముందు ఎవరూ తగ్గలేదు” అంటూ సంచలన కామెంట్స్ చేశారు.
డైరెక్టర్ గీతా కృష్ణ ఇటీవల ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో వివాదానికి తెరలేపాయి. “కొంతమంది ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే టైప్ వాళ్లు ఉన్నారు. అమ్మాయిలు కూడా, ఎవరైనా తమను టచ్ చేసి ఆనందించినప్పుడు, దానికి బదులుగా ఏదైనా లాభం వస్తే ఒప్పుకుంటారు. కానీ, ఒప్పుకోకపోతే ఆ పాపం చాలా ప్రమాదకరం. సినిమా ఇండస్ట్రీలో కొందరు పెద్ద నటీనటులు ఇలాంటి పాపాన్ని అనుభవించారు. వాళ్ల కుటుంబాలకు, ముఖ్యంగా వాళ్ల కూతుళ్ల రూపంలో ఆ పాపం తిరిగి తగిలింది. అయితే, ఆ పేర్లను బయటపెట్టడం నాకు ఇష్టం లేదు” అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, నెటిజన్ల మధ్య హాట్ టాపిక్‌గా మారాయి. గీతా కృష్ణ మాటలు దగ్గుబాటి కుటుంబంతో ముడిపడిన చర్చలను మరోసారి రగిలించాయి, ఇండస్ట్రీలోని కొన్ని అంశాలపై తీవ్రమైన విమర్శలు, చర్చలు జరుగుతున్నాయి.