Meesala Pilla Song (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Mana Shankara Vara Prasad Garu: వైరల్‌ సెన్సేషన్‌.. మరో బెంచ్‌మార్క్‌కు చేరుకున్న ‘మీసాల పిల్ల’!

Mana Shankara Vara Prasad Garu: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), నయనతార (Nayanthara) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu). ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘మీసాల పిల్ల’ (Meesala Pilla) సాంగ్ 50 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా… తెలుగు సినిమా మ్యూజిక్‌కు సరికొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది. హిట్‌మెషిన్‌ అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం పండగ వాతావరణంలో, కుటుంబమంతా కలిసి చూసేలా ఉండే ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందనే హింట్ ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ ఇచ్చేసింది. ఆ వైబ్‌ను అలా కంటిన్యూ చేస్తూ వచ్చిన ‘మీసాల పిల్ల’ సాంగ్ అందరినీ అద్భుతంగా అలరిస్తోంది. భీమ్స్‌ సెసిరోలియో అందించిన ఎనర్జిటిక్‌ ట్యూన్‌, బీట్‌లతో ఈ పాట దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతూ.. చార్ట్‌బస్టర్‌ లిస్ట్‌లో చేరింది.

Also Read- BJP Paid Crowd: వాహ్ మోదీ వాహ్.. పూలు చల్లితే రూ.500, ఏడిస్తే రూ.1000!.. ప్యాకేజీ అదుర్స్ కదూ?

ఎక్కడ చూసినా మీసాల పిల్ల రీల్సే..

తెలుగు పాటగా వచ్చి ఇంత పెద్ద స్థాయిలో పాన్‌-ఇండియా రీచ్‌ సాధించడం నిజంగా అరుదైన ఘనతగా చెప్పుకోవచ్చు. ఈ పాటలో మెగాస్టార్‌ చిరంజీవి తన సిగ్నేచర్‌ చార్మ్‌, ఎక్స్‌ప్రెషన్స్, ఎనర్జిటిక్‌ డ్యాన్స్‌ మూవ్స్‌తో అభిమానుల హృదయాలను కొల్లగొట్టారు. మరీ ముఖ్యంగా నయనతారతో ఉన్న సీన్స్‌లో ఆయన టైమింగ్ ఫ్యాన్స్‌ని బాగా ఆకర్షిస్తోంది. అందుకే ఈ పాటకు రీల్స్ కూడా విపరీతంగా పడుతున్నాయి. ఆ విషయంలో కూడా ఈ పాట దూసుకెళుతోంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. ‘మీసాల పిల్ల’ రీల్సే దర్శనమిస్తున్నాయి. ఉదిత్‌ నారాయణ్‌, శ్వేతా మోహన్‌ వోకల్స్ కట్టిపడేసేలా ఉండగా.. ఆకట్టుకునే హుక్‌లైన్‌‌తో ఈ సాంగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ సెన్సేషన్‌గా మారింది.

Also Read- Robbery Gone Wrong: గోల్డ్ షాప్ ఓనర్ కళ్లలో కారంకొట్టి చోరీ చేద్దామనుకుంది.. కానీ చావుదెబ్బలు తిన్నది.. వీడియో ఇదిగో

త్వరలోనే సెకండ్ సింగిల్..

ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌, ఎక్కడ చూసినా ‘మీసాల పిల్ల’ ఫీవరే కనిపిస్తోందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. అభిమానులు కూడా డాన్స్‌ చేస్తూ, రీమిక్స్‌లు చేస్తూ, తమ ప్రేమను తెలియజేస్తున్నారు. ఈ పాటకు వస్తున్న స్పందనతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ఫస్ట్ సాంగ్ గ్రాండ్ సక్సెస్ అవడంతో.. రెండో సాంగ్‌పై మేకర్స్ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే రెండో సాంగ్ విడుదలకు సంబంధించిన వివరాలను అధికారికంగా మేకర్స్ తెలపనున్నారు. ఈ పాటను రమణ గోగుల పాడబోతున్నారనేలా టాక్ నడుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో? ఈ సినిమాను సాహూ గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా షైన్‌ స్క్రీన్స్, గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2026 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకానుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Jubilee Hills byPoll: ఉపఎన్నిక నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లో ఆంక్షలు.. సజ్జనార్​ ఉత్తర్వులు జారీ

Abhishek Sharma: వరల్డ్ రికార్డ్ సాధించి చరిత్ర నెలకొల్పిన అభిషేక్ శర్మ

Sujeeth: సుజీత్‌కు అదృష్టం ఏంటి ఇలా పట్టింది? పొగడకుండా ఉండలేకపోతున్నారుగా!

Kishan Reddy: అసలు ఆట ఇంకా మొదలవ్వలే.. రానున్న రోజుల్లో మొదలుపెడతాం..!

Cyber Crime: సైబర్ మోసగాళ్ల వలలో వృద్ధుడు.. రూ.5 లక్షలు వెనక్కి వచ్చేలా చేసిన కానిస్టేబుల్.. ఏం చేశాడంటే?