Kannappa Still
ఎంటర్‌టైన్మెంట్

Kannappa: ఇప్పటి వరకు ‘కన్నప్ప’ కలెక్ట్ చేసింది అంతేనా? భారీ లాస్ తప్పదా?

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వచ్చిన ‘కన్నప్ప’ చిత్రం విడుదల రోజున పాజిటివ్ టాక్‌నే సొంతం చేసుకుంది. విమర్శకులు కూడా ఈ సినిమాకు మంచి రివ్యూలు ఇచ్చారు. పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన ఈ సినిమాలో మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి అగ్ర నటీనటులు నటించారు. ముఖ్యంగా ప్రభాస్ పాత్రకు మంచి అప్లాజ్ వచ్చింది. అలాగే క్లైమాక్స్‌లో మంచు విష్ణు నటనకు కూడా ప్రశంసలు దక్కాయి. చాలా కాలం తర్వాత మంచు హీరోల సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వారు కూడా ఊపిరి పీల్చుకున్నారు. కానీ, ఆ ముచ్చట మూడు రోజులకే ముగిసింది. అవును, విడుదలైన మొదటి మూడు రోజులు మాత్రమే ఈ సినిమాకు ఓ మోస్తరు కలెక్షన్లు లభించాయి. ఆ తర్వాత వచ్చిన సోమవారం నుంచి ఈ సినిమాకు కలెక్షన్స్ అంత గొప్పగా లేవు.

Also Read- Kingdom: ‘కింగ్‌డమ్’ నుంచి హృదయాన్ని తాకే అన్న పాట వచ్చేసింది.. ఎలా ఉందంటే?

సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా విడుదలైన వారానికి వచ్చిన ‘తమ్ముడు’ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. అయినా కూడా ‘కన్నప్ప’ ఏ కోశానా కలెక్షన్లు రాబట్టలేదు. జూన్ 27న విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు సుమారు రూ. 25 కోట్ల షేర్‌ని మాత్రమే రాబట్టినట్లుగా ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఈ సినిమా అన్ని ఏరియాలు కలిపి దాదాపు రూ. 85 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. సినిమాకు మొత్తం అయిన ఖర్చు రూ. 200 కోట్లు అని మేకర్స్ ప్రకటించారు (దీనిపై కూడా విమర్శలు వచ్చాయనుకోండి). ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రకారం చూస్తే.. రూ. 85 కోట్ల బిజినెస్ జరిగితే.. కేవలం రూ. 25 కోట్ల వరకే ఈ సినిమా రాబట్టింది. ఇంకా దాదాపు రూ. 60 కోట్ల రూపాయలను రాబట్టాలి. అది సాధ్యమయ్యే పని అయితే కాదు. దాదాపు థియేట్రికల్ రన్ ముగిసినట్టే భావించాలి. అందులోనూ ఈ వారం నుంచి స్టార్ హీరోల సినిమాల హడావుడి కూడా మొదలవబోతుంది. ఈ నేపథ్యంలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా రూ. 60 కోట్లు ఈ సినిమా రాబట్టాలంటే.. ఒక టికెట్‌కు ఇద్దరు సినిమా చూడొచ్చని ఆఫర్ పెట్టినా కూడా సాధ్యం కాదు. ఎలా చూసినా కూడా ఈ సినిమాకు భారీ నష్టమే వస్తుందనేలా ఇండస్ట్రీలో వార్తలు మొదలయ్యాయి.

Also Read- Surekha Vani: పబ్బులో గుర్తు తెలియని వ్యక్తితో ఎంజాయ్ చేస్తూ.. బండారం బట్టబయలు!

ఈ జర్నీలో మంచు ఫ్యామిలీకి కాస్త ఉపశమనం కలిగించే విషయం ఏదైనా ఉందీ అంటే.. అది ‘కన్నప్ప’ డిజిటల్, శాటిలైట్, డబ్బింగ్ హక్కుల రూపంలో వచ్చిన సుమారు రూ. 60 కోట్లు అనే చెప్పుకోవాలి. అదీ కూడా మొదటి మూడు రోజుల టాక్‌తో వచ్చిన ఫిగరే. కాదు, కూడదు ఇంకా మా సినిమాకు రేటు పలుకుతుందని ఆ రైట్స్ అమ్మకుండా ఉంటే మాత్రం ఇంకా భారీ లాస్‌లో పడేవాళ్లు. మంచు ఫ్యామిలీ ఈ సినిమా విషయంలో చెప్పిన బడ్జెట్ లెక్కల ప్రకారం.. ఎలా చూసినా ‘కన్నప్ప’ సినిమా రూ. 100 కోట్లకు పైగా నష్టాన్ని తెస్తుందని, సినిమా కలెక్షన్ల లెక్కలు చెప్పే వారు అంచనా వేస్తున్నారు. మరో విషయం ఏమిటంటే.. ఈ సినిమానే మంచు విష్ణు కెరియర్‌లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రం కావడం. ఏది ఏమైనా, స్థాయికి మించి ఖర్చు పెడితే ఏం జరుగుతుందో మరోసారి మంచు ఫ్యామిలీకి గుణపాఠం చెప్పింది ‘కన్నప్ప’ చిత్రం. ఇప్పుడు మంచు ఫ్యామిలీ ముఖచిత్రం ఏమిటో చూడాల్సి ఉంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం