Ramanthapur: తల్లి గర్భం నుంచి బయట పడి ప్రపంచాన్ని చూసిందో లేదో అప్పుడే రోడ్డుపాలై అనాధగా మారిందో పసికందు(Baby). అప్పుడే పుట్టిన మగ శిశువును రోడ్డు పక్కకు వదిలేసి వెళ్లారు. మరి ఏ పాపం తెలియని ఆ పసికూనకు అంత పెద్ద శిక్ష ఎవరు విధించారో. ఉప్పల్ రామంతాపూర్(Ramanthapur)లో చోటు చేసుకున్న ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రామంతాపూర్ వివేక్ నగర్ సమీపంలో అప్పుడే జన్మించిన మగ శిశువుని రోడ్డు పక్కన గుర్తుతెలియని మహిళ వదిలిపెట్టి వెళ్ళింది. ఆ మగశిశువుని గమనించిన స్థానికుడు కౌశిక్(Kaushik) అనే వ్యక్తి తెల్లవారుజామున 3.41 గంటలకు పోలీసులకు సమాచారం అందించాడు.
చికిత్స కోసం నీలోఫర్ హాస్పిటల్లో బాబు అడ్మిట్
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని 108 అంబులెన్స్‌కి సమాచారం ఇచ్చారు.108 సిబ్బందితో కలిసి ఉప్పల్ పోలీసులు ప్రథమ చికిత్స కోసం నీలోఫర్ హాస్పిటల్లో(Nilofar Hospital) బాబుని అడ్మిట్ చేయించారు. వైద్యులు బాబుని పరిశీలించి ప్రస్తుతానికి క్షేమంగానే ఉన్నాడని తెలిపారు. బాబుని తీసుకుని కానిస్టేబుల్ శ్రీనివాస్, షౌకత్ అలీ,108 సిబ్బంది టెక్నీషియన్ యాదగిరి, పైలెట్ ప్రణయ్ నీలోఫర్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పోలీసులు(Police) కేసు నయోదుచేసుకొని దర్యాప్తు చేస్తామని తెలిపారు.
ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. కాలం మారుతున్నప్పటికి రాను రాను మనుషులలో మానవత్వం మరింత కరువైతుందని ఇలాంటి సంఘటనలు చూస్తే మనకు అర్ధం అవుతుంది. నవమాసాలు మోసినతల్లి తీరా చివరికి తన బిడ్డని వదిలేసిదంటే ఆ తల్లి ఎంతటి వేదనలో ఉందో మరి ఇంకేమైనా భాదలో ఉందో మనం అలోచించే విషయమే.
Also Read: Vijayawada: వీధి కుక్కలపై అమానుషం.. వాడు అసలు మనిషేనా!