Gadwal News (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Gadwal News: ఖరీఫ్ ప్రారంభమై రెండు నెలలైనా.. ఇప్పటికీ రాని భారీ వర్షాలు

Gadwal News: నిండు వేసవిలో ఎండకు బదులు వర్షం కురవగా ప్రస్తుత వర్షాకాలంలో వర్షాలకు బదులు వేసవిని తలపించేలా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ ఉక్కపోత వాతావరణంతో ప్రజలను బెంబేలెత్తిస్తోంది. జోగులాంబ గద్వాల(Jogulamba Gadwala) జిల్లాలో వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు పూర్తయినా ఆశించిన స్థాయిలో వర్షపాతం(Rainfall) నమోదు మే(May) నెలలో కురిసిన ముందస్తు వర్షాలకు పంటల సాగుపై ఎంతో ఆశలతో పొలాలను సిద్ధం చేసుకుని ప్రస్తుత ఖరీఫ్ లో పత్తి పంటను గద్వాల, అలంపూర్ ఏరియాలో అధిక విస్తీర్ణంలో పత్తి(Cotton) పంటను సాగు చేశారు. గత సంవత్సరం పత్తి సాగుతో అధిక దిగుబడులు వచ్చి తెగుళ్ల బెడద తక్కువగా ఉండడంతో రైతులకు లాభసాటిగా ఉండడం మరో వాణిజ్య పంట అయిన మిరప(Chilli) సాగుతో రైతులు వివిధ రకాల తెగులు, వైరస్ ల నివారణకు అధిక మొత్తంలో వెచ్చించి సస్యరక్షణ చర్యలు చేపట్టినా ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక పండిన పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోయారు.

గాలులకు మొక్కలు వాడు ముఖం
దీంతో రైతులు ప్రస్తుత సీజన్‌లో మిరపకు బదులు పత్తి పంటసాగుకు అధిక ప్రాధాన్యత ఇచ్చి తొలకరి వర్షాలకు సేద్యాలు చేసి పొలాల్లో పత్తి విత్తనాలు, కంది, ఆముదం, మిరప వివిధ రకాల కూరగాయల రకాలను సాగు చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఇప్పటికే పంటలు సాగు అవుతున్నా ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. తరచుగా మేఘావృతమవుతున్నా, కేవలం రెండు మూడు నిమిషాలు చిరుజల్లులు తప్ప ఇప్పటిదాకా జిల్లాలో భారీ వర్షాలు(Heavy Rains) కురిసిన దాఖలాలు లేవు. దీంతో వర్షాధారంగా సాగు చేసిన ఆరుతడి పంటలు ఎండవేడికి, ఈదురు గాలులకు మొక్కలు వాడు ముఖం పడుతున్నాయి. ఇప్పటిదాకా ఇటీవల కురిసిన వర్షాలకు కేవలం మహబూబ్ నగర్(Mehabubnagar), నాగర్ కర్నూల్(Nagar Karnul) జిల్లాలలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదయింది. దీంతో ఆ జిల్లాలో మెట్ట పంటలకు ఇటీవల కురిసిన వర్షాలతో మొక్కలకు జీవం పోసినట్లయింది.

Also Read: E Visitor passes: సచివాలయంలో ఈ-విజిటర్ పాస్.. స్కాన్ ద్వారా ఎంట్రీ

గద్వాల జిల్లాలో లోటు వర్షపాతం
జోగులాంబ గద్వాల జిల్లాలో గత రెండు నెలలుగా లోటు వర్షపాతమే నమోదు అయింది. జూన్ నెలలో 83.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 72.4 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదయింది. దీంతో జిల్లాలో 14.3 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం నమోదయింది. అదే విధంగా జులై(July) నెలలో సైతం పంటల ఎదుగుదలను బట్టి కురువాల్సిన 112.1 మిల్లీ మీటర్ల వర్షపాతంకు బదులు కేవలం 96.9 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే పలు మండలాలలో కురిసింది. ముఖ్యంగా జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District)లో ఎర్రవల్లి, ఇటిక్యాల, ధరూర్ ,మానపాడు మండలాలలో తక్కువ వర్షపాతం నమోదు కాగా అటు పక్కనున్న వనపర్తి జిల్లాలో అమరచింత, ఆత్మకూరు మండలాలలో సైతం తక్కువ వర్షపాతం నమోదయింది.

