Komatireddy Venkat Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపునకు రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. గ్రౌండ్ వర్క్‌తో పోలింగ్‌పై దృష్టి సారించిన ఆయన, క్షేత్ర స్థాయి లీడర్లతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఓటరును టచ్ చేసేలా పోలింగ్ బూత్‌కు తీసుకువచ్చి ఓటు వేయించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రతి 10 ఓటర్లకు ఒక ఇన్‌ఛార్జ్, 100 ఓట్లకు ఒక సమన్వయకర్త లాంటి వ్యూహాన్ని అమలు చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్థానిక లీడర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు.
ప్రతి ఓటు విలువైనదే
ప్రతి గడపకు వెళ్లాలని ప్రభుత్వ లబ్ధిదారులను ప్రత్యేకంగా ఓటును అభ్యర్థించాలని సూచిస్తున్నారు. ప్రతి ఓటు విలువైనదేనని, ఎలాంటి ఏమరుపాటు లేకుండా ఇన్‌ఛార్జ్‌లు అందుకు అనుగుణంగా పని చేయాలని, ఓటును రాబట్టే వ్యూహాన్ని ఈ సందర్భంగా వారికి వివరిస్తూ పలు ఉదాహరణలు చెప్పారు. తాను ఆరు సార్లు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచానని దానికి ప్రజలకు భరోసా కల్పించడం, నేనున్నా అనే ధైర్యాన్ని ఇవ్వడం లాంటివి ఉంటాయని, ప్రతి ఓటరు పోటీ చేసే అభ్యర్థిని తమ ఇంటి సభ్యుడిగా భావించేలా చేయడమే అసలైన విజయమని పలు అంశాలు ప్రస్తావించారు. మంత్రి ఫీల్డ్ వర్క్, కాంగ్రెస్ శ్రేణులకు ఇస్తున్న మోటివేషన్‌తో రెట్టింపు ఉత్సాహంతో క్షేత్ర స్థాయిలో నాయకులు పని చేస్తున్నారు.
ప్రత్యేక శ్రద్ధ చూపాలి
రానున్న మూడు రోజుల ప్రత్యేక శ్రద్ధ చూపాలని అందుకు తగ్గ అంశాలపై వారికి పలు సూచనలు చేసి కోమటిరెడ్డి అలర్ట్ చేశారు. ఇప్పటికే సినిమా కార్మికులు, సినీ ప్రముఖులు, సంఘాలతో ప్రత్యేకంగా భేటీ అవుతూ వస్తున్నారు. వారికి భరోసా కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే వారికి జరిగే మేలును వివరిస్తున్నారు. సినిమా రంగానికి సంబంధించిన వారినే వారికి ఇంటర్నల్ ఇన్‌ఛార్జ్‌లుగా నియమించినట్లు తెలిపారు. ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా ఫీల్డ్ వర్క్‌కు దిగిన మంత్రి పోల్ మేనేజ్‌మెంట్‌పై కాంగ్రెస్ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలు కొన్ని చోట్ల మౌత్ పబ్లిసిటీతో కన్ ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తాయని, ఓటు వేయించే వరకు మనం పూర్తి అలర్ట్‌గా ఉండాలని కాంగ్రెస్ శ్రేణులకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు.
