Samantha and Raj (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Samantha: ఏదో ఒకటి తేల్చేయవచ్చుగా… ఎందుకీ దాగుడుమూతలు?

Samantha: సినీ నటి సమంత (Samantha), దర్శకుడు-నిర్మాత రాజ్ నిడిమోరు (Raj Nidimoru)తో డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు మరింత చర్చకు దారితీశాయి. ఒకరినొకరు కౌగిలించుకున్న ఈ సన్నిహిత ఫోటో చూసిన అభిమానులు, నెటిజన్లు వారి మధ్య బాండింగ్ నడుస్తుందని ఫిక్సవుతున్నారు. నాగ చైతన్యతో విడాకుల తర్వాత నటి సమంత వ్యక్తిగత జీవితంపై మీడియా, సోషల్ మీడియా ఏ విధంగా దృష్టి పెట్టిందో తెలియంది కాదు. నాగ చైతన్య (Naga Chaitanya) రెండో పెళ్లి వార్తల నేపథ్యంలో, సమంత కూడా బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమాయణం నడుపుతున్నట్లుగా రూమర్స్ బలంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ గతంలో ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వంటి విజయవంతమైన ప్రాజెక్టులకు కలిసి పనిచేయడం, తాజాగా ‘సిటాడెల్: హనీ బన్నీ’లో కూడా భాగస్వాములుగా ఉండడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. అంతేకాకుండా, సమంత నిర్మాతగా వ్యవహరిస్తున్న కొన్ని సినిమాలను రాజ్ నిడిమోరునే సమర్పిస్తున్నారు.

Also Read- Chain Snatching Case: పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చడానికి చైన్ స్నాచింగ్.. కానీ చివరికి బిగ్ ట్విస్ట్..!

ఫోటోతో మరింత క్లారిటీ!

తాజాగా, సమంత తన పెర్‌ఫ్యూమ్ బ్రాండ్‌కు సంబంధించిన ఈవెంట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో ఆమె రాజ్ నిడిమోరును కౌగిలించుకుని ఉన్న ఫోటో ఒకటి ఉంది. గతంలో అనేక వేదికల్లో, విదేశీ ట్రిప్‌లలో, చివరికి దీపావళి వేడుకల్లో కూడా రాజ్, సమంత కుటుంబ సభ్యులతో కలిసి కనిపించినా, ఇంత క్లోజ్ ఫోటోను షేర్ చేయడం ఇదే మొదటిసారి. ఈ ఫోటోలో ఇద్దరూ చిరునవ్వుతో కనిపించడం వారి మధ్య ఉన్న బలమైన బంధాన్ని సూచిస్తున్నట్లు అభిమానులు భావిస్తున్నారు. ఈ ఫోటోలు వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది ఇది వారి రిలేషన్‌షిప్‌కు అధికారిక ప్రకటన (Official Confirmation) లాంటిదేనని అభిప్రాయపడుతున్నారు.

Also Read- Bigg Boss Telugu 9: హౌస్‌లోని అందరి జాతకాలు బయటపడ్డాయ్.. సుమన్ శెట్టి ఒక్కడే టాప్‌లో!

ఎందుకీ దాగుడుమూతలు?

ఇలా అప్పుడప్పుడు ఫోటోలతో హింట్లిచ్చే బదులు, ఉన్న విషయం ఏంటో నేరుగా చెప్పవచ్చు కదా? ఎందుకీ దాగుడుమూతలు? అని పలువురు నెటిజన్లు ఈ ఫొటోలకు కామెంట్స్ చేస్తున్నారు. సమంత పెళ్లి చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదని, తమ రిలేషన్‌ గురించి బహిరంగంగా ప్రకటిస్తే మీడియా ఫోకస్ కూడా తగ్గుతుందని వారు సూచిస్తున్నారు. సమంత కెరీర్‌లో సాహసోపేతమైన అడుగులు వేస్తున్నానని, తన అంతర దృష్టిని నమ్ముతున్నానని ఫోటోకు క్యాప్షన్ ఇవ్వడం కూడా అభిమానుల్లో ఉత్సుకత పెంచుతోంది. మొత్తానికి, సమంత, రాజ్ నిడిమోరు తమ బంధాన్ని ఎప్పుడు బహిరంగంగా ప్రకటిస్తారో, లేదా రెండో పెళ్లి వార్తను ఎప్పుడు వెల్లడిస్తారో అనే విషయంపై సినీ వర్గాల్లో, అభిమానుల్లో ఆసక్తి కొనసాగుతోంది. త్వరగా ఆ కబురేదో సమంత చెప్పేస్తే.. మీడియా కూడా ఈ విషయాన్ని అంత హైలెట్ చేయకుండా ఉంటుంది. చూద్దాం.. సమంత దారేటో..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Mega Heroes: మెగా నామ సంవత్సరం మొదలైనట్టేనా? అంతా మెగా జపమే!

Jana Nayagan: ‘జన నాయగన్’ కచేరి లిరికల్ వచ్చేసింది.. ‘భగవంత్ కేసరి’ సాంగ్ దించేశారుగా!

KTR: 14 త‌ర్వాత రాష్ట్రంలో పెనుతుపాను.. ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Samantha: ఏదో ఒకటి తేల్చేయవచ్చుగా… ఎందుకీ దాగుడుమూతలు?

Jubilee Hills byPoll: ఉపఎన్నిక నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లో ఆంక్షలు.. సజ్జనార్​ ఉత్తర్వులు జారీ