Aaraa Mastan: లిటిగేషన్ భూముల్లో ఆరా మస్తాన్ మాయ?
Aaraa Mastan
లేటెస్ట్ న్యూస్, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Aaraa Mastan: లిటిగేషన్ భూముల్లో ఆరా మస్తాన్ మాయ?

  • పాత టైటిల్ అంటూ తప్పుడు దారులు!
  • సీనియర్ అసిస్టెంట్‌తో పెండింగ్ జీపీఏ క్లియర్
  • చెక్‌లు ఇవ్వకుండానే సేల్ డీడ్‌లో మెన్షన్?
  • వివాదాస్పద భూమిలో దూరిపోయిన పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్సర్
  • నాయకుల పరిచయంతో కథంతా నడిపిస్తున్న తీరు
  • వివాదం, కోర్టు ఆర్డర్ ఉన్నా అక్రమంగా జీపీఏ, సేల్ డీడ్స్
  • మెట్టుగూడలో ఆరా మస్తాన్, చైతన్య శ్రీధర్ వ్యవహారంపై అనుమానాలు?
  • పొజిషన్ లేని భూమిలో టైటిల్ పేరుతో అడ్డదారులు?
  • ఇరు పార్టీలపై కేసులు నమోదు చేసిన చిలకలగూడ పోలీసులు
  • ఎలాంటి కేసులు లేవని కోర్టును తప్పుదారి పట్టించే ప్రయత్నం
  • ఎలాగైనా భూమిని దక్కించుకునేందుకు తప్పుల మీద తప్పులు

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
స్వేచ్ఛ ఎడిటర్


Aaraa Mastan: మెట్టుగూడలో 5,715 గజాలు, పాత సర్వే నెంబర్ 733. కొత్తది 790/1/పీ. 1954లో నర్సి పాంచా అనే వ్యక్తి చార్మినార్ పాట్రీ సెరామిక్ ప్రాడక్ట్స్ కంపెనీ నడిపేవారు. 1961లో జీఎన్ మెహతా, ఏఎన్ షా‌ కు భూమి అమ్మకం జరిపారు. ఇది వ్యక్తిగత భూమా, కంపెనీకి చెందిన కామన్ స్టాకా అంటూ టైటిల్‌పై వివాదం ఉన్నది. ఇండస్ట్రియల్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసే కుమార స్వామి అనే వ్యక్తికి మొదటి నుంచి ఈ ఇండస్ట్రీ వాళ్లతో ఆర్ధిక సంబంధాలు ఉండేవి. నలుగురు కుమారులు ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో కంపెనీల్లో చేరలేకపోయమని వారి వాదన. 1964లో ఈ కంపెనీ నుంచి డైరెక్టర్స్ ఎగ్జిట్ అయ్యారు. కొంతమంది జాయిన్ అయ్యారు. జీఎన్ మెహతా కుటుంబం పేరు మీదకు ల్యాండ్ వచ్చింది. కంపెనీకి చెందిన కామన్ స్టాక్ అంటూ 1970 నుంచి కుమార స్వామి కుమారులు పొజిషన్‌లో ఉన్నారు. వీరికి చార్మినార్ కంపెనీతో పాటు, విజయ ఇండస్ట్రీ ఉండేది. వీరి కంపెనీలో 1979 డిసెంబర్ 5న డీడ్ ఆఫ్ పార్టిషన్ కమ్ రిటైర్మెంట్ అంటూ సెటిల్మెంట్ చేసుకున్నారు. అందుకు రూ.42,251 చెల్లించి ఏఎన్ షా కుటుంబం కైవసం చేసుకున్నది. కంపెనీ పేరు మీదగా ఉందని 2005లో హర్షద్ ఎన్ షా తో పాటు ఐదుగురు విజయ ఇండస్ట్రీ పేరు మీదగా భూమి ఉందని ఫ్యామిలీలో పార్టిషన్ డీడ్ చేసుకున్నారు. దీనిపై పొజిషన్‌లో ఉన్న కుమార స్వామి కుటుంబం ఓఎస్ నెంబర్ 332 ఆఫ్ 2006 దాఖలు చేశారు. 20 ఏండ్లుగా పొజిషన్‌లో ఉన్నందున ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. దీనిపై అప్పీల్(ఐఏ 156/2008)కు వెళ్లారు. కింది కోర్టు తీర్పును సమర్ధించింది. ఇలా 2016లో 2017లో వివిధ కోర్టుల్లో పొజిషన్ హక్కుదారులు అంటూ విచారణ జరిగింది. ఈ భూమిపై ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయరాదని(రిట్ పిటిషన్ 18810/2021) హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

