Sujeeth: ఇటీవల ‘ఓజీ’ సినిమాతో (OG Movie) సంచలనాన్ని క్రియేట్ చేసిన యువ దర్శకుడు సుజీత్ (Sujeeth).. ఇప్పుడు ఏకంగా గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar)ని డైరెక్ట్ చేసి మరోసారి వార్తలలో హైలెట్ అవుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) వీరాభిమాని అయిన సుజీత్.. తన అభిమాన హీరోని డైరెక్ట్ చేయడమే కాకుండా.. ఆయన కెరీర్‌లోనే అద్భుతమైన హిట్‌ని అందించారు. ఈ సినిమా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి.. ఈ ఇయర్ అధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల జాబితాలో చేరింది. ఈ సినిమా తర్వాత దర్శకుడు సుజీత్‌కు ఓ అద్భుతమైన అవకాశం వరించింది. అవును.. గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్‌ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని ఆయన సొంతం చేసుకున్నారు. ఈ విషయం తెలిసి, సంగీత దర్శకుడు థమన్ కూడా ఎంతో సంతోషిస్తూ.. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేశారు. ఇక సచిన్ ఫ్యాన్స్ అయితే.. సుజీత్ అదృష్టాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నారు.
Also Read- The Great Pre-Wedding Show: ‘బలగం’ తరువాత మళ్లీ ఆ ఫీలింగ్ ఇచ్చిన చిత్రమిదేనట!
బ్రాండ్ అంబాసిడర్‌గా సచిన్
ఇంతకీ సచిన్‌ని డైరెక్ట్ చేసింది సినిమా కోసం అనుకుంటున్నారా? కానే కాదు. సచిన్‌తో ఒకటి కాదు రెండు యాడ్స్‌ని సుజీత్ డైరెక్ట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే.. రెండు తెలుగు రాష్ట్రాలలో సుపరిచితమైన పెయింట్స్ కంపెనీ ‘టెక్నో పెయింట్స్’ యాజమాన్యం.. తమ వ్యాపార విస్తరణలో భాగంగా ఇప్పుడు పాన్ ఇండియా సేల్స్ అండ్ ఆపరేషన్స్‌తో పాటు రిటైల్ రంగంలో నూతన భాగస్వాములతో కలసి ఫ్రాంచైజ్‌లను అన్ని రాష్ట్రాలలో నెలకొల్పేందుకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా టెక్నో పెయింట్స్ (Techno Paints) దేశంలోని అన్ని రాష్ట్రాలకి, అన్ని ప్రాంతాల ప్రజలకి, కస్టమర్లకి మరింత చేరువ కావడానికి తమ నూతన బ్రాండ్ అంబాసిడర్‌గా గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్‌ని నియమించుకున్నారు. తాజాగా ముంబైలో రెండు ప్రచార చిత్రాలను సచిన్‌పై రెడీ చేశారు. ఈ రెండు యాడ్ ఫిల్మ్స్‌కు ఇటీవల ‘ఓజీ’ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహించాడు. ఈ ప్రచార చిత్రాలు అతి త్వరలోనే దేశంలోని అన్ని ప్రముఖ మాధ్యమాల ద్వారా విడుదల చేస్తామని కంపెనీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు.
Also Read- Mana Shankara Vara Prasad Garu: వైరల్ సెన్సేషన్.. మరో బెంచ్‌మార్క్‌కు చేరుకున్న ‘మీసాల పిల్ల’!
ఫ్యాన్ బాయ్ సంభవం
సచిన్ టెండూల్కర్ అంటే.. క్రికెట్‌ని ప్రేమించే ప్రతి అభిమాని ఎంతగానో ఆరాధిస్తారు. మరీ ముఖ్యంగా 80స్, 90స్ బ్యాచ్ అయితే సచిన్‌ని దేవుడిలా కొలుస్తారు. క్రికెట్ ఆటను సచిన్ పేరు లేకుండా చెప్పడం కష్టం. అలాంటి ఓ మార్క్‌ని సచిన్ క్రియేట్ చేశారు. అలాంటి సచిన్‌ని డైరెక్ట్ చేసి, సుజీత్ మరోసారి తన ఫ్యాన్ బాయ్ సంభవాన్ని ప్రదర్శించారు. ఇక ఈ యాడ్స్ బయటకు వచ్చిన తర్వాత సుజీత్ పేరు మరోసారి ట్రెండ్ బద్దలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ‘ఓజీ’ తర్వాత నేచురల్ స్టార్ నాని (Natural Star Nani)తో సుజీత్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ ఇటీవల ప్రారంభోత్సవం జరుపుకున్న విషయం తెలిసిందే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
