BC Reservation Bill: రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ(BJP) మెదక్ జిల్లా కార్యాలయంలో మెదక్(Medak) జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ పై ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి(Poreddy Kishore Reddy) హజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 42 శాతానికి బీసీ(BC)ల రిజర్వేషన్ పెంచుతామని తెలంగాణ(Telanagana) గవర్నమెంట్ చెప్పినప్పుడు మేము స్వాగతించాం కానీ భారత రాజ్యాంగం అంబేద్కర్(Ambedkar) చెప్పిన మతపరమైన రిజర్వేషన్లు స్వాగతించమని చెప్పామని అన్నారు. అందులో భాగంగానే ఈ తెలంగాణ గవర్నమెంట్ 42 శాతం లో కొత్తగా ఎప్పుడూ లేనివిధంగా ముస్లింలలో ఓబిసి ముస్లింలు 10 శాతం అని చెప్తూ బీసీ సమాజాన్ని మోసం చేస్తున్న ప్రభుత్వమని ఆయన విమర్శించారు.
Also Read: Nagarkurnool district: నాగర్‌కర్నూల్ జిల్లాలో నయా మోసం.. అధికారులపై వేటు!
అసలు ఇది ముస్లిం రిజర్వేషన్
గతంలో ముస్లింలది 4 శాతం అయితే ఇప్పుడు కొత్తగా 4 శాతం నుండి 10 శాతానికి పెంచడం అంటే 150 శాతం వాటా వాళ్లది పెంచడమేనని అన్నారు. అసలు బీసీ(BC)లది మొదటగా 28% ఇప్పుడు అందులో ఈ బీసీ రిజర్వేషన్ అని తెచ్చి 42 శాతం అంటే అందులో 10% ముస్లిం ఓబీసీ(OBC)లు అని చెప్తున్నారు. 42 శాతం లో 10% పోతే ఇప్పుడు కొత్తగా బీసీలకు 32 శాతం అంటే ఈ గవర్నమెంట్ బీసీలకు 28 నుండి 32 కు అంటే 15% పెరగడం జరిగిందని తెలిపారు. అసలు ఇది ముస్లిం రిజర్వేషన్ అని బీసీ రిజర్వేషన్ అనేది ప్రజలు గమనిస్తున్నారని, ఈ గవర్నమెంట్ కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్(Congress) పార్టీ నాయకులు మాట్లాడుతూ మేం బీసీ నాయకుడికి రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చాం జాతీయ అధ్యక్షుడు ఇచ్చాం అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఒక్క బీసీ నైనా ముఖ్యమంత్రిగా మీ జాతీయ పార్టీ పేరును పంపించిందా అని ప్రశ్నించారు. 42 శాతం వాటాలో భాగంగా క్యాబినెట్లో ఎంతమంది బిసి మంత్రులు ఉన్నారని అన్నారు.
Also Read: Vijay Devarakonda: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్.. అంతలోనే భారీ షాక్
ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, MLN రెడ్డి, స్టేట్ కౌన్సిల్ మెంబర్ రాగి రాములు, సుభాష్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ మధుసూదన్, గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రాముల నాయక్ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.