Kishan Reddy: దేశంలో ఏ ఎలక్షన్ జరిగినా కాంగ్రెస్(Congress) హైకమాండ్ కు.. రూ.కోట్లకు కోట్లు తెలంగాణ(Telangana) నుంచే పంపిస్తున్నారని, ఇది నిజం కాదా? అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ప్రశ్నించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీహార్(Bihar) ఎన్నికలకు రూ.కోట్లకు కోట్లు మోస్తున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. కార్ల డిక్కీల్లో పెట్టి ఢిల్లీకి పంపిస్తున్నది నిజం కాదా? అనేది సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. వ్యాపార సంస్థలను బెదిరించి రూ.వేల కోట్లు వసూళ్లు చేస్తున్నది నిజం కాదా? అని కేంద్ర మంత్రి నిలదీశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడిపోతున్నామనే ఫ్రస్టేషన్ రేవంత్ రెడ్డిలో కనిపిస్తోందన్నారు.
ఒప్పందం కుదిరింది నిజం కాదా..
ఇచ్చిన హామీలు అమలుచేయకుండా రేవంత్ సర్కార్ విఫలమైందని విమర్శించారు. తనపై, బీజేపీ(BJP)పై వ్యక్తిగతంగా నోటికొచ్చింది మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తనకు రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), కేసీఆర్(KCR), కేటీఆర్(KTR) సర్టిఫికెట్లు అవసరం లేదన్నారు. గత ఎన్నికల్లో బీజేపీపై చేసిన తప్పుడు ప్రచారాలే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లోనూ చేస్తున్నారని ఎద్దేవాచేశారు. కేసీఆర్ అవినీతి చేసిన రూ.లక్ష కోట్లను కక్కిస్తామన్నారని, ఈ అవినీతిలో ఢిల్లీ వేదికగా కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఒప్పందం కుదిరింది నిజం కాదా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. సీఎంకు చీము నెత్తురు ఉంటే, దమ్ము, ధైర్యం ఉంటే బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) ఒక్కటని నిరూపించాలని కేంద్ర మంత్రి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్ముతున్నారా?, ఆయనపై కనీసం సొంత పార్టీ నేతలకైనా నమ్మకం ఉందా? అని అనుమానం వ్యక్తంచేశారు. కేసీఆర్ తర్వాత మూర్ఖపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. తెలంగాణకు తెచ్చిన నిధులపై చర్చకు తాను సిద్ధమని, సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమా అని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ లే బ్యాడ్ బ్రదర్స్ అంటూ కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
Also Read: Private Colleges Opening: రేపటి నుంచి ప్రైవేటు కాలేజీలు ఓపెన్.. వెనక్కితగ్గిన యాజమాన్యాలు
సచివాలయానికి తాళం వేసి..
వీరికంటే బ్యాడ్ బ్రదర్స్ దేశంలోఎవ్వరూ ఉండబోరన్నారు. రేవంత్, కేసీఆర్ బ్యాడ్ బ్రదర్స్ కు అసదుద్దీన్(Asaduddin) అనే మరో బ్యాడ్ బ్రదర్ జతకలిశారని చురకలంటించారు. బీఆర్ఎస్(BRS) అంటే ఫేక్, ఫ్రాడ్, ఫాల్స్, ఫెయిల్యూర్, ఫ్యామిలీ, ప్రైవేట్ లిమిటెడ్ పార్టీ అని విమర్శించారు. కాంగ్రెస్ అంటే ఫేక్, ఫ్రాడ్, ఫాల్స్, ఫెయిల్యూర్ సోనియా ప్రైవేట్ లిమిటెడ్ అని విరుచుకుపడ్డారు. జూబ్లీహిల్స్ లో ఓట్లకోసం టోపీలు పెట్టుకుంటున్నారని, రేవంత్ కు ఇష్టం ఉంటే ఆయన టోపీ పెట్టుకోవాలి తప్పితే.. ప్రజలకు టోపీ పెట్టొద్దని చురకలంటించారు. ముఖ్యమంత్రి, మంత్రులు సచివాలయానికి తాళం వేసి.., జూబ్లీహిల్స్ ఎన్నికలో తిరుగుతున్నారని ఫైరయ్యారు. బీజేపీకి బలం లేనప్పుడు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి తమ పార్టీని ఎందుకు టార్గెట్ చేస్తున్నట్లని ప్రశ్నించారు. ఇంకా ఆట మొదలు కాలేదని, తెలంగాణ(Telangana) గడ్డపై అసలు ఆట రానున్న రోజుల్లో మొదలుపెడతామని సీఎంకు కేంద్ర మంత్రి హెచ్చరించారు. ఆట అంటే ఏంటో చూపిస్తామని నొక్కిచెప్పారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా.. ఆయనకు కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: Chikiri song record: బన్నీ రికార్డును బ్రేక్ చేసిన రామ్ చరణ్.. ఇండియాలో ఇదే ఫస్ట్ సాంగ్
