AI City Hyderabad (imagecredit:twitter)
తెలంగాణ

AI City Hyderabad: శూన్యం నుంచి సక్సెస్ వైపు పరుగులు.. ప్రజా ప్రభుత్వ లక్ష్యం

AI City Hyderabad: హైదరాబాద్ లో ఏఐ(AI City) సిటీని నిర్మించబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీలో ఆ నిర్మాణాలను చేపడతామని సీఎం ప్రకటించారు. తమకు విల్ తో పాటు విజన్ కూడా ఉన్నదని, తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఆయన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ..ప్రభుత్వం ఓ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని, ఫర్ ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకు సాగుతుందన్నారు. ప్రపంచ వేదికపై తెలంగాణ రాష్ట్రాన్ని నంబరు వన్ గా చేయడమే తమ లక్ష్​యం అన్నారు. ఇకప్రజా ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల్లోనే 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ…తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రగ్స్ మాయగాళ్ల వెన్నులో వణుకు పుట్టించామన్నారు. పేదోడి సంక్షేమమే ప్రజాప్రభుత్వం లక్ష్​యం అన్నారు. శూన్యం నుంచి సక్సెస్ వైపు ప్రభుత్వం పరుగులు పెడుతుందన్నారు.

ఆ స్పూర్తితోనే ప్రజా ప్రభుత్వం

కృష్ణా, గోదావరీ వాటల్లో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదన్నారు. గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర్య పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని, అహింసే అస్త్రంగా మహా సంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి సరికొత్త పోరాట పంథాను పరిచయం చేసిందన్నారు. ఆ స్పూర్తితోనే ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. తెలంగాణ(Telangana) రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రభాగాన నిలబెట్టే లక్ష్యాలతో తాము పరిపాలన సాగిస్తున్నామన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించే సమయానికి దేశం అల్లకల్లోల పరిస్థితుల్లో ఉన్నదని, ఎంతో మంది మేధావుల కష్టంతో ఆధునిక భారతం వరకు ప్రయాణించగలిగామన్నారు. 79 ఏళ్ల కఠోర శ్రమ ఉన్నదన్నారు. ఈ సుదీర్ఘ ప్రస్థానం తర్వాత ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం అవతరించనున్నదన్నారు.

రైతుల విషయంలో రాజీపడలేదు

తెలంగాణ రైతుకు 2022,మే 6న వరంగల్ వేదికగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మాటిచ్చామని, ఈ మేరకు గత ఏడాది ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రంలోని 25.35 లక్షల మంది రైతులకు, రూ.20,616 కోట్ల రుణమాఫీ చేసి కొత్త చరిత్ర రాశమన్నారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా, గత పాలకుల పాపాలు శాపాలై వెంటాడుతున్నా… రైతుల విషయంలో రాజీ పడలేదన్నారు. ఇక 2023 డిసెంబర్ 7న తాము బాధ్యతలు స్వీకరించగానే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించామన్నారు.ప్రజలు, ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా విధాన నిర్ణయాలు తీసుకున్నామన్నారు. రైతులు, మహిళలు, యువత భవితకు పెద్దపీట వేశామన్నారు. సామాజిక తెలంగాణ ఆవిష్కరణకు చారిత్రాత్మక నిర్ణయాలను తీసుకున్నామన్నారు. కుల గణనతో బలహీనవర్గాల వందేళ్ల కలను నిజం చేశామన్నారు. ఎస్సీ వర్గీకరణతో దశాబ్ధాల నిరీక్షణకు తెరదించామన్నారు.

Also Read: AP Govt on Coolie: రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్.. 5 గంటలకే ఆట

70 ఏళ్లుగా పీడీఎస్ వ్యవస్థ

ఇవి గొప్ప నిర్ణయాలు మాత్రమే కాదని, అత్యంత సాహసోపేత నిర్ణయాలు అని అభివర్ణించారు.అందరినీ కలుపుకుని, అద్భుతాలు సృష్టించే సమ్మిళిత అభివృద్ధి విధానాన్ని తాము ఎంచుకున్నామన్నారు.పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో ఆధునికత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ తెలంగాణను 20 నెలల కాలంలోనే దేశానికి రోల్ మోడల్ గా నిలబెట్టామన్నారు.సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాలన అని, దీనికి చరిత్రే సాక్ష్యం అన్నారు. 70 ఏళ్లుగా పీడీఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తుందన్నారు. అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఉగాది నుంచి “సన్న బియ్యం” పంపిణీని ప్రారంభించిందన్నారు. రూ.13 వేల కోట్ల రూపాయల వ్యయంతో,3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. ఇక రేషన్ కార్డు ప్రజల ఆత్మగౌరవానికి మరో ప్రతీక అన్నారు.ఈ ఏడాది జూలై 14 నుంచి రాష్ట్రం వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించామన్నారు. పదేళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో, రేషన్ షాపుల వద్ద సందడి కనిపిస్తోందన్నారు. ఇందిరమ్మ రైతు భరోసా కింద రాష్ట్రంలోని 70 లక్షల, 11 వేల, 184 మంది రైతులకు ఈ సాయం అందించామన్నారు. సన్నాలకు క్వింటాల్ కు రూ.500 బోనస్‌ ఇస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదోడి

