MP Etala Rajender: ఈటలతో గోడు వెళ్లబోసుకున్న అభిమానులు
MP Etala Rajender (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

MP Etala Rajender: ఈటల ముందు గోడు వెళ్లబోసుకున్న అభిమానులు

MP Etala Rajender: 20 ఏళ్లుగా మీ వెంట ఉన్నాం మీ అడుగులో అడుగు వేసి నడిచాం. ఇప్పుడు మమ్మల్ని ఎవరు చేతిలో పెట్టారు. మమ్మల్ని పట్టించుకున్న నాధుడే లేకుండా పోయారు. మా కస్టసుఖాల్లో భాగస్వామిగా ఉన్న మీరు మల్కాజిగిరికి(Malkajigiri) వెళ్ళిన తరువాత మాకు దిక్కు లేకుండా పోయింది అంటూ హుజురాబాద్(Huzurabad) నియోజక వర్గంలోని బీజేపీ శ్రేణులు, అభిమానులు ఆదివారం ఈటల రాజేందర్(Etala Rajender) ముందు వారు గోడు వెళ్లబోసుకున్నారు.

హనుమకొండ జిల్లా కమలాపూర్, కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో వేర్వేరు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన అనుచరులు చుట్టూ ముట్టి మా తిప్పలు ఎవరికి చెప్పుకోవాలి, మాకు దిక్కు దశ లేకుండా పోయారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మాకు ఏం దిశ నిర్దేశం చేస్తున్నారని ఈటలను అడిగారు. దానికి సంధించిన ఆయన మాట్లాడుతూ మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు. నేను మీ వెంట ఎప్పటికీ ఉంటా అని హామీ ఇచ్చారు.

Also Read: Ramanthapur: రామంతాపూర్‌లో హృదయ విదారక ఘటన

వార్డు మెంబర్ నుంచి జడ్పీటీసీ వరకు అన్ని గెలిపించుకుంట
హుజురాబాద్ నియోజకవర్గంలో గత 20 సంవత్సరాల కాలంలో ఎలాగైతే వార్డు సభ్యుల నుంచి మొదలుకుని జడ్పిటిసి వరకు గెలుచుకున్నామో అలాగే ఈ సారి కూడ తప్పకుండ గెలుచుకుని తీరుతాం. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో హుజూరాబాద్ నియోజకవర్గంకు వస్తా ఇక్కడే ఉండి మీకు అండగా నిలబడుతా. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మీ తరుపున ప్రచారం చేసి గెలిపించే బాధ్యత తీసుకుంటా అని ఈటల రాజేందర్ హామీ ఇచ్చి క్యాడర్‌లో భరోసా నింపారు.

Also Read: Gaddam Prasad Kumar: ఈ సంస్కృతిని ఉక్కు పాదంతో అణిచివేయాలి

 

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..