Fish Venkat: టాలీవుడ్‌లో మరో విషాధకర ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూశారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించిన ఫిష్ వెంకట్ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు పొందాడు. దాదాపు స్టార్ హీరోలందరితో నటించాడు. అయితే, గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. ఆయన నెల క్రితం హైదరాబాద్‌లోని చందానగర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన రెండు కిడ్నీలు పాడైనట్లు వైద్యులు నిర్ధారించారు. చికిత్సకు అవసరమైన ఆర్థిక సాయం కోసం ఫిష్ వెంకట్ కుమార్తె రెండు రోజుల క్రితం మీడియా ద్వారా సహాయం కోరినప్పటికీ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా కిడ్నీ మార్పిడి సాధ్యపడలేదని సమాచారం. ఈ విషాదం టాలీవుడ్‌ను శోకసంద్రంలో ముంచెత్తింది. ఈ క్రమంలోనే తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ట్విట్టర్ వేదికగా సంతాపాన్ని తెలిపారు.
Also Read: Congress Government: రేవంత్ సర్కార్ లో మహిళలకు అధిక ప్రాధాన్యత.. జహీరాబాద్ లో మహిళా శక్తి సంబరాలు
డైలాగ్ డెలివరీతో తెలుగు సినీ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
ప్రముఖ సినీ హాస్యనటుడు ఫిష్ వెంకట్ మృతి పట్ల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ” పలు సినిమాల్లో ఫిష్ వెంకట్ తనదైన నటన, కామెడీ , డైలాగ్ డెలివరీతో తెలుగు సినీ ప్రేక్షకులకు దగ్గరయ్యారని అన్నారు. విషాదంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోదైర్యం ఇవ్వాలని ప్రార్ధిస్తూ, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఫిష్ వెంకట్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని” సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని తెలిపారు.