Fish Venkat: ఫిష్ వెంకట్ గా పిలవబడే అతని పేరు మంగలంపల్లి వెంకటేశ్, గత కొంత కాలం నుంచి తీవ్రమైన కిడ్నీ వ్యాధితో బాధపడుతూ జులై 18, 2025న కన్నుమూశారు. ఆయన చికిత్స కోసం ఆర్థిక సాయం కోరుతూ కుటుంబం మీడియా ద్వారా విజ్ఞప్తి చేసినప్పటికీ, తెలుగు సినీ పరిశ్రమ నుండి సరైన సహాయం మాత్రం అందలేదు. ప్రభాస్ టీమ్ నుండి రూ. 50 లక్షల సాయం అందిస్తామని, వచ్చిన వార్తలు తప్పుడు కాల్‌గా అని ఫిష్ వెంకట్ కుటుంబం స్పష్టం చేసింది.
అడిగినా కూడా సాయం చేయలేదా?
అయితే, నటులు పట్టించుకుంటే ఫిష్ వెంకట్ ఈ రోజు బతికేవాడు. పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప హీరోలున్నా.. సరైన సాయం ఎవరూ చేయలేదు. ఇంకా చెప్పాలంటే, ఫ్యాన్స్ చేసిన సాయం వలనే ఇన్ని రోజులు బతికాడు. సినీ పరిశ్రమ నుండి ఎలాంటి సహాయం లేదని, పైగా ఇండస్ట్రీ సంఘాల నుండి కూడా ఎలాంటి మద్దతు అందలేదని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Also Read: Star Actress: ముందు వాటిని పెంచు.. అవకాశాలు వస్తాయి.. ఎన్టీఆర్ హీరోయిన్ కి ఘోర అవమానం?
ఇంకో వైపు, ఫిష్ వెంకట్ ఫ్యాన్స్, సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని, ఆర్థిక సాయం చేశారు. కిడ్నీ డోనర్ కోసం చాలా ప్రయత్నించారు. అయినప్పటికీ, సరైన కిడ్నీ డోనర్ దొరకకపోవడం, ఆర్థిక ఇబ్బందులు కూడా ఒకేసారి రావడంతో ఆయన చికిత్సను మరింత కష్టతరం చేశాయి.
Also Read: Gandhi Nursing Students: దయనీయంగా గాంధీ నర్సింగ్ విద్యార్ధుల పరిస్థితి.. స్పందించని ఉన్నతాధికారులు
ఫిష్ వెంకట్ వంటి సహాయ నటులకు సినీ పరిశ్రమ నుండి తగిన మద్దతు లేకపోవడం గురించి సోషల్ మీడియాలో చర్చలు జరిగాయి. ఆయన కుటుంబం చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి ప్రముఖుల నుండి సహాయం కోరినప్పటికీ, పెద్దగా స్పందన రాలేదని తెలుస్తోంది. ఫిష్ వెంకట్ సుమారు వందకు పైగా సినిమాల్లో తన నటనతో అలరించినప్పటికీ, ఆయన చివరి రోజుల్లో పరిశ్రమ నుండి ఆశించిన స్థాయిలో సహకారం అందకపోవడం విచారకరం.