GHMC (Image Source: Twitter)
లేటెస్ట్ న్యూస్, హైదరాబాద్

GHMC: సుప్రీంకోర్టుకు చేరిన చెత్త వివాదం.. త్వరలోనే వాదనలు!

GHMC: జీహెచ్ఎంసీ పరిధిలో మెరుగైన శానిటేషన్ బాధ్యతలను స్వీకరించిన రాంకీ సంస్థ, జీహెచ్ఎంసీ మధ్య కొంత కాలంగా కొనసాగుతున్న జరిమానాల వివాదం ఎట్టకేలకు అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు చేరింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డోర్ టు డోర్ చెత్త సేకరణతో పాటు యార్డుకు చెత్త తరలింపు వంటి బాధ్యతలను రాంకీ ఎన్విరో సంస్థకు అప్పగిస్తూ జీహెచ్ఎంసీ 2012లో ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం చేసుకున్న కొత్తలో చెత్త సేకరణ, తరలింపు బాధ్యతలను ప్రైవేట్ సంస్థకు అప్పగించడంపై జీహెచ్ఎంసీలోని కొన్ని ఉద్యోగ, కార్మిక సంఘాలతో పాటు పలు యూనియన్లు రాంకీకి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించడంతో కొద్ది రోజుల పాటు ఒప్పందం అమలుకు బ్రేక్ పడింది. ఆ తర్వాత జీహెచ్ఎంసీ దశల వారీగా అమలు చేస్తూ వస్తున్నది.

టన్నుకు రూ.2 వేలు చెల్లిస్తున్న జీహెచ్ఎంసీ
గడిచిన ఎనిమిదేళ్ల నుంచి జీహెచ్ఎంసీ పరిధిలోని పలు జోన్లు, సర్కిళ్లలో రాంకీ ఒప్పందాన్ని అమలు చేస్తూ చెత్త ఎక్కువగా పేరుకుపోతున్న ప్రాంతాల నుంచి రోజుకు రెండుసార్లు చెత్తను తరలించాలన్న నిబంధనను పెట్టింది. ఇంటింటి నుంచి చెత్త సేకరణకు గాను ఒప్పందం చేసుకున్న కొత్తలో ఒక్కో టన్నుకు రూ.810 చెల్లిస్తూ, ఏటా అయిదు శాతం పెంచాలన్న నిబంధనను అగ్రిమెంట్‌లో పొందుపరిచారు. రోజుకి 7 వేల మెట్రిక్ టన్నుల చెత్తకు గాను జీహెచ్ఎంసీ రాంకీకి నెలసరి బిల్లులను చెల్లిస్తున్నది. ఈ మొత్తం బిల్లుల్లో పది శాతం ఏస్క్రో ఖాతాలో జమ చేస్తున్నది. ప్రస్తుతం ఒక్కో టన్ను చెత్తకు జీహెచ్ఎంసీ రూ.2 వేలకు పైగా చెల్లిస్తున్నట్లు తెలిసింది. అయినా చెత్త సేకరణ, తరలింపునకు సంబంధించి రాంకీ, జీహెచ్ఎంసీ మధ్య నెలకొన్న సమన్వయ లోపం కారణంగా సకాలంలో తొలగించకపోవడంతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

నెలకు రూ.70 లక్షల జరిమానాలు
చెత్త ఎక్కువగా పేరుకుపోయే ప్రాంతాల్లో రోజుకి రెండుసార్లు నిర్ణీత వేళల్లో రాంకీ సేకరించి, డంపింగ్ యార్డుకు తరలించాల్సి ఉంది. ఈ క్రమంలో చెత్త సేకరణ, తరలింపు, తడి, పొడి చెత్త, తరలిస్తున్నపుడు క్యాపింగ్ చేయడం, స్మెల్ కంట్రోల్ వంటి వివిధ కారణాలతో జరిమానా విధించే హక్కు జీహెచ్ఎంసీకి ఉంది. ఈ రకంగా రాంకీ ఆలస్యం చేయటాన్ని గుర్తిస్తున్న జీహెచ్ఎంసీ ప్రతి నెలా రూ.70 లక్షల వరకు జరిమానాలు విధిస్తున్నట్లు సమాచారం. ఈ రకంగా కొద్ది సంవత్సరాల నుంచి అవి పెండింగ్‌లో ఉండడంతో రూ.124 కోట్లకు చేరుకున్నాయి.

Also Read: Kuberaa Twitter Review: ‘కుబేర’ ట్విట్టర్ టాక్.. తిప్పరా మీసం అంటున్న అక్కినేని ఫ్యాన్స్.. హిట్ కొట్టినట్టేనా?

2023లోనే సుప్రీంకోర్టుకు..
దీన్ని సవాలు చేస్తూ రాంకీ ఆర్బిటేషన్ హైకోర్టును ఆశ్రయించింది. చేసుకున్న ఒప్పందం ప్రకారం తనకు పనులను అప్పగించడం లేదని రాంకీ పేర్కొనగా, జీహెచ్ఎంసీ కూడా తన వాదనలు వినిపిస్తూ, ప్రజారోగ్యానికి సంబంధించిన అత్యసర సర్వీసు కావడంతో రాంకీకి జవాబుదారీతనం పెరిగేందుకే తాము జరిమానాలు విధిస్తున్నామంటూ వాధించినా, కోర్టు అందుకు అంగీకరించకపోవడంతో తాము అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు, అక్కడ తుది తీర్పు వచ్చే వరకు జరిమానాలను కోర్టులో జమ చేయాలని జీహెచ్ఎంసీ కోరింది. కోర్టు ఆదేశాల మేరకు రాంకీ రూ.124 కోట్ల జరిమానాలను జమ చేసినట్లు తెలిసింది. 2023లో ఈ వివాదానికి సంబంధించి జీహెచ్ఎంసీ సుప్రీంకోర్టును ఆశ్రయించి, న్యాయవాదిని కూడా నియమించుకుంది. ఇక్కడి కోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు గత సంవత్సరం జూలై నెలలో స్టే ఇచ్చినట్లు, త్వరలోనే అత్యున్నత న్యాయస్థానంలో వాదనలు జరగనున్నట్లు సమాచారం.

Also Read This: Harish Rao: సీఎంకు బేసిన్‌లపై నాలెడ్జ్ లేదు.. హరీశ్ రావు సంచలన కామెంట్స్!

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..