dubai
లేటెస్ట్ న్యూస్, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Dubai: దుబాయ్ డీలింగ్స్? ముందే చెప్పిన ‘స్వేచ్ఛ’

  • ప్రభుత్వం మారాక వ్యాపారం అంతా అక్కడే
  • పదేళ్లు సంపాదించిన సొమ్మంతా అటే?
  • ఏ లీడర్ ఎన్ని సార్లు వెళ్లారో.. ఎక్కడెక్కడ ఉన్నారో..
  • ‘స్వేచ్ఛ’కు ముందే తెలుసు
  • కేదార్ మృతిపై గతంలోనే వార్తలు
  • బండారమంతా బట్టబయలు చేసే ప్రయత్నం
  • ఫోన్ ట్యాపింగ్‌కు ఏపీ మద్యం సిండికేట్‌కు లింక్ ఒక్కటే?
  • కొన్ని నెలలు లీజుకు సంబంధం లేకుండానే అపార్ట్‌మెంట్?
  • ఒక్కొక్కటిగా నిజమవుతున్న ‘స్వేచ్ఛ’ కథనాలు
  • ఏ కేసు అయినా.. ఎలాంటి దర్యాప్తు అయినా..
  • నెలల తర్వాత మేల్కొంటున్న వ్యవస్థలు

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
స్వేచ్ఛ ఎడిటర్


స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్

Dubai: దుబాయ్.. భారత దేశ బినామీలకు పెట్టుబడి కేంద్రం. గత ప్రభుత్వంలో చివరి ఐదేళ్లు హైదరాబాద్ కేంద్రంగా సంపాదించిన సొమ్ము అంతా అక్కడే ఉందని అందరి వాదన. అందుకే తెలంగాణ రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నదని ఆ రంగంలో ఉన్నవారికి తెలుసు. ప్రభుత్వాలు మారగానే ఎన్నో పరిణామాలు మారాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు, ఏపీలో మద్యం కుంభకోణం టాప్ లెవల్‌ కామన్ కేసులుగా తయారయ్యాయి. లీడర్లు వాళ్ల ధనం అంతా పక్క దేశాలకు పంపించి, మత్తుతోపాటు బినామీ అనుచరులు తమతో ఉండొద్దని తీసుకున్న నిర్ణయాలు ఎన్నో పరిణామాలకు దారి తీశాయి. ఈ క్రమంలోనే కొంతమంది విదేశాల్లో చనిపోయినట్టు తెలుస్తున్నది.


ఏపీ లిక్కర్ స్కాంకు ఫోన్ ట్యాపింగ్ నిందితుడికి లింక్?

కొంతమంది ఏపీ లిక్కర్ స్కాం నిందితులు ఫోన్ ట్యాపింగ్‌ కేసులో ఉన్న ఏ5 నిందితుడి అపార్ట్‌మెంట్‌లో ఉన్నారని వార్తలు వచ్చాయి. నిజానికి ఆ నిందితుడు గతంలో ఇచ్చిన లీజ్‌ను ఓనర్‌ అంటూ అక్రమంగా తన పేరుపై మార్చుకుని ఏపీ లిక్కర్ స్కాంతోపాటు తెలంగాణలో వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి షెల్డర్ ఇస్తున్నాడని ‘స్వేచ్ఛ’ ముందే చెప్పింది. ఏపీ లిక్కర్ స్కాం నిందితులు 2025 ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 27 వరకు సదరు ఫ్లాట్‌లోనే ఉన్నారు. పురుషోత్తం పేరుతో ఉన్నా, అందులో ఉన్నది మాత్రం లిక్కర్ స్కాంలో ఉన్న చాణక్య. అలాగే, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న షకీల్, కొంతమంది నిందితులు ఇదే ఫ్లాట్‌ నుంచి వివిధ ఆర్థిక లావాదేవీలకు పాల్పడ్డారని తెలుస్తున్నది.

Read Also- Viral Video: రేయ్ ఎవర్రా మీరంతా.. తప్పతాగి పోలీసులతో ఆటలెంట్రా!

ఇప్పటికీ బిజినెస్ అక్కడే..

శ్రీనిధి శ్రీహరి, ఫినిక్స్ గోపి, ప్రణవ రవి, ప్రెస్టేజీ గ్రూప్ అధినేత, సాహితీ, తెలంగాణలో ఉండి మ్యానేజ్ చేసే బీఆర్ఎస్ కంపెనీలు వంశీరాం, డీఎస్ఆర్‌తో పాటు మరో 4 కంపెనీలు దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాయి. వీరంతా హైదరాబాద్‌లో పెట్టుబడులు అంటూ రియల్ భూ స్కాంలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. చివరి ఐదేళ్లలో సంపాదించిన సొమ్మంతా అక్కడికి అప్పగించేలా ఒప్పందాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలా బీఆర్ఎస్, వైసీపీ కేంద్రంగా వ్యవహారం అంతా దుబాయ్‌కు మారిందని అనుకుంటున్నారు. అందుకు కాంగ్రెస్ సర్కార్ కూడా సహకరిస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయి. ఇటీవల ఒక మంత్రి దుబాయ్‌లో పెట్టుబడులు పెట్టినట్టు తెలిసింది. వ్యాపారంలో అందరూ ఒక్కటై, డబ్బులు వెనకేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్టు సమాచారం.

Read Also- Kannappa: ఇప్పటి వరకు ‘కన్నప్ప’ కలెక్ట్ చేసింది అంతేనా? భారీ లాస్ తప్పదా?

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?