Bigg Boss Telugu Weekend Episode (Image Source: YT)
ఎంటర్‌టైన్మెంట్

Bigg Boss Telugu 9: హౌస్‌లోని అందరి జాతకాలు బయటపడ్డాయ్.. సుమన్ శెట్టి ఒక్కడే టాప్‌లో!

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 62వ రోజు (Bigg Boss Telugu Season 9 Day 62) ‘శివ’ (Shiva) మూవీ ప్రమోషన్స్ జరిగినట్లుగా హింట్ ఇచ్చేసిన బిగ్ బాస్.. తాజాగా మరో ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో శాక్రిఫైస్‌‌తో హౌస్‌లో నిశ్శబ్ధాన్ని సృష్టించారు. వాస్తవానికి శనివారం అంతా.. ఈ వారం మొత్తం ఎవరెవరు ఏమేం తప్పులు చేశారనే దానిపై నాగార్జున రివ్యూ చేస్తారు. కానీ, ఈ వారం అలా కాకుండా, తన సినిమా ‘శివ’ రీ రిలీజ్ ప్రమోషన్స్‌ కోసం భార్య అమల, ఆ చిత్ర దర్శకుడు ఆర్జీవీ రావడంతో.. రివ్యూ ఆడియెన్స్ చేతికి ఇచ్చేసి.. సరికొత్త టాస్క్‌కు శ్రీకారం చుట్టారు. ఫ్యామిలీ లవ్ అంటూ వచ్చిన తాజా ప్రోమో చూస్తే.. మరోసారి బిగ్ బాస్ హౌస్‌లో ఎమోషనల్ డ్రామా నడుస్తున్నట్లుగా అర్థమవుతోంది. అసలీ ప్రోమోలో ఏముందనే విషయానికి వస్తే..

Also Read- Bigg Boss Telugu 9: బిగ్‌బాస్‌లో ‘శివ’ వైబ్.. అమల, ఆర్జీవీ ఎంట్రీతో దద్దరిల్లిన హౌస్!

ఇదయ్యా హౌస్‌లోని వారి జాతకం

ముందుగా ఆడియెన్స్‌కు నాగార్జున (King Nagarjuna) ఓ సూచన చేస్తున్నారు. ‘కంటెస్టెంట్ పేరు చెప్పగానే.. వాళ్లు ఈ సీజన్‌లో హిట్టా? ఫ్లాపా? అనేది మీరే డిసైడ్ చేస్తారు’ అని చెప్పి ఒక్కొక్కరి చేతికి బజర్ ఇచ్చారు. కంటెస్టెంట్స్ పేర్లు చెబుతుంటే వారు వారి నిర్ణయాన్ని తెలియజేస్తున్నారు. ‘మీరిచ్చే జడ్జిమెంట్‌ను బట్టి.. టాప్‌లో ఉన్న 6 లేదా 7గురు హౌస్‌మేట్స్‌కు బిగ్ బాస్ కొన్ని బెనిఫిట్స్ ఇవ్వబోతున్నారు’ అని నాగ్ చెప్పారు. ఆడియెన్స్ జడ్జిమెంట్ ప్రకారం సుమన్ శెట్టి 100 శాతం, ఇమ్మానుయేల్ 95 శాతం, తనూజ 93 శాతం, కళ్యాణ్ 79 శాతం, రీతూ 78 శాతం, డిమోన్ పవన్ 72 శాతం, గౌరవ్ 69 శాతం, రాము 59 శాతం, నిఖిల్ 45 శాతం, సంజన 43 శాతం, భరణి 35 శాతం.. ఇలా వరుసగా హిట్ పర్సంటేజ్‌ని పొందారు.