మెహతా కుటుంబంతో చక్రం తిప్పిన మస్తాన్ టీం


టైటిల్‌ విషయంలో హర్షద్ ఎన్ షా, కుమార స్వామి కుటుంబానికి సివిల్ కోర్టుల్లో వివాదాలు నడుస్తున్నాయి. హర్షద్ ఎన్ షా 2005 పార్టీషన్ సూట్‌కు టైటిల్ లేదని ముంబైలో ఉండే మెహతా కుటుంబాన్ని రంగంలోకి దింపారు. అప్పటికే జీఎన్ మెహతా కుమారుడు జితేంద్ర మెహతా మరణించారు. ఎలాంటి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ లేకుండానే, సికింద్రాబాద్‌లో ఫ్యామిలీ సర్టిఫికేట్ తయారు చేసుకుని కుటుంబంలోని ముగ్గురు హార్ధిక్ మెహతా జీపీఏ చేయించి ఇచ్చారు. ఈ భూమిపై రిజిస్ట్రేషన్స్ చేయొద్దని హైకోర్టు ఆర్డర్ (డబ్ల్యూపీ 18810/2021) ఉండడంతో సబ్ రిజిస్ట్రర్ రేణుక పెండింగ్‌లో(డాక్యుమెంట్ నెం. పీ 15/2023) పెట్టారు. సబ్ రిజిస్ట్రార్ లేని సమయంలో సీనియర్ అసిస్టెంట్ వెంకటరమణ రిజిస్ట్రేషన్(డాక్యుమెంట్ నెం. 347/2023) చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీని వెనుక ఆరా మస్తాన్ టీం లో సభ్యుడైన జయరాం ఉన్నట్లు తెలుస్తున్నది. జిల్లా రిజిస్ట్రార్‌తో మేనేజ్ చేసుకుంటామని బురిడీ కొట్టించారు. ఈ వంకతో తమకు పార్టీషన్ సూట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాల్సిందేనని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

చెక్‌లు ఇవ్వలేదు.. పాస్ కాలేదా?

హార్ధిక్ మెహతా నుంచి తాము కొనుగోలు చేస్తున్నట్లు చైతన్య గ్లోబల్ విస్టా స్కూల్ యజమాని మల్లెంపాటీ శ్రీధర్, ఆరా పొలిటికల్ సర్వే సంస్థ అధినేత షేక్ మస్తాన్ సేల్ డీడ్ నెం. 3452/ 2024, 3479/2024 ద్వారా పొజిషన్ లేకుండానే కొనుగోలు చేశారు. వీరు సేల్ డీడ్‌లో పేర్కొన్నట్లు 2023లో ఆన్ లైన్ ట్రాన్సఫర్స్ చేసినా కోటిన్నర మాత్రమే నిజమని తెలుస్తున్నది. మిగితావి శ్రీధర్ చెక్స్ (నెం. 327614 నుంచి 327618 వరకు) ఇచ్చారు. వీటి విలువ రూ.4 కోట్లు. కానీ, విక్రయదారుడికి చేరలేదు. ఇంకా క్లైం కాలేదు. ఆరా మస్తాన్ ప్రస్తావించిన చెక్స్‌లో 20 లక్షలు మాత్రమే క్లైం అయ్యాయి. మిగితావి (చెక్ నెం. 014126 నుంచి 014130 వరకు) అమ్మకపు దారుడికి చేరలేదు. వీటి విలువ 9 కోట్ల 40 లక్షల వరకు ఉంటుంది. ఒక్క డాక్యుమెంట్‌కు రూ.42 లక్షలు. మరొకరు రూ.73 లక్షలు స్టాంప్ డ్యూటీ చెల్లించిన ప్రాపర్టీకి ఐటీ అధికారులు ఆరా తీస్తే ఇరుకున పడే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో వీరికి టైటిల్ క్లియర్ అయినా ఈ డాక్యుమెంట్ వాలిడిటీ ఎంత అనేది నిత్యం వెంటాడుతూ ఉంటుంది. ఐటీకి లెక్కలు చెప్పాల్సిందే. తమకు చెక్స్ క్లియర్ కాలేదని జీపీఏ హోల్డర్ హర్ధిక్ మెహతా ‘స్వేచ్ఛ’కు తెలిపారు.

పోలీసులతో పొజిషన్ ఖాళీ చేయించే ప్రయత్నం

ఎలక్షన్ సర్వేల పేరుతో ఆరా మస్తాన్ రాజకీయ నాయకులకు చాలా దగ్గర అయ్యాడు. ఈయన స్వస్థలం ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరిపేట. తెలంగాణలో ఏ పార్టీ లీడర్‌తో అయినా ఫోన్‌లో మాట్లడగలరు. దీంతో ఆయన పోలీసుల నుంచి పొజిషన్ తీసుకునేలా స్టాండెర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ద్వారా వెళ్లారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ విచారణ జరిపారు. దీంతో ఈస్ట్ జోన్ డీసీపీ పొజిషన్‌లో ఉన్న వారిని టైటిల్ ఉందని చెప్పుకుంటున్న వారిని పిలిచి మాట్లాడారు. ఎన్నో కోర్టు ఆర్డర్స్ ఉన్నందున పోజిషన్ దారులకు హక్కులు ఉన్నాయి. ఖాళీ చేయించడం పోలీసులకు హక్కు లేదు. అందుకు ఎడిక్షన్ ఆర్డర్ తప్పనిసరి. కాంప్రమైజ్ కోసం అడ్వకేట్స్‌ను, పోలీసుల నుంచి ఒత్తిళ్లు చేసి పొజిషన్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకు ఇరు వాచ్ మెన్‌లను పెట్టారు. బోర్డులు రాసుకుంటున్నారు. తుడుపేసుకుంటున్నారు. పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పొజిషన్ దారులు ఆరోపిస్తున్నారు. దీంతో రోజు రోజుకూ ఈ సమస్య జఠిలంగా మారింది.

