Karthika Deepam Sushma: కార్తీక దీపం సీరియల్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, దీనిలో నటించిన నటి నటులు స్టార్స్ గా ఎదిగారు. ఈ సీరియల్ పెద్ద హిట్ అవ్వడంతో ఇదే పేరుతో కొత్త సీరియల్ ను బుల్లితెర ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు. దీనిలో నటించిన స్వప్న అలియాస్ సుష్మా కిరోన్ మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా, ఆమె ఓ ఏడుస్తూ ఓ వైరల్ షేర్ చేయడంతో అది ఇప్పుడు సంచలనంగా మారింది.
Also Read: American Woman: అమెరికా అమ్మాయి.. పాక్ అబ్బాయి.. ఇది మామూలు లవ్ స్టోరీ కాదు భయ్యో!
ఇదే చివరి రోజు.. ముందు చచ్చిపోవాలి.. సుష్మా కిరోన్
లైఫ్ లో నేనే ముందు చచ్చిపోవాలి. మా ఆయన కన్నా.. తను లేకపోతే నేను బతకలేను అంటూ ఏడుస్తూ చాలా ఎమోషనల్ అయింది. అయితే, ఓ సీరియల్ ఆమె భర్త చనిపోయినట్టు నటించాలి. ఆ సీన్ చేస్తే అలాగే అవుతుందని తాను చాలా భయపడి, ఏడుస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఆమె ఆ షూట్ మొత్తాన్ని ఓ వీడియో తీసుకుంది. దానిని యూట్యూబ్ లో రిలీజ్ చేయగా.. అది వైరల్ గా మారింది. ఆమె మాట్లాడుతూ ఇంకెప్పుడూ ఇలాంటి సీన్స్ లో యాక్ట్ చేయను. ఇదే నా చివరిది..ఇలాంటి రోజు కూడా మళ్ళీ రాకూడదు. అలాంటి రోజు ఇదే చివరి రోజు అవ్వాలి. అసలు తలచుకుంటేనే చాలా ఏడుపు వస్తుందని సుష్మా చెప్పింది. అప్పుడు పక్కనే ఉన్నా .. ఆమె భర్త రవి కిరణ్ అన్న వాడికి ఏమౌతుంది. మీ అందరూ నాతో ఉన్నారు కదా.. నాకేం కాదు అని అన్నాడు.
Also Read: Gold Rates Down: ఎగిరిగంతేసే గుడ్ న్యూస్.. త్వరలో రూ.30,000 వేల వరకు తగ్గనున్న గోల్డ్ రేట్స్..?
నెటిజన్ల రియాక్షన్ ఇదే..
మీరు చాలా లక్కీ రవి గారు .. సుష్మ గారి లాంటి భార్య దొరకడం చాలా గ్రేట్. ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు మీతో ఉంటాయండి. వంద కాలాలు ఎప్పుడు కలిసే ఉంటారు. సుష్మ మేడం మీరు ఉంటే చాలా బాగుండేది చిన్ని సీరియల్ నేను చాలా మిస్ అవుతున్నాను చాలా నచ్చింది చిన్ని సీరియల్ అంటూ కొందరు అంటుండగా.. మీ ఆలోచన కరెక్ట్ అక్క.ఈ సీరియల్స్,సినిమాల్లో ఫోటోలకి దండలు వేయడం కూడా నాకు అసలు నచ్చదు. అలానే కంటిన్యూ చేసి పెద్దవాళ్లుగా చేసి ఉండాల్సింది అని కామెంట్స్ చేస్తున్నారు.