Student Died( IMAGE credit: swtcha reporter or twiiter)
క్రైమ్

Student Died: హాస్టల్ భవనంపై నుంచి పడి ఇంటర్ విద్యార్థిని మృతి

Student Died: మంచిర్యాల జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మీమ్స్ ఇంటర్మీడియట్ కళాశాల భవనం మూడవ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి సహస్ర అనే విద్యార్థిని మృతి చెందింది. కళాశాల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తూ విద్యార్థిని బంధువులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన చేపట్టాయి. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి అంజయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించి, నూతనంగా నిర్మించిన ఈ భవనంలో కళాశాల ఏర్పాటుకు అనుమతులు లేవని స్పష్టం చేశారు.

 Also Read: Mana Ooru Mana tourism: ప్రతీ జిల్లాలో టూరిజం ప్రాంతాల అభివృద్ధి, ప్రమోట్ చేసేలా కసరత్తు!

న్యాయం చేయాలని డిమాండ్

కిటికీలకు ఇనుప చువ్వలు లేకపోవడం, భవనంలో పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించకుండానే తరగతులను ప్రారంభించారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. విద్యార్థిని బలిగొన్న కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐపీ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహించాయి. పోలీసుల హామీతో వారు ఆందోళన విరమించారు. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 Also Read: Sheep scheme Scam ED: గొర్రెల స్కాంలో ఈడీ దూకుడు..హైదరాబాద్‌లో 10 చోట్ల దాడులు

Just In

01

Jubilee Hills bypoll: పీజేఆర్ కుటుంబాన్ని 3 గంటలు బయట నిలపెట్టాడు.. జూబ్లీహిల్స్ ప్రచారంలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Boy Swallows Gold: పొరపాటున బంగారు బిల్ల మింగేసిన బాలుడు.. దాని విలువ ఎంతో తెలుసా?

The Girlfriend: రిలీజ్‌కు ముందు ఉండే టెన్షన్‌ లేదు.. చాలా హ్యాపీగా ఉన్నామంటోన్న నిర్మాతలు.. ఎందుకంటే?

SI Suicide: దారుణం.. కుటుంబ కలహాలతో ఎస్సై ఆత్మహత్య.. ఎక్కడంటే?

Arrive Alive program: రోడ్డు భద్రత కోసం ప్రత్యేక వ్యూహం.. డీజీపీ శివధర్ రెడ్డి కీలక ప్రకటన