Viral Video: సోషల్ మీడియా ఇప్పుడు ఎలాంటి సమాచారాన్ని ఐనా మన ముందు ఉంచుతోంది. ఇందులో రోజులో ఎన్నో చిత్ర, విచిత్రాలు చూడాల్సి వస్తోంది. మరికొన్ని వామ్మో దేవుడా అన్నట్లుగా నోరెళ్ళబెట్టే పరిస్థితి ఉండే వీడియోలు ఉన్నాయి. ఇదిగో ఇప్పుడు మీరు చూడబోయే.. చదవబోయే వార్త చూస్తే రేయ్ ఎవర్రా మీరంతా..? ఎక్కడి నుంచి వచ్చార్రా.. నరాల్ కట్ అవుతున్నాయ్..? అనే డైలాగ్స్ అనుకోకుండా మీ నోట నుంచి వచ్చేస్తాయి అంతే..!
రండి సీన్ లోకి..!
బెజవాడలో పీకలదాకా తాగిన ఇద్దరు స్కూటీ మీద వన్‌వేలోకి దూసుకొచ్చారు. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు బండిని ఆపి ఇద్దరినీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేయబోయారు. ఇంతలోపే సర్
‘నేను మూడు క్వార్టర్లు తాగాను. నన్ను వదిలేయండి. కావాలంటే ఈ 500 రూపాయలు లంచం తీసుకోండి’ అని డైరెక్టుగా చెప్పేశాడు. ఏంట్రా ఇలా డబ్బులు కూడా ఇస్తారా? అని ఎస్‌ఐ ప్రశ్నించాడు. ఇంతలో మరో తాగుబోతు యువకుడు తానేమీ మాట్లాడకపోతే బాగోదు అనుకున్నాడో ఏమో గానీ రంగంలోకి దిగిపోయాడు. అరే.. 500 ఎందుకు ఇచ్చావ్ రా.. రెండు వందలు చాలని చెబుతాడు. ఈ ఈ మాటలన్నీ పోలీసుల బాడీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఇద్దరు యువకులు.. ఎస్‌ఐ మధ్య జరిగిన సంభాషణ జబర్దస్త్, కామెడీ సినిమాను మించి పంచులు ఉన్నాయని చెప్పుకోవచ్చు.
Also Read- Telugu States: తెలుగు రాష్ట్రాల మధ్య తెగని బనకచర్ల పంచాయతీ!
ఇప్పుడిదే హాట్ టాపిక్!
ఇలాంటి వీడియోలు దొరికితే మనోళ్లు ఎందుకు వదులుతారు.. దానికి కొన్ని కామెడీ సీన్లు, పంచ్ లు జతచేసి రచ్చ రచ్చ చేసేసారు. దెబ్బకు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. అంతేకాదు ఈ వీడియోలో ఆ ఇద్దరు యువకులకు ఎస్‌ఐ అక్కడే కాసేపు కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా కూడా ఉంది. ఇక చివరికి ఈ పంచాయతీ తెగదనుకొని సదరు యువకుడిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి, అక్కడికక్కడే బైక్‌ను సీజ్ చేశారు. ఇద్దరు యువకులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు మీడియాకు వెల్లడించారు.
Also Read- Tragedy Love: అతడికి 42 ఆమెకు 22.. చివరికి పెను విషాదం!
సలాం.. పోలీస్ సాబ్!
ఈ సంఘటన పోలీసుల మానవత్వం, అలాగే వాహనదారుడి నిజాయితీకి ప్రతీకగా నిలిచిందని మందుబాబుల నుంచి కామెంట్స్ వస్తున్నాయి. ఇది కేవలం ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ జరిమానా గురించి మాత్రమే కాదు.. ప్రజలు – పోలీసులు ఎలా ఒకరికొకరు సహకరించుకోవచ్చో చూపింది. సాధారణంగా.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో చిక్కుకున్నవారు పోలీసులతో వాగ్వాదానికి దిగడం, తప్పించుకోవడానికి ప్రయత్నించడం లేదా జరిమానా తగ్గించమని బతిమాలుకోవడం చూస్తుంటాం. కానీ ఈ బైకర్ అలా చేయలేదు. పోలీసుల తనిఖీకి పూర్తి సహకారం అందించాడు. ఇక పోలీసులు కూడా.. అతనికి భవిష్యత్తులో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని, జాగ్రత్తగా ఉండాలని హితబోధ చేశారు. ఇది పోలీసులకు కూడా మానవత్వం ఉంటుందని, ప్రజల నిజాయితీని గుర్తిస్తారని నిరూపించింది. ఇలాంటి సంఘటనలు ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను మరింత బాధ్యతాయుతంగా పాటించడానికి ప్రోత్సహిస్తాయి. ఇప్పుడు చెప్పండి ఆ పోలీస్ సారుకు సలాం చేయాల్సిందే కదా!
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు