Real Estate Scam: ప్రీ లాంచ్ ఆఫర్ పేరిట మరో రియల్ ఎస్టేట్ సంస్థ జనాన్ని నిలువునా ముంచింది. 30 నెలల్లోపు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఫ్లాట్లు అప్పగిస్తామని వందల మంది నుంచి కోట్లాది రూపాయలు చేసింది. అయితే, గడువు ముగిసినా ఏ ఒక్కరికి కూడా ఫ్లాట్‌ను అప్పగించలేదు. ఇంకో ట్విస్ట్ఏమిటంటే ప్రీ లాంచ్ ఆఫర్ పేర డబ్బులు వసూలు చేసిన రియల్ఎస్టేట్ సంస్థ నిర్వాహకులు ఓ ప్రైవేట్ఫైనాన్సర్ నుంచి భారీ మొత్తంలో అప్పు తీసుకోవడమే. రుణం ఇవ్వటానికి ముందు సదరు ఫైనాన్సర్ప్రాజెక్ట్ భూములను తన పేరున రాయించుకున్నారు.
అయితే, ఇప్పుడు ఆ భూముల్లోకి ఎవరినీ రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఈ కారణంగా తాము అడ్వాన్సులు కట్టిన వారికి న్యాయం చేయలేకపోతున్నామంటూ సదరు రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాహకులు వాపోతున్నారు. ఒక రకంగా ఈ వివాదంలో తాము కూడా బాధితులమే అని అంటున్నారు. దీంతో సొంత ఇల్లు కలను నిజం చేసుకుందామని కష్టపడి సంపాదించిన డబ్బును అడ్వాన్సులుగా కట్టిన వందలాది మంది దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తమకు న్యాయం చేయాలంటూ శనివారం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదులు చేశారు.
Also Read: Etela Rajender: ప్రభుత్వాలు ప్రేమతో ఇవ్వట్లేదు.. పోరాటాల ద్వారానే పథకాలు
ఏమిటీ ఫ్రీ లాంచ్?
నాగరాజు ఛైర్మన్‌గా, శివరామకృష్ణ మేనేజింగ్ డైరెక్టర్‌గా, పొన్నారి సీఈవోగా కొన్నేళ్ల క్రితం భారతీ బిల్డర్స్ సంస్థ ఏర్పాటైంది. కొంపల్లి భానూర్‌లో ఈ సంస్థ 6.5 ఎకరాలను వేర్వేరు వ్యక్తుల నుంచి కొనుగోలు చేసింది. ఆ తర్వాత అపార్ట్‌మెంట్లను నిర్మిస్తున్నామని, ప్రీ లాంచ్ ఆఫర్ ప్రకటించింది. దీంతో ఫ్లాట్లు బుక్ చేసుకున్న వారికి డిస్కౌంట్ ఇస్తామని ప్రచారం చేసింది. అనుమతుల కోసం హెచ్ఎండీఏకు దరఖాస్తులు కూడా చేశామని చెప్పింది. ఇది చూసిన 250 మందికి పైగా జనం ప్రీ లాంచ్ఆఫర్ స్కీం కింద భారతీ బిల్డర్స్‌కు లక్షల రూపాయలు కట్టారు.
ఈ మేరకు వారితో ఎంఓయూలు కుదుర్చుకున్న భారతీ బిల్డర్స్ 24 నుంచి 30నెలల్లోపు ప్రాజెక్ట్ పూర్తి చేసి ఫ్లాట్లను అందచేస్తామని చెప్పింది. ఈలోపు మూడు విడతల్లో మిగితా డబ్బును చెల్లించాలని పేర్కొంది. దీనికి అంతా ఒప్పుకొన్నారు. అయితే, రెండేళ్లు గడిచినా భారతీ బిల్డర్స్ సైట్‌లో నిర్మాణం పనులు చేపట్టలేదు. దీంతో అడ్వాన్సులు చెల్లించిన వారు ప్రశ్నించగా త్వరలోనే పనులు మొదలవుతాయనంటూ చెబుతూ వచ్చింది. ఇదిలా ఉండగా కొంపల్లి భానూర్ లోని భారతీ బిల్డర్స్‌కు చెందిన భూముల్లో ‘దిల్ల్యాండ్ బిలాంగ్స్‌టు సునీల్ కుమార్‌అహుజా’ అన్న బోర్డు వెలియటంతో అడ్వాన్సులు కట్టిన వారు ఖంగు తిన్నారు. వెంటనే భారతీ బిల్డర్స్ ఛైర్మన్ నాగరాజు, ఎండీ శివరామకృష్ణ, సీఈవో పొన్నారిలను కలిసి అసలేం జరిగిందంటూ నిలదీశారు.
ఇదీ జరిగింది..
ప్రాజెక్టును పూర్తి చేయటానికి అవసరమైన డబ్బులు లేకపోవటంతో నాగరాజు, శివరామకృష్ణ, పొన్నారి కలిసి ప్రైవేట్ఫైనాన్సర్అయిన సునీల్ కుమార్ అహుజా వద్ద 49 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. ప్రాజెక్ట్‌పూర్తి కాగానే వడ్డీతో సహా తీసుకున్న రుణం చెల్లిస్తామన్నారు. అప్పు ఇవ్వటానికి అంగీకరించిన సునీల్కుమార్అహుజా భానూర్‌లోని భూములను తన పేరన రిజిస్ట్రేషన్చేయించుకున్నాడు. అప్పు తీరిన తర్వాత భూములను వెనక్కి ఇచ్చి వేస్తానని చెప్పాడు. అయితే, తీసుకున్న అప్పు 49 కోట్ల రూపాయలతోపాటు వడ్డీగా మరో 21కోట్లు కలిపి భారతీ బిల్డర్స్ యాజమాన్యం చెల్లింపులు జరిపినా భూములు మాత్రం వెనక్కి ఇవ్వలేదు. పైగా, ఆ భూముల్లోకి ఎవ్వరినీ రానివ్వటం లేదు.