ఆమోదం కోసం వెయిటింగ్

స్థానిక సంస్థలలో…విద్యా, ఉద్యోగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే బిల్లులను శాసనసభలో ఆమోదించుకున్నామన్నారు. 50 రోజుల పాటు సమగ్ర కులగణనను యజ్ఞంలా చేపట్టామని, . దీని ఆధారంగా వారికి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర శాసన వ్యవస్థ ఆమోదించిన ఈ బిల్లులను ఆమోదించి, రిజర్వేషన్ల అమలుకు సహకరించాలని కేంద్రానికి పంపామన్నారు.ఆ బిల్లులపై సత్వరం నిర్ణయం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మరోసారి డిమాండ్ చేస్తున్నామన్నారు.దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని వివరించారు.సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్రంలోని ఎస్సీల్లో ఉన్న 59 ఉప కులాలను మూడు గ్రూపులుగా విభజించామన్నారు. గ్రూప్- 1 లో 15, గ్రూప్ -2 లో 18, గ్రూప్ -3 లో 26 కులాలను చేర్చామన్నారు.

నీటి హక్కులు వదులుకోం

తెలంగాణ మాగాణాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలతో పెండింగ్ ప్రాజెక్టులను లక్ష్యాలు నిర్దేశించుకుని పూర్తి చేస్తున్నామన్నారు. కృష్ణా, గోదావరి జలాల వాటాల సాధనలో రాజీ పడబోమన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తూనే, శాశ్వత హక్కుల సాధనలో విజయం సాధించేలా తమ ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికతో పని చేస్తుందన్నారు. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా, ఆ ఎత్తులను చిత్తు చేస్తామన్నారు. దృష్టి మరల్చేందుకు సెంటిమెంట్ రగిలించాలన్న కొందరి కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉన్నదన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ప్రపంచ వేదికపై తెలిసేలా పనిచేస్తున్నామన్నారు. అంతర్జాతీయ వేదికలు ఆతిధ్యం ఇస్తున్నామన్నారు.

డిసెంబరులో విజన్ 2047 డాక్యుమెంట్

ఈ ఏడాది డిసెంబరులో విజన్ 2047 డాక్యుమెంట్ ను ప్రదర్శించబోతున్నామని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రగతి, భవిష్యత్ ప్లానింగ్స్, ట్రిపుల్ ఎకానమీ వ్యవస్థ వంటివన్నీ అందులో పొందుపరుస్తామన్నారు. హైదరాబాద్ రక్షణ కోసం హైడ్రాను తీసుకువచ్చామన్నారు. ఇది అద్భుతంగా పనిచేస్తుందన్నారు. అంబర్ పేట్ బతుకమ్మ కుంటను పునరుద్ధరించామన్నారు. రూ.30 వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను హైడ్రా కాపాడిందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే హైడ్రాను అస్త్రంగా వాడుతున్నారని సీఎం మండిపడ్డారు. మరోవైపు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ లు తనకు రెండు కళ్లు లాంటివన్నారు. తెలంగాణ భవిష్యత్ ను తీర్చిదిద్దడంలో ఈ వ్యవస్థలు అద్వితీయ పాత్రను పోషిస్తాయన్నారు. శాంతి భద్రతలు ఒక రాష్ట్ర ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తాయని, దేశంలోనే ది బెస్ట్ అని తెలంగాణ పోలీసులకు పేరుందన్నారు. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం కోటికంటే ఎక్కువ జనాభా ఉన్న 18 రాష్ట్రాల పోలీసింగ్ లో తెలంగాణ పోలీస్ శాఖ మొదటిస్థానంలో నిలవడం మనకు గర్వకారణమన్నారు.

Also Read: Kannappa Film Actress: ‘కన్నప్ప’ హీరోయిన్ ఎక్కడ? టాలీవుడ్ నుంచి దుకాణం సర్దేసినట్టేనా?

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!