Hair growth: ఒత్తైన, ఆరోగ్యమైన జుట్టు కోసం చాలా మంది హెయిర్ సీరమ్‌లు, స్కాల్ప్ స్క్రబ్‌లు లేదా కొత్త కొత్త ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయిన కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ, జుట్టు పెరుగుదలకు సహజమైన, పోషకాలతో నిండిన ఆహారాలు కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా, మెగ్నీషియం ఉండే ఈ సూపర్ ఫుడ్స్ జుట్టును బలోపేతం చేసి, రాలడాన్ని తగ్గించి, పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. అలాంటి రెండు అద్భుతమైన సూపర్ ఫుడ్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం..
1. గుమ్మడికాయ గింజలు జుట్టుకు సూపర్ హీరో
ఈ చిన్న ఆకుపచ్చ గింజలు మెగ్నీషియం ఉంటుంది. ఒక చిన్న సర్వింగ్‌తో మీ రోజువారీ మెగ్నీషియం అవసరాల్లో 40% పొందొచ్చు. మెగ్నీషియం తలలో రక్త ప్రసరణను మెరుగుపరిచి, జుట్టు కుదుళ్లను బలంగా చేస్తుంది. ఫలితంగా, జుట్టు రాలడం తగ్గి, పెరుగుదల వేగవంతమవుతుంది. ఇంకా చెప్పాలంటే, ఈ గింజల్లో జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్స్ ఉండటం వల్ల జుట్టుకు పూర్తి సంరక్షణ లభిస్తుంది.
ఎలా తినాలంటే?
ఉదయం స్మూతీలో గుమ్మడికాయ గింజలను వేసుకుని కూడా తినొచ్చు. అంతే కాదు, సలాడ్‌లో వీటిని కలిపి లేదా పచ్చిగా స్నాక్‌గా తినండి. హెయిర్ కేర్ కోసం, గుమ్మడికాయ గింజల నూనెను తీసుకుని తలకు మసాజ్ చేయండి. దీని వలన జుట్టు మెరుస్తుంది.
2. పాలకూర: జుట్టుకు సహజ మల్టీవిటమిన్
పాలకూర చూడటానికి నార్మల్ గా అనిపించినా, జుట్టు ఆరోగ్యానికి ఇది మంచి ఫుడ్. ఒక కప్పు ఉడికించిన పాలకూరలో సుమారు 157 mg మెగ్నీషియం ఉంటుంది.అంతేకాదు, ఐరన్, ఫోలేట్, విటమిన్ A కూడా సమృద్ధిగా ఉన్నాయి. ఈ పోషకాలు తలలో కాల్షియంపేరుకుపోవడాన్ని తగ్గించి, జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఫలితంగా, జుట్టు రాలడం తగ్గి, పెరుగుదలకు తోడ్పడుతుంది.
పాలకూర రుచికరమే కాదు, సూపర్ ఫుడ్
దీంతో, పాలక్ పనీర్ లేదా వెల్లుల్లితో చేసిన పాలకూర కూరలు ట్రై చేయండి. సలాడ్‌లో లేదా సూప్‌లలో జోడించండి. ఇవి మీ జుట్టుతో పాటు శరీరానికి కూడా బూస్ట్ ఇస్తుంది. ఈ సూపర్ ఫుడ్స్‌ను మీ రోజువారీ డైట్ లో చేర్చండి. మెగ్నీషియం లోపం లేకుండా చూసుకుంటే, మీ జుట్టు ఒత్తుగా, మెరిసేలా మారుతుంది.
Also Read: Viral Vayyari song: సోషల్ మీడియాలో ఓ ఊపు ఊపేసిన ‘వైరల్ వయ్యారి’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది..
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.