భూగర్భ జలాలు సైతం తగ్గుముఖం
ముందు మురిపించి ప్రస్తుతం వరుణుడు జాడ లేకపోవడంతో భూగర్భ జలాలు సైతం తగ్గుముఖం పడుతున్నాయి. బోర్లు, బావులు ఉన్న రైతులు(Farmers) సాగు చేసిన పంటలను బతికించుకునేందుకు డ్రిప్(Drip) ద్వారా నీరు అందిస్తున్నారు. భారీ వర్షాలు కురిసి చెరువు, కుంటలలో ఉండాల్సిన నీరు లేకపోవడంతో భూగర్భ జలాలు తగ్గడంతో నీరు అందక విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులకు మోటర్లు సైతం కాలిపోతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వేసవి మాదిరి ఎండలు దంచి కొడుతుండడంతో పంటలు సాగు చేస్తున్న రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరిగి ఈదురు గాలులు వీస్తుండడంతో వేడి తాపానికి భూమిలో తేమశాతం తగ్గి ఆకులు జోలేసి మొక్కలు గిడసబారిపోతున్నాయి. ఇప్పటికే ఆశించిన స్థాయిలో జిల్లాలో పంట సాగు విస్తీర్ణం జరగకపోగా సాగు చేసిన పంటలకు సైతం ఆశించిన స్థాయిలో వర్షాలు(Rains) లేకపోవడంతో పంటల దిగుబడులపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి ప్రకోపానికి తాము బలైపోతున్నామని వరుణుడు కరుణించి భూతాపాన్ని తీర్చాలని రైతులు వెయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. గద్వాల మండలం జమ్మిచేడు గ్రామంలో మండలంలో రైతులు కృష్ణమ్మ నీటిని తెచ్చి సమీప దేవాలయాలలో పూజలు చేస్తూ వరుడు కరుణించాలని వేడుకుంటున్నారు.

Also Read: Nehru Family Protest: నెహ్రూ హత్య పై ములుగు పీఎస్ ముందు కుటుంబీకుల ఆందోళన

పంటల సాగుకు రైతుల మొగ్గు
ఇప్పటికే సగం వర్షాకాలం పూర్తి అవడంతో రానున్న రోజులలో స్వల్పకాలిక పంటలైన మినుము(Minu), పెసర, మొక్కజొన్న, జొన్న(Corn), అలిసెందా, నువ్వులు తదితర పంటల సాగు అనుకూలంగా ఉంటుందని రైతులు వాటివైపు మొగ్గు చూపుతున్నారు. మేము ప్రతి సంవత్సరం పొగాకు(Tobacco) పంటను సాగు చేస్తామని, పొగాకు విత్తనాలు నారుమడులను సిద్ధం చేసుకుని విత్తుకోగా ఇప్పటికీ మొక్క ఎదగాల్సి ఉండగా ఎండ వేడిమికి మొలకెత్తిన మొక్కలు కమిలిపోతున్నాయని, వాతావరణ(wether) ప్రతికూల పరిస్థితులతో ఎన్ని మందులు పిచికారి చేస్తున్నా మడులలో పొగాకు నార నిలవడం లేదని రైతు శ్రీరాములు మరయు షాబాద్ అన్నారు.

పత్తి పంట వేసి రెండు నెలలు అవుతుందని, వర్షాలు లేక పంట ఎదుగుదల లోపించిందని జూన్(Jun) నెలలో మిరపనారు పోశామని, ప్రస్తుతం మిరప పంట సాగుకు సిద్ధమవుతున్నా, అందుకు తగ్గట్లు వర్షాలు కురువకపోవడంతో విధిలేక బోర్లలో తక్కువ నీరు ఉన్నా పొలాలను సిద్ధం చేసుకుని డ్రిప్పు(Drip) ద్వారా నీరు పెట్టి పంట సాగుకు మిరపనారు నాటామన్నారు. వర్షాలు రాకపోతే రైతుల పరిస్థితి దయనీయంగా మారే అవకాశం ఉందని రాజు అనే రైతు ఆవేదన వ్యక్తంచేశాడు.

Also Read: Meenakshi Natrajan: ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్.. రంగాపూర్ నుంచి పాదయాత్ర షురూ!

Just In

01

Maruthi responds: వారికి ‘ది రాజాసాబ్’ దర్శకుడు స్ట్రాంగ్ కౌంటర్.. ఫ్యాన్స్‌‌‌‌ నుంచి అది చాలు..

Tariff on Movies: సినీ ఇండస్ట్రీకి ట్రంప్ షాక్.. సినిమాలపై 100 శాతం టారిఫ్ విధింపు

Chiranjeevi: క్రికెటర్ తిలక్ వర్మపై మెగాస్టార్ పోస్ట్ వైరల్.. ఏం అన్నారంటే?

POK Protests: పీవోకేలో కల్లోలం.. సామాన్యులపై ఆర్మీ, ఐఎస్ఐ కాల్పులు.. ఇద్దరు మృతి

Local Body Elections: నాగర్ కర్నూల్ జిల్లాలో స్థానిక ఎన్నికల సందడి.. ఆశావాహుల్లో మెుదలైన టెన్షన్!