దాంతో ప్రీ లాంచ్ఆఫర్ స్కీంలో అడ్వాన్సులు చెల్లించిన బాధితులు నాగరాజు, శివరామకృష్ణ, పొన్నారిలను కలవగా తాము ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నట్టుగా చెప్పారు. తీసుకున్న అప్పును వడ్డీతో సహా కట్టినా సునీల్ కుమార్ఆహూజా భూములను వెనక్కి ఇవ్వటం లేదని తెలియచేశారు. తాము కూడా బాధితులమే అని చెప్పారు. దాంతో అడ్వాన్సులు చెల్లించిన వారు 2024లో సైబరాబాద్ కమిషనరేట్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు పోలీసులు నాగరాజు, శివరామకృష్ణ, పొన్నారితో పాటు సునీల్‌కుమార్ ఆహూజాలపై కూడా కేసులు నమోదు చేశారు. దీంట్లో నాగరాజు, శివరామకృష్ణ, పొన్నారిలను అరెస్ట్ కూడా చేశారు. కాగా, సునీల్ కుమార్ ఆహూజా తనకున్న పరిచయాల ద్వారా ఈ కేసులో అరెస్ట్ కాకుండా తప్పించుకున్నాడని బాధితులు చెబుతున్నారు.
Also Read: Telangana: ‘సిగాచీ’ దుర్ఘటనపై హైకోర్టులో మాజీ సైంటిస్ట్ పిల్
మేం సిద్ధం…
భారతీ బిల్డర్స్‌కు చెందిన నాగరాజు, శివరామకృష్ణ, పొన్నారిలతో మాట్లాడగా ప్రీ లాంచ్ స్కీం(Pre-launch scheme)లో భాగంగా అడ్వాన్సులు చెల్లించిన వారికి న్యాయం చేయటానికి తాము సిద్ధంగా ఉన్నట్టు చెప్పారని బాధితులు తెలిపారు. అయితే, అప్పు చెల్లించినా సునీల్ కుమార్ ఆహూజా భూములను వెనక్కి ఇవ్వటం లేదని చెప్పారన్నారు. సునీల్‌కుమార్ ఆహూజా భూములు వెనక్కి ఇస్తేనే తాము ఏదైనా చేయగలమని అంటున్నారన్నారు. ఈ క్రమంలోనే తమకు న్యాయం చేయాలని కోరుతూ పలువురు బాధితులు శనివారం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదులు చేశారు.
సునీల్ కుమార్ ఆహూజాది ఇదే దందా….
అప్పులు ఇవ్వటం, ఆస్తులు కొట్టేయటం సునీల్ కుమార్ అహూజా, అతని కుమారుడు ఆశిష్ కుమార్అహూజాల దందాగా తెలుస్తోంది. మోకిలా గ్రామానికి చెందిన షేక్‌ఫరీద్ అనే వ్యాపారిని కూడా తండ్రీకొడుకులు కలిసి ఇదేవిధంగా మోసం చేయటం గమనార్హం. దీనిపై షేక్‌ఫరీద్ ఫిర్యాదు చేయగా మోకిలా పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. వ్యాపారం చేస్తున్న షేక్ ఫరీద్ కొంతకాలం క్రితం డబ్బు అవసరమై ఆశిష్, సునీల్‌ల నుంచి 17కోట్ల రూపాయలను 2శాతం వడ్డీకి అప్పుగా తీసుకున్నాడు.
రుణం ఇచ్చే ముందు తండ్రీ కొడుకులు కలిసి గ్యారంటీ పేరిట షేక్ఫరీద్కు చెందిన మోకిలా గ్రామం సర్వే నెంబర్లు 123/ఏ/2లోని 0.14గుంటలు, 123/ఏ/2/1లోని 0.14గుంటలు, 138/ఏఏలోని 726 చదరపు గజాల ప్లాటు, శంకర్ పల్లి మండలంలోని దోబీపేట్ గ్రామం సర్వే నెంబర్ 410లోని 2 ఎకరాలు, 0.03గుంటల, ఖానాపూర్ గ్రామం సర్వే నెంబర్ 236లోని ఎకరం భూమిని తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇక, షేక్ ఫరీద్ కొంతకాలం తర్వాత తీసుకున్న అప్పు రూ.17 కోట్లతోపాటు వడ్డీగా మరో 5కోట్లను తండ్రీ కొడుకులకు చెల్లించాడు.
అయినా, ఆశిష్ కుమార్ ఆహూజా, సునీల్ కుమార్ ఆహూజాలు ఇప్పటికీ ఆయన భూములను వెనక్కి ఇవ్వలేదు. పైగా, మోకిలా గ్రామంలోని షేక్ ఫరీద్ భూములను ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా షేక్ ఫరీద్ తోపాటు ఆయన మనుషులను తమకు అడ్డుగా వస్తే చంపేస్తామంటూ బెదిరించారు కూడా. ఈ మేరకు షేక్ ఫరీద్ ఫిర్యాదు చేయగా మోకిలా పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 329(3), 351(2) రెడ్ విత్ 3(5) సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు.
Also Read: Viral News: తాగకుండానే బస్ డ్రైవర్‌కు ఆల్కాహాల్ పాజిటివ్.. ఎంక్వైరీ చేస్తే!