Khushi Kapoor (Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్, లేటెస్ట్ న్యూస్

Khushi Kapoor: అవును సర్జరీ చేయించుకున్నా.. అయితే ఏంటీ.. హీరోయిన్ ఫైర్!

Khushi Kapoor: స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) సోదరి ఖుషీ కపూర్.. ముఖానికి కాస్మెటిక్ సర్జరీ (Cosmetic surgery) చేయించుకుందంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఓ జాతీయ మీడియా (National Media)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నది నిజమేనని అంగీకరించారు. అదే సమయంలో తనను టార్గెట్ చేస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు

ఖుషీ ఏమన్నదంటే?
తన లుక్స్ మార్చుకునేందుకు కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నట్లు బాలీవుడ్ నటి (Bollywood Actress) ఖుషీ కపూర్ ఒప్పుకున్నారు. తద్వారా గతంతో పోలిస్తే తన రూపాన్ని మార్చుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే 10-20 సార్లు సర్జరీ చేయించుకున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవ లేదని ఆమె పేర్కొన్నారు. రూపాన్ని మెరుగుపరుచుకోవడం అంత పెద్ద విషయం కాదని భావిస్తున్నట్లు చెప్పారు.

‘నా ముఖంలో ప్రతీది మార్చలేదు’
దివంగత నటి శ్రీదేవి (Sri devi) కూతురైన ఖుషి కపూర్.. తాను ముక్కు, పెదాలకు సర్జరీ చేయించుకున్నట్లు గతంలోనే అంగీకరించారు. తాజాగా ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘నేను ఇలాగే పుట్టలేదు. నటీనటులందరూ తమ రూపాన్ని మెరుగుపరుచుకుంటారు. అందం అనేది మా జీవితాల్లో పెద్ద భాగం. నేను నా రూపం గురించి శ్రద్ధ వహిస్తాను. అలా అని నా ముఖంలో ప్రతీది మార్చలేదు’ అని ఖుషీ అన్నారు.

అవమానంగా ఫీల్ కావొద్దు
అయితే ఎవరైనా తమ రూపాన్ని మార్చుకుంటే దాన్ని ఒప్పుకోవడం చాలా ముఖ్యమని ఖుషీ కపూర్ అభిప్రాయపడ్డారు. అలా చెప్పకుంటే యువతకు అన్యాయం చేసిన వారమవుతామని పేర్కొన్నారు. చాలా మంది ప్లాస్టిక్ సర్జరీ అంటే అవమానంగా భావిస్తారని.. దీనికి సంబంధించి తనపై చాలా విమర్శలే వచ్చాయని అన్నారు. కానీ వాటిని పట్టించుకోలేదని ఖుషీ అన్నారు. ప్లాస్టిక్ సర్జరీ (Plastic Surgery) చేసుకుంటే అవమానంగా ఫీల్ కావాల్సిన పనిలేదని.. అది కేవలం వ్యక్తిగత ఎంపిక మాత్రమేనని చెప్పుకొచ్చారు.

Also Read: Money Saving Tips: రూ.50 వేలతో రూ.50 లక్షలు సంపాదించే అద్భుతమైన టిప్స్.. మిస్ చేస్కోవద్దు!

ఖుషీ కపూర్ సినీ నేపథ్యం
ఖుషీ కపూర్ విషయానికి వస్తే.. ఆమె నవంబర్ 5, 2000 ఏడాదిలో జన్మించారు. 2020లో వచ్చిన ‘స్పీక్ అప్’ అనే షార్ట్ ఫిల్మ్ లో ‘నైనా’ పాత్ర పోషించి నటిగా మారారు. 2023లో వచ్చిన ది అర్చీస్ (The Archies) సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టారు. ఈ ఏడాది లవ్ యపా (Loveyapa), నదానియన్ (Nadaaniyan) చిత్రాలతో హిందీ ప్రేక్షకులను పలకించారు. ఫాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్ (Fabulous Lives of Bollywood Wives) సిరీస్ లోనూ ఆమె గెస్ట్ రోల్ లో కనిపించి అందరి ఆకట్టుకున్నారు.

Also Read This: Thai Women: సన్యాసులకు వలపు వల.. 80 వేల నగ్న వీడియోలు.. కిలేడీ గుట్టురట్టు!

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