Etela Rajender (image CREDIT: TWITTER)
నార్త్ తెలంగాణ

Etela Rajender: ప్రభుత్వాలు ప్రేమతో ఇవ్వట్లేదు.. పోరాటాల ద్వారానే పథకాలు

Etela Rajender: రాష్ట్ర ప్రజలు పొందుతున్న అనేక సంక్షేమ పథకాలు పోరాటాల ద్వారా వచ్చాయని, అంతే తప్ప ప్రభుత్వాలు ప్రేమతో ఇవ్వలేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender) వ్యాఖ్యానించారు. ఓల్డ్ బోయినపల్లిలో  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో మందకృష్ణ( Mandha Krishna) మాదిగకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ తెలంగాణ గడ్డపై మందకృష్ణ ( Mandha Krishna) అంటే తెలియని వ్యక్తి ఉండరని కొనియాడారు. మందకృష్ణ(Mandha Krishna) ఆశయం నెరవేర్చడంలో కిషన్ రెడ్డి ఎంతో ప్రయాసపడ్డారన్నారు.

 Also Read: Kishan Reddy: మందకృష్ణది అలుపెరుగని పోరాటం.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

జాతి సమస్యపై 30 ఏండ్లు ఉద్యమం

చిన్నపిల్లలకు ఇబ్బందులు వస్తే చచ్చిపోవడమేనా అనే ఆవేదనతో పోరాడితే దానికి స్పందించిన ప్రభుత్వం ఆరోగ్యశ్రీ(Arogyashri) పథకానికి నాంది పలికేలా చేసిందని గుర్తుచేశారు. వికలాంగులు, వృద్ధుల పెన్షన్ కోసం లక్షలాది మందితో మీటింగులు పెట్టిన వ్యక్తి మందకృష్ణ మాదిగ అని వ్యాఖ్యానించారు. ఒక జాతి సమస్యపై 30 ఏండ్లు ఉద్యమాన్ని కొనసాగించడం ఎంత కష్టమో తనకు తెలుసన్నారు. జాతి కోసం పోరాడి గమ్యాన్ని ముద్దాడిన ఏకైక నాయకుడు మందకృష్ణ మాదిగ అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ స్వయంగా వచ్చి సమస్య పరిష్కరిస్తానని అభయమిచ్చారని వ్యాఖ్యానించారు. మందకృష్ణ(Mandha Krishna)కు పద్మశ్రీ(Padma Shri)అవార్డు ఇచ్చి గౌరవించడం ఈ జాతికి దక్కిన గౌరవమన్నారు. మందకృష్ణ మాదిగ తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ అని ఈటల రాజేందర్(Etela Rajender) కొనియాడారు.

 Also Raad: MP Etala Rajender: ఈటల ముందు గోడు వెళ్లబోసుకున్న అభిమానులు

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?