Mega Heroes: గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీ సినిమాలకు వరుస పరాజయాలు ఎదురైనప్పటికీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) నటించిన ‘ఓజీ’ (OG) ఆ పరంపరకు తెరదించి, మెగా హీరోల శకానికి కొత్త ఆరంభాన్ని ఇచ్చింది. ‘ఓజీ’తో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం, ఆ తర్వాత చిరంజీవి (Chiranjeevi), రామ్ చరణ్ (Ram Charan), సాయి దుర్గ తేజ్ (Sai Durgha Tej) సినిమాల నుంచి వచ్చిన అప్‌డేట్స్ అన్నీ బ్లాక్‌బస్టర్ హిట్‌లను సూచిస్తుండడంతో, సినీ పరిశ్రమలో మళ్లీ మెగా నామ సంవత్సరం మొదలైనట్లు స్పష్టమవుతోంది. ‘ఓజీ’ సినిమా విషయంలో విడుదలైన తర్వాత కొంతమంది కావాలనే నెగెటివ్ టాక్ ప్రచారం చేసినప్పటికీ, పవన్ కళ్యాణ్ స్టామినా ముందు అది నిలబడలేకపోయింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. బాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ మార్కెట్ పవర్ ఏంటో ఈ సినిమా మరోసారి నిరూపించింది.
Also Read- Sujeeth: సుజీత్‌కు అదృష్టం ఏంటి ఇలా పట్టింది? పొగడకుండా ఉండలేకపోతున్నారుగా!
చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ హంగామా
‘ఓజీ’ ఊపును కొనసాగిస్తూ, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సినిమా నుంచి విడుదలైన ‘మీసాల పిల్ల’ పాట ఏకంగా 50 మిలియన్ వ్యూస్‌ను రాబట్టి సరికొత్త బెంచ్‌మార్క్‌ను చేరుకుంది. ఈ పాట సాధించిన భారీ విజయం, సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందనే హింట్‌ను ఇచ్చింది. సినిమా విడుదలకు ముందే ఈ స్థాయి సక్సెస్ సాధించడం మెగాస్టార్ క్రేజ్‌కు నిదర్శనం.
రామ్ చరణ్ ‘పెద్ది’ దూకుడు
‘గేమ్ చేంజర్’ చిత్రంతో భారీ పరాజయాన్ని చవిచూసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తన తదుపరి చిత్రం ‘పెద్ది’తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా వచ్చే సంవత్సరం మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలోకి రానుంది. తాజాగా ‘పెద్ది’ (Peddi) చిత్రం నుంచి విడుదలైన ‘చికిరి చికిరి’ అనే పాట కూడా రికార్డు స్థాయిలో వ్యూస్‌ను సాధించి మెగా ఫ్యాన్స్‌లో భారీ ఆనందాన్ని నింపింది. ఈ పాట సృష్టించిన రికార్డులు, సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. ఈ పాట సాధించిన సక్సెస్ ‘పెద్ది’ కచ్చితంగా హిట్టే అనే ధీమాను ప్రేక్షకులకు ఇచ్చింది.
Also Read- Mana Shankara Vara Prasad Garu: వైరల్ సెన్సేషన్.. మరో బెంచ్‌మార్క్‌కు చేరుకున్న ‘మీసాల పిల్ల’!
సాయి దుర్గ తేజ్ సైతం
మెగా హీరోల విజయ పరంపరలో సాయి దుర్గ తేజ్ కూడా భాగమయ్యేలా కనిపిస్తున్నాడు. ఆయన నటిస్తున్న ‘సంబరాల యేటి గట్టు’ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన టీజర్, ఈ సినిమాతో తేజ్ తన ఖాతాలో మరో సాలిడ్ హిట్ వేసుకోబోతున్నట్లుగా స్పష్టం చేసింది. అలాగే వరుణ్ తేజ్ కూడా రెండు సినిమాలతో రెడీ అవుతున్నారు. ఆయన కూడా వరుస పరాజయాలలో ఉన్నారు కాబట్టి.. ఆయన నుంచి కూడా సాలిడ్ కమ్ బ్యాక్ ఉండే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే.. ‘ఓజీ’తో మొదలైన మెగా హీరోల ఈ విజయ పరంపర, రాబోయే నెలల్లో బాక్సాఫీస్ వద్ద మెగా జపం మాత్రమే వినిపించేలా చేస్తుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
