CPI Narayana: సీఎంను బ్లాక్ మెయిల్ చేస్తారా.. సీపీఐ నేత ఫైర్!
CPI Narayana (Image Source: Twitter)
Telangana News

CPI Narayana: సీఎం రేవంత్‌ను బ్లాక్ మెయిల్ చేస్తారా.. సీపీఐ నారాయణ ఫైర్!

CPI Narayana: సీఎంను బ్లేమ్ చెయ్యడం అంటే బ్లాక్ మెయిల్ చెయ్యడమేనని సీపీఐ నేత నారాయణ అన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం సీఎం పని చేస్తారని, తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఇద్దరు సీఎంలు మాట్లాడుకుంటే పరిష్కారం జరుగుతుందని చెప్పారు. నీళ్లను సృష్టించలేం, ఉన్న వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదేనని అన్నారు. సముద్రంలోకి దాదాపు 2వేల టీఎంసీలు పోతూనే ఉంటాయని, ఉమ్మడి రాష్ట్రంలో కూడా నీటి సమస్య ఉండేదని గుర్తు చేశారు.

జల వివాద పరిష్కారాల కోసం కమిటీ వేయడం మంచిదేనన్న నారాయణ ఈ ప్రక్రియను నాన్చకుండా త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ‘‘నీళ్ల విషయంలో లెక్కలు తేల్చాలి. ఎవరు ఎన్ని వాడుతున్నారో లెక్క పెట్టండి. సమస్యలు పరిష్కరించుకోవాలి. ఎవరేం ప్రాజెక్టులు కట్టాలనుకుంటున్నారో ప్రపోజల్ పెట్టాలి. మిగులు జలాలకు సంబంధించి ఒక అంచనా వేసుకోవాలి. జలాల సమస్య పరిష్కారం కాకుండా కొత్త ప్రాజెక్టులు కట్టడం కరెక్ట్ కాదు. సాధ్యం కానివి సుసాధ్యం చేయడానికి ప్రభుత్వం ఉంది. రాయల సీమ కరువు ప్రాంతం. సీమకు నీళ్ళు కావాలని డిమాండ్ ఎప్పటి నుంచో చేస్తున్నాం. నీళ్లను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయొద్దు. తల్లిని అడ్డు పెట్టుకుని రాజకీయం చేసినట్లు అవుతుంది’ అని నారాయణ అన్నారు.

Also Read: Fish Venkat: ఫిష్ వెంకట్ మృతి పట్ల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంతాపం

ఏపీ, తెలంగాణలో రాజకీయ పబ్బం కోసం నీళ్లను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నని సీపీఐ నేత నారాయణ ఫైర్ అయ్యారు. ‘రెండు రాష్ట్రాలు పరిష్కరించుకుని సమృద్ధిగా జలాలను ఉపయోగించుకుని బాగుపడాలి. రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞానికి మొదట సపోర్ట్ చేసింది మేమే. నీటి ప్రాజెక్టులకు మేం ఎప్పుడూ మద్దతిస్తాం. కాళేశ్వరానికి పునాదులు సరిగ్గా వెయ్యలేదు. రాజకీయ జోక్యం జరిగింది. పెళ్లి అప్పుడు పెళ్లి మంత్రం, చావు అప్పుడు చావు మంత్రం వాడాలి. బనక చర్లపై అతిగా ప్రవర్తిస్తున్నారు. దాని జోలికి పోవద్దు అన్నాను. పాత ప్రాజెక్టులు పూర్తి చెయ్యాలి. ప్రస్తుతం బనకచర్ల ప్రయారిటీ కాదు. కొందరు సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. సెంటిమెంట్ పర్మినెంట్ కాదు. తెలంగాణ సెంటిమెంట్ పోవడానికి కారణం కేసీఆర్. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మర్చారు. కేసీఆర్ క్యాబినెట్‌లో తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు 12 మంది ఉండే వాళ్ళు. బీఆర్ఎస్ రెచ్చగొట్టే వాఖ్యలు చేస్తున్నది’ అని నారాయణ మండిపడ్డారు.

Also Read This: Money Saving Tips: రూ.50 వేలతో రూ.50 లక్షలు సంపాదించే అద్భుతమైన టిప్స్.. మిస్ చేస్కోవద్దు!

Just In

01

Akhanda2: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసలు పొందిన బాలయ్య ‘అఖండ 2 తాండవం’..

Gold Rates: ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?

Chiranjeevi Movie: ‘మనశంకరవరప్రసాద్ గారు’ షూటింగ్ పూర్తి.. ఎమోషన్ అయిన దర్శకుడు..

Labour Codes: కొత్త లేబర్ కోడ్స్‌పై స్పష్టత.. పీఎఫ్ కట్ పెరుగుతుందా? టేక్-హోమ్ జీతం తగ్గుతుందన్న భయాలపై కేంద్రం క్లారిటీ

Shambala Movie: సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల’ నుంచి ‘నా పేరు శంబాల’ సాంగ్ రిలీజ్..