Kota Srinivasa Rao ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Kota Srinivasa Rao: చనిపోయే ముందు ఆ స్టార్ హీరోకి మర్చిపోలేని సాయం చేసిన కోట శ్రీనివాసరావు?

Kota Srinivasa Rao: తెలుగు సినిమా పరిశ్రమలో దిగ్గజ నటుడు కోటా శ్రీనివాసరావు మరణం యావత్ సినీ లోకాన్ని శోకసముద్రంలో మునిగింది. 2025 జులై 13, ఆదివారం  తెల్లవారుజామున 83 సంవత్సరాల వయసులో హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. దాదాపు 750కి పైగా చిత్రాల్లో విలన్, కమెడియన్, సహాయ పాత్రలతో సహా విభిన్న రకాల పాత్రల్లో నటించిన కోటా, తన నటనా ప్రతిభతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు. అయితే, అనారోగ్యంతో బాధపడుతూ, చివరి రోజుల్లో కూడా సినిమాల పట్ల ఆయనకున్న అభిమానం మాటల్లో చెప్పలేనిది.

Also Read: Pregnancy Yoga tips: గర్భిణి స్త్రీలు యోగా చేస్తే ఏమవుతుంది.. ఏ జాగ్రత్తలు పాటించాలి.. ఓ లుక్కేయండి!

కోటా శ్రీనివాసరావు తన చివరి రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఓ సాయం చేశారని తెలుస్తోంది. ఆయన చివరిగా నటించిన చిత్రం “హరిహర వీరమల్లు”, ఇందులో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కోటా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. అనారోగ్యంతో కనీసం నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ సినిమా కోసం కోటా శ్రీనివాసరావు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఒక రోజు షూటింగ్‌లో పాల్గొన్నారు.

Also Read:  Telangana: డేటా సిటీగా హైదరాబాద్‌ మారనుంది.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

పవన్ సోషల్ మీడియాలో కోటాతో “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి”, “గోకులంలో సీత”, “బద్రి”, “గబ్బర్ సింగ్” వంటి అనేక చిత్రాల్లో కలిసి నటించిన స్మృతులను గుర్తు చేసుకున్నారు. “కోటా గారి మరణం సినీ రంగానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను” అని పవన్ తన సంతపాన్ని తెలిపారు.

Also Read:  Wife And Husband: వామ్మో తెలంగాణలో ఘోరం.. భార్యభర్తల పంచాయితీలో ఇద్దరు దారుణ హత్య

“హరిహర వీరమల్లు” జులై 24, 2025న రిలీజ్ కానుంది. ఇందులో కోటా శ్రీనివాసరావు చివరి సినిమా పాత్రను చూసే అవకాశం ప్రేక్షకులకు లభిస్తుంది. కోటా శ్రీనివాసరావు సినిమా పట్ల అంకితభావం, పవన్ కళ్యాణ్‌కు చేసిన ఈ చివరి సాయం తెలుగు సినిమా చరిత్రలో  గుర్తుండిపోతుంది.

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు