Surekha Vani
ఎంటర్‌టైన్మెంట్

Surekha Vani: పబ్బులో గుర్తు తెలియని వ్యక్తితో ఎంజాయ్ చేస్తూ.. బండారం బట్టబయలు!

Surekha Vani: సురేఖ వాణి ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కానే కాదు. నటిగా ఒకప్పుడు తనదైన మార్క్ ప్రదర్శించిన సురేఖ వాణి (Surekha Vani), ఈ మధ్య కాలంలో మాత్రం, తన కుమార్తెతో చేసే రచ్చతో వార్తలలో నిలుస్తోంది. తన కుమార్తె సుప్రిత (Supritha)తో కలిసి ఎంజాయ్ చేస్తూ, టూర్స్ వేస్తూ.. నిత్యం ఏదో ఒక రకంగా వార్తలలో ఉంటూనే ఉంది. మరీ ముఖ్యంగా భర్త మృతి తర్వాత ఆమె, ఇక బయటికి రాదని అనుకున్నవారందరికీ షాకిస్తోంది. కుమార్తెకు పోటీగా డ్రస్సులు వేస్తూ.. సోషల్ మీడియాలో చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఒక్కోసారి సోషల్ మీడియా షేకవుతుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. అలాగే కుమార్తెతో కలిసి పబ్బుల్లో, బీచ్‌లలో ఫ్రీడమ్ వచ్చిన పక్షుల్లా విహరిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి మరీ అందరినీ రెచ్చగొడుతుంటారు.

Also Read- Kota Srinivasa Rao: చనిపోయే ముందు ఆ స్టార్ హీరోకి మర్చిపోలేని సాయం చేసిన కోట శ్రీనివాసరావు?

ఇప్పుడలాంటి ఫొటోనే ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. భర్త మృతి తర్వాత ఆమె మరో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ఎప్పుడూ వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలియంది కాదు. ఈ విషయంలో మీడియాని కూడా అమ్మాకూతుళ్లు టీజ్ చేస్తుంటారు. వాళ్ల అమ్మ ఎవరితోనో రిలేషన్‌లో ఉన్నట్లుగా సుప్రిత ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో డైరెక్ట్‌గా చెప్పకపోయినా, ఇన్ డైరెక్ట్‌గా చెప్పింది. అలాగే తప్పకుండా అమ్మ మళ్లీ పెళ్లి చేసుకుంటుందని కూడా సుప్రిత తెలిపింది. ఈ హింట్స్ ప్రకారం, ఇప్పుడు వైరల్ అవుతున్న ఫొటోలో సురేఖ వాణితో ఓ వ్యక్తి చాలా దగ్గరగా కనిపిస్తున్నాడు. ఆమె మీద చేయి వేసి మరీ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో సరిగా తెలియడం లేదు కానీ, అంత దగ్గరగా ఉండటమే కాకుండా, చేతులు కూడా ఎక్కడపడితే అక్కడ వేస్తుండటంతో.. కచ్చితంగా అతనే సురేఖ వాణి బాయ్ ఫ్రెండ్ అనేలా టాక్ మొదలైంది.

Also Read- Genelia: రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ.. ఇప్పుడున్న పొజిషన్ చూస్తుంటేనా?

మరి ఈ పిక్‌పై వివరణ అయితే రాలేదు కానీ, పిక్‌లో ఉన్న మ్యాటర్ మాత్రం సురేఖ వాణి బండారం బట్టబయలు చేసిందనే టాక్‌కి కారణమవుతోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ హడావుడి చేసే సురేఖ వాణి, ఈ ఫొటోకి, అందులో ఉన్న వ్యక్తికి సంబంధించిన సమాచారం చెబితే బాగుండు… లేదంటే మాత్రం ఆమెపై వార్తలు రకరకాలుగా వైరల్ అవుతూనే ఉంటాయి. ఇంతకు ముందు కూడా ‘కబాలి’ నిర్మాత కె.పి. చౌదరితో ఇలాగే కనిపించి, ఆ తర్వాత ఏం సంబంధం లేదని చెప్పడానికి చాలా ట్రై చేసింది. ఇప్పుడు మరో వ్యక్తితో ఇలా దర్శనమివ్వడంతో.. అంతా ఆమె గురించి రకరకాలుగా వార్తలు అల్లేస్తున్నారు. అసలు విషయం ఏమై ఉంటుందో తెలియదు కానీ, మీడియాకు కావాల్సిన మేతను మాత్రం సురేఖ వాణి ఇచ్చేందనేది కాదనలేని నిజం. చూద్దాం.. ఈ వ్యవహారం ఎంత వరకు వెళుతుందో..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!