veeramallu success( image source :X)
ఎంటర్‌టైన్మెంట్

Pawan kalians: ‘హరి హర వీరమల్లు’ సక్సెస్ మీట్.. అలా చేయడంలో తప్పులేదు

Pawan kalyan: పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘హరి హర వీరమల్లు’ సినీ ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ సంపాదించుకుంది. నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే టాలీవుడ్ లో ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది. ఇంతటి విజయం సాధించిన సినిమాకు సక్సెస్ మీట్ నిర్వహించారు నిర్మాతలు. అందులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ చరిత్రలో మొఘలుల చేసిన మంచిని మాత్రమే చెప్పింది. వారి కాలంలో జరిగిన దుర్మార్గాలను చూపించడానికి ఈ సినిమా తీసాం. డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, కానీ నా సినిమా కోసం పంచాయతీలు చేయాల్సి వస్తుంది అనుకోలేదు. కొందరు ఈ సినిమాని క్విట్ ఇండియా మూమెంట్ లాగా బైకాట్ అన్నారు. ఏం చేశారు? ఏం జరగలేదు. అభిమానులు సున్నితంగా ఉండకండి. సోషల్ మీడియాలో అన్యాయాలపై దాడి చేయండి. ఒకరు మన కోసం నెగిటివ్‌గా మాట్లాడుతున్నారు అంటే మనం బలంగా ఉన్నామని అర్థం. మన బలం ఏమిటో మనకు తెలుసు అంటూ చెప్పుకొచ్చారు.

Read also- BC Reservation Bill: ముస్లింలకు ఇచ్చే రిజర్వేషన్లకు బీజేపీ విరుద్దం: కిషోర్ రెడ్డి

‘2019 లో నేను ఓడిపోయినపుడు కొందరు అనుకున్నారు. ఎలా ఉంటాడో చూడాలని అనుకున్నారు. బలంగా నిలబడ్డాను ఇప్పుడు గెలిచాను. అప్పుడు ఒక అడుగు ముందుకు వేస్తేనే కదా ఈ రోజు మీ ముందు డిప్యూటీ సీఎంగా ఉన్నాను. అక్బర్ గ్రేట్ అంటాం కానీ.. శ్రీ కృష్ణ దేవరాయలు.. రాణి రుద్రమదేవి గ్రేట్ అనము. మన రాజులపై చిన్నచూపు చూసినట్లు అనిపిస్తుంది. మన నేలపై బతికిన మొఘలులకు మనము పన్ను కట్టడం ఏంటి. ఔరంగజేబు సన్నివేశాలు సెన్సిటీవ్ అనుకున్నాం. రాజకీయ జీవితంపై కూడా ప్రభావితం అవుతుందేమో అనిపించింది. అయినా వారు చేసినవే కదా చెప్పేది. అలాంటప్పుడు అది సెన్సిటివ్ ఎలా అవుతుంది అని అనిపించింది. కోహినూర్ వజ్రం కంటే మన సంస్కృతీ గొప్పదని ఈ సినిమా చెప్తుంది. ఈ దేశంలో వేదాలను కోహినూర్ లాగా భద్రపరచాలి ఇది నాకు నిజమైన విజయం.’ అని అన్నారు.

Read also- Sapta Sindhu 2025: ఆలయ నమూనాల పోటీల్లో ఆర్కిటెక్చర్ విద్యార్థుల అద్భుత ప్రతిభ

ఇదే సందర్భంలో హరి హర వీరమల్లు పార్ట్ 2 గురించి కూడా ప్రస్తావించారు. ఇప్పటికే దాదాపు 30 శాతం పూర్తయిందని, మిగిలింది కూడా వీలైనంత త్వరలో ప్రారంభం అవుతుందని ఆశిస్తున్నానన్నారు. ఈ సినిమా గురించి ఏం చెప్పినా తీసుకుంటామని, పార్ట్ 2 లో ఇంకా బాగా ఉంటుందని అన్నారు. ఈ సినిమాపై కొందరు రాజకీయ నాయకులు బైకాట్ మూమెంట్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే దాని వల్ల ప్రయోజనం లేకపోగా సినిమా ప్రమోషన్ కు బాగా ఉపయోగపడింది. ఇప్పటికే ఈ సినిమా టాలీవుడ్ ప్రీమియర్ షో రికార్డులను బ్రేక్ చేసింది. హిట్ టాక్ తెచ్చుకుని హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!