Minister Sridhar Babu: తెలంగాణను డిజిటల్ సేఫ్టీలో దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే “తెలంగాణ రైజింగ్ విజన్ – 2047” డాక్యుమెంట్ లోనూ కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్ ను పొందుపర్చామన్నారు. హెచ్ఐసీసీ లో నిర్వహించిన “సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్ సీ ఎస్ సీ) కాంక్లేవ్ 2025″ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
Also Read: Minister Sridhar Babu: తెలంగాణ ఫ్యూచర్ సిటీలో ఏఐ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు
సైబర్ నేరగాళ్లు సవాలు
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ…. రోజుకో తరహాలో మోసాలకు పాల్పడుతూ సైబర్ నేరగాళ్లు సవాలు విసురుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా 265 మిలియన్లకు పైగా సైబర్ దాడులు జరిగాయన్నారు. తెలంగాణలోని కీలక రంగాలకు చెందిన సంస్థలు, కంపెనీలపై గతేడాది 17వేలకు పైగా రాన్సమ్ వేర్ దాడులు జరిగినట్లు ఓ ప్రముఖ సెక్యూరిటీ సంస్థ అధ్యయనంలో తేలిందన్నారు. ఒక్క సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఏడాది వ్యవధిలో రూ.800 కోట్లకు పైగా సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టడం వాస్తవ పరిస్థితికి నిదర్శనమన్నారు. ఇలాంటి తరుణంలో సాంప్రదాయ పోలీసింగ్ కాకుండా స్మార్ట్ పోలీసింగ్ అవసరమని గుర్తు చేశారు.
Also Read: Minister Sridhar Babu: తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో మహిళల కీలక పాత్ర : మంత్రి శ్రీధర్