డైరెక్ట్ కంటెండర్ ఫర్ కెప్టెన్సీ

వీరిలో టాప్‌లో ఉన్న సుమన్ శెట్టి‌ (Suman Shetty)ని ఉద్దేశిస్తూ నాగార్జున మాట్లాడుతూ.. ‘‘నువ్వు ఈ లీడర్ బోర్డులో టాప్‌లో ఉన్నావు. నీ గేమ్ 100 శాతం హిట్ అని ఆడియెన్స్ అన్నారు. నీ ఆట ఇంత హిట్ కాబట్టి.. బిగ్ బాస్ నీకొక గిఫ్ట్ ఇద్దామని డిసైడ్ అయ్యాడు. అదేంటంటే.. నెక్ట్స్ వీక్ నువ్వు డైరెక్ట్ కంటెండర్ ఫర్ కెప్టెన్సీ.. కానీ ఇది నీకు దక్కాలంటే, భరణి ఫ్యామిలీకి సంబంధించినది త్యాగం చేస్తే.. నువ్వు డైరెక్ట్ కంటెండర్ అవుతావు’ అని నాగ్ చెబుతున్నారు. తనూజను ఉద్దేశిస్తూ.. ‘తనూజ.. మీ సిస్టర్‌కు త్వరలో పెళ్లి.. మీ సిస్టర్ నుంచి వాయిస్ నోట్ వచ్చింది. అది నువ్వు వినాలంటే.. కళ్యాణ్ కెప్టెన్ అయినా కూడా ఈ సీజన్ మొత్తం ఇమ్యూనిటీ ఉండదు. 10 సెకన్ల టైమ్ ఇస్తున్నాను.. ఈలోపు ఆలోచించి చెప్పు’’ అని ఆమెకు టైమ్ ఇచ్చారు.

Also Read- SSMB29 title glimpse: మూడు నిమిషాల విజువల్ కోసం వంద అడుగుల తెర.. ‘SSMB29’ కోసం ఆమాత్రం ఉంటది..

గిఫ్ట్ ఇస్తానని.. ప్లేట్ మార్చేశాడేంటి?

ఆ తర్వాత రీతూకి ఓ షర్ట్ చూపించి అది ఎవరిదో తెలుసా? అనగానే.. ‘మా డాడీది సార్’ అని చెప్పింది. ఆ షర్ట్ నువ్వు పొందాలంటే.. సంజనకు సంబంధించిన శారీస్ అన్నీ స్టోర్ రూమ్‌లో పెట్టేయాలని చెప్పారు. ‘ఇమ్మానుయేల్.. నీకోసం నీ గర్ల్‌ఫ్రెండ్ నుంచి ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది. అది నీకు దక్కాలంటే.. గౌరవ్‌కు ఉన్న బిగ్ బ్లస్సీ పవర్ పోతుంది’ అని చెప్పగానే.. వాయిస్ మెసేజ్ వింటానని ఇమ్ము చెప్పారు. ఆడియో మెసేజ్ వినిపించారు. ఇమ్ము ఎమోషనల్ అవుతూ.. కళ్లలో నీళ్లు పెట్టుకున్నారు. గౌరవ్ తనకున్న పవర్ పోయినందుకు ఫీల్ అవుతున్నాడు. దీంతో.. గిఫ్ట్ ఇస్తానని ఒక్కసారిగా బిగ్ బాస్ ఇలా ప్లేట్ మార్చేశాడేంటి? అని హౌస్‌మేట్స్‌లో, ఆడియెన్స్‌లో కన్ఫ్యూజన్ మొదలైంది. మొత్తంగా అయితే ఈ ప్రోమోతో హౌస్‌లో చాలా మార్పులు జరిగే అవకాశం అయితే లేకపోలేదు. చూద్దాం.. ఎవరెవరు త్యాగం చేస్తారో?

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Kishan Reddy: అసలు ఆట ఇంకా మొదలవ్వలే.. రానున్న రోజుల్లో మొదలుపెడతాం..!

Cyber Crime: సైబర్ మోసగాళ్ల వలలో వృద్ధుడు.. రూ.5 లక్షలు వెనక్కి వచ్చేలా చేసిన కానిస్టేబుల్.. ఏం చేశాడంటే?

The Great Pre-Wedding Show: ‘బలగం’ తరువాత మళ్లీ ఆ ఫీలింగ్ ఇచ్చిన చిత్రమిదేనట!

B. Sudershan Reddy: భావప్రకటన స్వేచ్ఛ లేకపోతే ప్రజాస్వామ్యం నిలవదు: జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి

Chain Snatching Case: పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చడానికి చైన్ స్నాచింగ్.. కానీ చివరికి బిగ్ ట్విస్ట్..!