Read Also- Pawan kalians: ‘హరి హర వీరమల్లు’ సక్సెస్ మీట్.. అలా చేయడంలో తప్పులేదు

కోర్టునే తప్పుదారి పట్టించారా?

ఆరా మస్తాన్ తనకు 1961లో ఉన్న సేల్ డీడ్ ఆధారంగా టైటిల్, పొజిషన్ ఉందని పోలీసులే అడ్డుకుంటున్నారని, హైకోర్టు తీర్పుతో భూమిలోకి ఎంట్రీ ఇవ్వొచ్చని ప్లాన్ వేశారు. అందుకు పోలీసుల కలుగజేసుకోకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని ఈ నెల 16న రిట్ పిటిషన్(నెం. 20680/2025) దాఖలు చేశారు. ఈ నెల 18న జస్టిస్ వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. ఈ ల్యాండ్‌పై ఎలాంటి కేసులు లేవని కోర్టుకు తెలియజేస్తూ, జీపీ కూడా అదే విషయాన్ని కోర్టుకు తెలిపే ప్రయత్నం చేశారు. కానీ, చిలకగూడ పోలీస్ స్టేషన్‌లో వీళ్లపై కబ్జా కేసు(ఎఫ్ఐఆర్ నెం. 322/2023) ధర్మాసనం గుర్తించింది. దీంతో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండానే ఆ ఎఫ్‌ఐఆర్‌పై చార్జ్‌షీట్ ఫైల్ చేయాలని ఆదేశించింది. మరో వైపు పొజిషన్‌లో ఉన్న కుటుంబాలపై నమోదైన కేసు(క్రైం నెం.297/2025)లో స్టే ఇస్తూ అరెస్ట్ చేయొద్దని గత రికార్డులను పరిశీలించిన హైకోర్టు జస్టిస్ తుఖారంజీ ధర్మాసనం వచ్చే నెల 22కి వాయిదా వేసింది. ఇలాంటి సివిల్ కేసులో క్రిమినల్ ఇంటెన్షన్స్ ఉంటున్నాయని తెలంగాణ పోలీసుల తీరుపై సుప్రీం కోర్టు ఇటీవలే మొట్టికాయలు వేసింది.

నిర్మాణాలెన్నో, ఏం ఉన్నాయో తెలియకుండానే సేల్ డీడ్

మొత్తం 5715 గజాల భూమిలో 1961లో నిర్మాణం చేసిన 7 బెడ్రూం ఇళ్లు ఉన్నాయి. మరో 300 గజాల్లో రేకుల షెడ్లు ఉన్నాయి. కానీ, వీళ్లు కొనుగోలు చేసినప్పుడు కేవలం 100 ఫీట్ల రూం ఉన్నట్లు సేల్ డీడ్‌లో పేర్కొన్నారు. రూ.50 కోట్ల విలువ చేసే భూమి రూ.2 కోట్లకు రావడంతో పొలిటికల్, పోలీస్ పవర్ ఉపయోగించి దర్జాగా దోచేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తున్నది. మొత్తంగా పబ్లిక్ పల్స్ అంటూ సర్వేయర్ ఆరా మస్తాన్, హైదరాబాద్‌లోని లిటిగేషన్ భూముల్లో వేలు పెట్టి భారీగా సంపాదించాలనే ప్రయత్నంలో చేస్తున్న తప్పుల మీద తప్పులు బయటపడుతున్నాయి. విద్యా సంస్థల అధినేత లిటిగేషన్ భూములపై భారీగానే అడ్వాన్స్‌లు ఇచ్చినట్లు సమాచారం. ఏదో నాలుగు మాటలు చెప్పి సర్వే అంటూ పొలిటికల్ లీడర్స్‌నే ప్రభావితం చేసే వాళ్ల పవర్ వాడుకుని ల్యాండ్ డీలింగ్స్‌లో తల దూర్చితే ఏదో ఒక చోట దొరికిపోక తప్పదని విషయం తెలిసిన వారంతా అంటున్నారు.

Read Also- Health: మసాలాలు ఎక్కువ తింటే అల్సర్ వస్తుందా?.. అసలు నిజాలు ఇవే

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..