Bhatti Vikramarka: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేదలకు, మధ్య తరగతి ప్రజలకు ఆర్థికంగా ఉతమిచ్చిందని శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)అన్నారు. బీజేపీ ప్రభుత్వం పేదలను, మధ్య తరగతి ప్రజలను కార్పొరేట్ సంస్థలకు ధారదత్తం చేసేలా కొత్త చట్టాన్ని తీసుకువచ్చిందని తీవ్రస్థాయిలో ఆయన విమర్శించారు. దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ఈ పథకం ఆనాడు యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. మహాత్మాగాంధీ దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారని ఆయన చెప్పారు.
Also Read: Bhatti Vikramarka: అభివృద్ధిలో మధిర పట్టణం ఉరకలు పెట్టాలి: భట్టి విక్రమార్క
దేశ సమగ్రత కోసం కృషి
స్వాతంత్రం అనంతరం ఆరు నెలల్లో హత్య చేశారన్నారు. ఆయన రక్తం దేశం భూమి పోరల్లో కలిసి పోయిందని చెప్పారు. సోనియా గాంధీ గారు దేశ సమగ్రత కోసం కృషి చేశారని పేర్కొనన్నారు. రాజీవ్ గాంధీ కూడా దేశం కోసం ప్రాణాలిచ్చారన్నారు. మీరెవరైనా దేశం కోసం ఒక్క రక్తపు బొట్టు అయినా కార్చారా? అంటూ బీజేపీని ఆయన ప్రశ్నించారు. ఈ చర్చలో బీఆర్ఎస్ పాల్గొనకపోవడం దురద్రుష్టకరం అని చెప్పారు. వాళ్లకు పేదల మీద ప్రేమ లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాజకీ లబ్ది తప్ప ప్రజల మీద ఆలోచన లేదని విమర్శించారు. బీజేపీ తీసుకువచ్చిన చట్టానకి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం బీఆర్ఎస్ కు లేదన్నారు.
రాష్ట్రాల మీద భారం వేయడమే కదా?
అంతేకాక వారికి మద్దతుగా ఉండే ఆలోచన మాత్రమే ఉంది. ఇది రాష్ట్రానికి ఏ మాత్రం మంచిది కాదన్నారు. ఉపాధి హామీ పథకాన్ని మార్చేసి 60-40కి ఎలా మారుస్తారు? అని ప్రశ్నించారు. ఇది రాష్ట్రాల మీద భారం వేయడమే కదా? అని వివరించారు. కర్నాటక 100 రూపాయలు ఇస్తే.. 25 నుంచి 30 రూపాయలు ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు 100 రూపాయలు ఇస్తే.. 35 నుంచి 40 రూపాయలు ఇస్తున్నారన్నారు. ఉత్తర్ ప్రదేశ్ 100 రూపాయలు ఇస్తే 350, బీహార్ 100 రూపాయలు ఇస్తే 650య రూపాయలు ఇస్తున్నట్లు వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాలు ఏం పాపం చేశాయని మండిపడ్డారు.
Also Read: Bhatti Vikramarka: 13న సీఎం టీమ్‌తో ఫ్రెండ్లీ మ్యాచ్.. ఉప్పల్‌లో పకడ్బందీగా ఏర్పాట్లు!
గృహ జ్యోతి పథకం ద్వారా.. 52.82 లక్షల మంది లబ్ధి
గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు లబ్ధిదారులకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు. శాసనమండలిలో సభ్యురాలు విజయశాంతి ప్రశ్నకు సమాధానం గా ఆయన వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్పటివరకు గృహ జ్యోతి లబ్ధిదారుల సంఖ్య 52, 82, 498 లక్షల మంది కాగా వీరి పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 3,593.17 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలకు చెల్లించిందని డిప్యూటీ సీఎం వివరించారు.
ఎస్పీడీసీఎల్ పరిధిలో గృహ జ్యోతి లబ్ధిదారుల సంఖ్య 25,35,560 లక్షల మంది కాగా ఎన్పీడీసీఎల్ పరిధిలో 27,46,938 లక్షల మంది ఉన్నారు అని తెలిపారు. ఈ పథకం ద్వారా 52 ,82 ,498 లక్షల కుటుంబాలకు 3,593.17 కోట్లు బాగా అవడం మూలంగా వారు సామాజికంగా, ఆరోగ్యకరంగా, ఆర్థికంగా ఎదిగేందుకు పిల్లలను మంచి చదువులు చదివించుకునేందుకు ఈ పథకం ఉపయోగపడిందని డిప్యూటీ సీఎం తెలిపారు.

