Transformers Robbery: ముల్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్ల దొంగల గ్యాంగ్‌ను పట్టుకొని రూ.2.50 లక్షల విలువైన కాపర్ వైర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ పింగళి ప్రశాంత్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం ముల్కనూర్ ఎస్సై సాయిబాబా, సిబ్బందితో కలిసి భీమదేవరపల్లి క్రాస్ రోడ్ వద్ద తనిఖీ నిర్వహిస్తుండగా టివిఎస్ ఎక్సెల్ బైక్‌పై సంచుల్లో తరలిస్తున్న అనుమానాస్పదంగా వెళ్తున్న ఇద్దరిని ఆపి తనిఖీ చేయగా చేతి గ్లౌజులు పనాలు స్క్రూ డ్రైవర్లు ఇనుప రాడ్లు లభించాయి.
విచారణలో వారిని కుమార్ అతని తమ్ముడు గుండి సతీష్ గా గుర్తించారు. కూలి పని చేయడం కష్టమనిపించి, సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరు ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, వేలేరు, ధర్మసాగర్, ఐనవోలు, చిల్పూరు, అక్కన్నపేట, హుజూరాబాద్, కేశపట్నం మండలాల్లోని పలు గ్రామాల్లో కలిపి 27 ట్రాన్స్‌ఫార్మర్లు రెండు కరెంట్ మోటార్లు పగులగొట్టి అందులోని కాపర్ వైర్లు ఒక మోటార్‌ను దొంగిలించేవారని, దొంగిలించిన కాపర్ వైర్లు, మోటార్‌ను ముల్కనూర్‌లోని రుద్రాక్ష తిరుపతికి విక్రయించి వచ్చిన డబ్బును జల్సాలకు ఖర్చు చేశారు. ప్రస్తుతం నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు ఏసీపీ పింగళి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఈ కేసును విజయవంతంగా ఛేదించిన ముల్కనూర్ ఎస్సై సాయిబాబా మరియు వారి సిబ్బందిని ఏసీపీ ప్రశాంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
Also Read: Anupama parameswaran: ఆ హీరోతో ముద్దు సీన్స్ బలవంతంగా చేయాల్సి వచ్చింది.. అనుపమ సంచలన కామెంట్స్

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				