Money Saving Tips: ప్రస్తుత రోజుల్లో డబ్బుకు ఉన్న ప్రాముఖ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంటి నుంచి అడుగు బయటపెట్టిన దగ్గర నుంచి ప్రతీది డబ్బుతో ముడిపడిన అంశమే. నానాటికి పెరుగుతున్న అవసరాలు, ఖర్చుల నేపథ్యంలో.. భవిష్యత్ కోసం కొంతమేర డబ్బును పొదుపు చేయడం చాలా అవసరం. అయితే నెలకు రూ.50,000 సంపాదన ఉన్నవారు.. పదేళ్లలో రూ.50 లక్షలు పొదుపు చేయగల అద్భుతమైన చిట్కాలను ఈ కథనం ద్వారా మీ ముందుకు తీసుకొచ్చాం. వాటిపై ఓ లుక్కేయండి.
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP)
10 సంవత్సరాల్లో రూ. 50 లక్షల సంపదను సృష్టించాలంటే ఏడాదికి రూ. 5 లక్షలు పొదుపు చేయాల్సి ఉంటుంది. దీని కోసం మీ ఆదాయంలో కొంత భాగాన్ని ఎక్కువ రాబడి ఇచ్చే సాధానాల్లో నిరంతరం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆ మార్గాల్లో బెస్ట్ ఛాయిస్ గా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP)ను చెప్పవచ్చు. నెలకు రూ.50 వేలు జీతం పొందే వ్యక్తులకు మ్యూచువల్ ఫండ్స్‌లో SIPలు అనువైనది. పదేళ్లలో 50 లక్షల టార్గెట్ ను రీచ్ కావాలంటే సిప్ లో నెలకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దానికి సగటున 12% వార్షిక రాబడి (ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సాధారణంగా లభించే వడ్డీ రేటు) కలుపుకుంటే 10 పదేళ్లలో దాదాపు రూ. 47 లక్షలు సంపాదించవచ్చు. ప్రతి సంవత్సరం పెట్టుబడిని 3% పెంచితే ఈ మొత్తం రూ. 51 లక్షలకు పైగా అందుకోవచ్చు.
ఖర్చుల నియంత్రణ
రూ.50వేల జీతంలో రూ.20,000 పెట్టుబడిగా పెట్టాలంటే ఖర్చులను నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది. మీ నెలవారి ఖర్చులపై అవగాహన వచ్చేలా బడ్జెట్ సిద్దం చేయండి. దేనికి ఎంత ఖర్చు చేస్తున్నారో లెక్కవేసుకోండి. అందులో అనవసరమైన ఖర్చులను తగ్గించండి. క్రెడిట్ కార్డులను ఎడాపెడా ఉపయోగించి.. అధిక వడ్డీ భారాన్ని మీద పడకుండా జాగ్రత్త పడింది. ఇది మీ పెట్టుబడిని సులభతరం చేస్తుంది.
బోనస్ లను తెలివిగా ఉపయోగించండి
సాధారణంగా చాలా ఆఫీసులు.. తమ ఉద్యోగాలకు వార్షిక బోనస్లు, బహుమానాలు అందజేస్తుంటాయి. వాటిలో కొంత భాగాన్ని పెట్టుబడి రూపంలోకి మళ్లించగలిగితే మీ నెలవారి ఖర్చులపై అది ఒత్తిడిని తగ్గిస్తాయి.
హెల్త్ బీమా పాలసీ
కొందరు హెల్త్ బీమా పాలసీలను నిర్లక్ష్యం చేస్తుంటారు. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరితో మీరు పొదుపు చేసిన మెుత్తమంతా ఆస్పత్రులకో ఖర్చయ్యే ప్రమాదం ఉంది. ఇది మీ భవిష్యత్ లక్ష్యాలను దెబ్బ తీస్తుంది. కాబట్టి హెల్త్ బీమా తీసుకోవడం ద్వారా.. అకస్మిక ఆర్థిక ముప్పు నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. కుటుంబానికి సైతం భరోసా కల్పించిన వారు అవుతారు.
Also Read: Thai Women: సన్యాసులకు వలపు వల.. 80 వేల నగ్న వీడియోలు.. కిలేడీ గుట్టురట్టు!
సంప్రదాయ పొదుపును చెక్ పెట్టండి
కొందరు తమ డబ్బును సేవింగ్స్ అకౌంట్ లేదా రికరింగ్ డిపాజిట్ ల రూపంలో పొదుపు చేస్తుంటారు. అయితే ఇది మీ డబ్బుపై తక్కువ రాబడిని మాత్రమే అందిస్తుంది. దానికి బదులుగా మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లు, బంగారంపై పెట్టుబడి పెడితే అది మీ భవిష్యత్తుకు లాభదాయకంగా ఉంటుంది. అయితే షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి నిపుణుల సలహా తప్పని సరి.