Cancer Symptoms: మన శరీరంలో కనిపించే చిన్న చిన్న మార్పులే ఓసారి పెను ప్రమాదానికి దారి తీయవచ్చు. క్యాన్సర్ లాంటి మహమ్మారి బారిన పడ్డామని తెలియజేసేందుకు అవి సంకేతాలు కావొచ్చు. హెల్త్ కోచ్ డిలాన్.. చిన్నపాటి అనారోగ్య లక్షణాలను విస్మరించి చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. తొలినాళ్లలో క్యాన్సర్ లక్షణాలను తాను విస్మరించానని.. ఆ ప్రారంభ సంకేతాలు ప్రతీ ఒక్కరు గమనించాలని సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం అతడు పెట్టిన పోస్ట్.. అందరిని దృష్టిని ఆకర్షిస్తోంది.
రాత్రిళ్లు విపరీతమైన చెమట
25 ఏళ్ల హెల్త్ కోచ్ డిలాన్ పటేల్ తనకు స్టేజ్ 4B హాడ్కిన్స్ లింఫోమా క్యాన్సర్ (Stage 4b hodgkin’s lymphoma) ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత తన అనుభవాన్ని పంచుకున్నాడు. తాను రెండేళ్ల పాటు క్యాన్సర్ లక్షణాలను పట్టించుకోలేదని తన ఇన్ స్టాగ్రామ్ పోస్టులో తెలిపారు. తొలుత రాత్రి సమయాల్లో విపరీతంగా చెమటలు (Night Sweats) పట్టాయని ఆయన అన్నారు. దాని వల్ల ఒంటిపై బట్టలతో పాటు బెడ్ షీట్ కూడా తడిచిపోయేదని చెప్పారు. అయితే ఈ విషయాన్ని తాను చాలా తేలిగ్గా తీసుకున్నట్లు చెప్పారు. పని ఒత్తిడి లేదా వ్యాయమం చేస్తుండటం వల్ల అలా వచ్చిందని తొలుత భావించినట్లు అన్నారు.
తట్టుకులేనంత దురద
కొద్ది రోజుల తర్వాత చర్మంపై దురదలు రావడం మెుదలైందని హెల్త్ కోచ్ డిలాన్ తెలిపారు. ఎంత గోకినా తీరని భరించలేని దురద పుట్టేదని పేర్కొన్నారు. కొన్ని సార్లు రక్తం వచ్చేలా గోక్కునే పరిస్థితి తలెత్తినట్లు చెప్పారు. తర్వాత క్రమంగా అలసట ఫీలయ్యానని అన్నారు. ఎంతగా నిద్రపోయినా ఆ అలసట అసలు తగ్గేది కాదని పేర్కొన్నారు. ఛాతిలో నొప్పి రావడం కూడా మెుదలు కావడంతో వైద్యుడ్ని సంప్రదించానని.. అయితే రోజు చేసే వ్యాయమాల వల్ల కండరాలపై ఒత్తిడి ఏర్పడి ఉండొచ్చని ఆయన తనతో చెప్పారని పేర్కొన్నారు.
Also Read: Khushi Kapoor: అవును సర్జరీ చేయించుకున్నా.. అయితే ఏంటీ.. హీరోయిన్ ఫైర్!
ఆ క్షణం ఎంతగానో బాధపడ్డ!
అలా 12 నెలల పాటు ఆ లక్షణాలతో తాను పోరాడినట్లు డిలాన్ అన్నారు. ఈ క్రమంలో మెడ, చంకల కింద గడ్డలు రావడం మెుదలయ్యాయని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. దీంతో ఏదో తీవ్రమైన సమస్య ఉందని తనకు అర్థమైందని చెప్పారు. వైద్యుడ్ని సంప్రదించి పరీక్షలు చేయించుకోగా.. తనకు స్టేజ్ 4B హాడ్జికిన్స్ లింఫోమా క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని డిలాన్ చెప్పారు. దీంతో ఒక్కసారిగా తాను షాక్ అయ్యాయని చెప్పారు. తనలో రెండేళ్లుగా క్యాన్సర్ పెరుగుతూ వచ్చిందని పేర్కొన్నారు. క్యాన్సర్ అని తేలిన క్షణంలో భయం, కోపం, బాధ, ఆందోళన ఒక్కసారిగా తనను చుట్టుముట్టాయని డిలాన్ చెప్పారు. కాబట్టి ఏదైనా పెను ముప్పు సంభవించే ముందు మన శరీరాలు చిన్న చిన్న సంకేతాలు ఇస్తాయని.. వాటిని ఎట్టిపరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. తాను చెప్పిన లక్షణాలు మీలోనూ కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలను నెటిజన్లకు సూచించారు.
View this post on Instagram