Sridhar Babu: మున్సిపల్ పరిపాలన వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) తెలిపారు. జీహెచ్ఎంసీ(GHMC)లో పౌరులకు మెరుగైన సేవలను అందించేందుకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు. అసెంబ్లీలో పురపాలక, జీహెచ్ఎంసీ(GHMC) చట్టసవరణ బిల్లుపై చర్చలో మాట్లాడారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే గ్రేట విలీనం అన్నారు. మూసీ విషయంలో సీఎం ఎవరి పేర్లు ప్రస్తావించలేదు. పేర్లు ప్రస్తావించనప్పుడు భారత రాష్ట్ర సమితి సభ్యులు ఎందుకు స్పందిస్తున్నారు. మూసీ విషయంలో సభ్యుల సూచనలు స్వీకరిస్తామని సీఎం చెప్పారు.
Also Read: Minister Sridhar Babu: నైపుణ్యాలే యువత భవిష్యత్తు.. ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు!
అందరి అభిప్రాయాలు తీసుకుని ముందుకెళ్తాం
గ్రేటర్ను ఎన్ని కార్పొరేషన్లుగా విభజించాలో అందరి అభిప్రాయాలు తీసుకుని ముందుకెళ్తాం. గ్రేటర్ హైదరాబాద్ను మూడు కార్పొరేషన్లుగా విభజించాలని ప్రాథమికం అనుకుంటున్నామని తెలిపారు. నగరంలోని పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలకు తరలించే ప్రక్రియ చేపట్టామన్నారు. హైదరాబాద్ను 360 డిగ్రీలు కవర్ చేసేలా.. మెట్రో విస్తరణ చేపట్టాలని నిర్ణయించాం. అనుమతులు, నిర్వహణలో సమస్యలు రావొద్దనే మెట్రో రైలు ప్రాజెక్టును ప్రభుత్వం టేకోవర్ చేస్తోందన్నారు.
మున్సిపాలిటీలను పటిష్టం చేయడానికి కృషి
ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ విస్తరణ తో రహదారులు, డ్రైనేజీ, ట్రాఫిక్ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ లతో సమగ్ర ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామన్నారు. ఏకీకృత, ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి, సుస్థిర అభివృద్ధి చేయబోతున్నామన్నారు. గ్రేటర్ లో కలిసిన మున్సిపాలిటీలో పన్నుల్లో మార్పు ఉండదని. ఉత్తమ పద్ధతులు అనుసరిస్తామని.. సాధారణ పౌరులపై భారం వేయమని వెల్లడించారు. మున్సిపాలిటీలను పటిష్టం చేయడానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. గ్రేటర్ పై డ్రాఫ్ట్ ప్రతిపాదనలు సిద్ధం చేశామని.. ఇప్పటివరకు 5935 సూచనలు వచ్చాయని ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగుతామని వెల్లడించారు.
Also Read: Minister Sridhar Babu: డిజిటల్ సేఫ్టీలో రోల్ మోడల్‌గా తెలంగాణ.. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు!

