Paster Shalem Raju
ఆంధ్రప్రదేశ్

Shalem Raju: పాస్టర్ షాలెం రాజు ఎక్కడున్నాడు.. ఏమయ్యాడు?

Shalem Raju: మహిళలపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాస్టర్ షాలేం రాజు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలతో పాటు, కొందరు క్రిస్టియన్ మహిళలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆంధ్ర, తెలంగాణలో పెద్ద ఎత్తునే ఫిర్యాదులు నమోదయ్యాయి.. అంతకుమించి డిమాండ్లు వెల్లువెత్తాయి. మరోవైపు సోషల్ మీడియాలో, టీవీ డిబేట్లలో హిందూ సంఘాల నేతలు, మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన ఎక్కడ ఉన్నారు? ఏమయ్యాడు? అనే దానిపై ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. అయితే.. వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత పాస్టర్ బహిరంగంగా కనిపించకపోవడంతో పరారీలో ఉన్నారనే ప్రచారం మొదలైంది. ఆయన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్లు వెల్లువెత్తిన నేపథ్యంలో, పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే, ఆయన నిజంగా పరారీలో ఉన్నారా? లేదా? అనేదానిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

Read Also- Snake in Metro: మెట్రో లేడీస్ కోచ్‌లోకి పాము?.. వీడియో చూస్తే..

అభ్యంతరం ఏముంది?
పాస్టర్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి అభ్యంతరం లేదని.. వందకు వంద శాతం అక్షరాలా నిజమేనని మరో పాస్టర్ అభినయ్ దర్శన్ మద్దతు పలికాడు. ‘ చర్చి బయట పూలు పెట్టొద్దు.. ఇక్కడికి వచ్చేవాళ్లు బజారు సంబంధులు కాదు అని మాత్రమే మాట్లాడారు కానీ, హైందవ స్త్రీలను ఉద్దేశించి ఎక్కడా మాట్లాడలేదు. మల్లెపూలు కొన్నవాళ్లు బజారు సంబంధీకులు కాదు. చర్చి లోపలికి వెళ్తూ కూడా పూలు కొని వెళ్తే బజారు సంబంధీకులు అనే భావనతో షాలెం రాజు వ్యాఖ్యలు చేశాడు. వాస్తవానికి చర్చీకి వెళ్లే వాళ్లు పూలు పెట్టుకోరు, కొనరు కూడా. ఇది మా సాంప్రదాయం, క్రమం. ఒకవేళ పూలు పెట్టుకోవాలంటే ఇంటి దగ్గరో, ఫంక్షన్లకు వెళ్లేటప్పుడు పెట్టుకుంటారు అంతేకానీ.. చర్చికి వెళ్లేటప్పుడు పెట్టుకోరు ఇది మా ఆచారం’ అని అభినయ్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ వ్యాఖ్యలను సైతం క్రైస్తవులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.. మండిపడుతున్నారు కూడా.

మేరీ మాత కూడా?
షాలెం రాజు వ్యాఖ్యలపై హిందూ చైతన్య వేదిక నాయకులు తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మేరీ మాత కూడా మల్లెపూలతో అలంకరించబడిందని, కాబట్టి షాలెం రాజు వ్యాఖ్యలు క్రైస్తవులను కూడా క్షమించరానివని వారు అన్నారు. ‘ ఇదంతా మత ఘర్షణలు రేపడానికి, మత మార్పిడీలు బలంగా చేయడానికే. యేసు ప్రభువును కన్న తల్లిని కూడా రోజాలు, మల్లెపూలు ఇతర పూలతో అలకరించి ఊరేగిస్తారు. షాలెం రాజు సమాజంలో బతకడానికి అనర్హుడివి. షాలెం రాజును వెంటనే అరెస్టు చేయాలి. లేకపోతే సోమవారం లోపల అరెస్టు చేయకపోతే తీవ్ర స్థాయిలో నిరసనలు తెలియజేస్తాం’ అని హిందూ చైతన్య వేదిక హెచ్చరించింది. హిందువులపై జరుగుతున్న అన్యాయాలపై రాజకీయ నాయకులు, పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని, ఇది కేవలం ఓట్ల కోసం చేస్తున్నారని విమర్శించారు. షాలెం రాజును వెంటనే అరెస్టు చేయాలని అతనిపై బీఎన్ఎస్ (BNS) యాక్ట్ 153, 259 ఏ, 505 బార్ట్ ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

మామూలోడు కాదు!
ఇదిలా ఉంటే.. ఈ వివాదాస్పద వ్యాఖ్యలతో షాలెం రాజు లీలలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. గతంలో ఆయన పలువురిని మోసం చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. కోనసీమ జిల్లాలో ఇజ్రాయెల్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి 31 మందిని రూ.1.50 కోట్లు మోసం చేశారని జాతీయ దినపత్రికల్లోనే వార్తలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇదంతా 2024 అక్టోబర్‌లో జరగ్గా.. ఈ కేసులో ఆయన కుటుంబంపై కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ మధ్యనే మతపరమైన ప్రసంగాలు, యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా క్రియాశీలకంగా ఉంటూ.. మహిళలపై ఇలా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆయనకు వ్యతిరేకంగా అనేక నిరసనలు, చర్చలు జరుగుతున్నాయి. కొందరు ఆయన్ను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తుండగా.. మరికొందరు ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అరెస్ట్ చేయాలని పోలీసులను కోరుతున్నారు. కొందరు క్రైస్తవ మత పెద్దలు కూడా షాలేం రాజు వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.

Read Also- Chevireddy: చెవిరెడ్డికి ఏమైంది.. వైసీపీలో ఇంత టెన్షన్ ఎందుకు?

Just In

01

VV Vinayak: చాలా రోజుల తర్వాత దర్శకుడు వివి వినాయక్ ఇలా..!

Blast in Match: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లో పేలుడు.. పాక్‌లో షాకింగ్ ఘటన

Karthik Gattamneni: తొమ్మిది గ్రంథాలు దుష్టుల బారిన పడితే.. ‘మిరాయ్‌’ మన రూటెడ్ యాక్షన్ అడ్వెంచర్

BRS Committees: స్థానిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కమిటీలు?.. పేర్లు సేకరిస్తున్న అధిష్టానం!

Khammam ashram school: అమానుషంగా ప్రవర్తించిన హెడ్మాస్టర్.. తండ్రి లేని బాలికను ఆశ్రమ స్కూల్ నుంచి గెంటేశారు