Kuberaa Twitter Review (Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Kuberaa Twitter Review: ‘కుబేర’ ట్విట్టర్ టాక్.. తిప్పరా మీసం అంటున్న అక్కినేని ఫ్యాన్స్.. హిట్ కొట్టినట్టేనా?

Kuberaa Twitter Review: కింగ్ నాగార్జున, హీరో ధనుష్ కలిసి నటించిన కొత్త చిత్రం ‘కుబేర’. ఈ సినిమాకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటించింది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం నేడు థియేటర్లో రిలీజైంది. ఈ క్రమంలోనే అమెరికాలో పలు చోట్ల ప్రీమియర్ షోలు వేశారు. అయితే, సినిమాని చూసిన ఆడియెన్స్ సోషల్ మీడియా ద్వారా వారి అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. ట్విట్టర్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులకు నచ్చిందా? లేదా?.. ధనుష్ కి హిట్ పడిందా? నాగార్జున ఈ సినిమాతో కమ్ బ్యాక్ ఇచ్చాడా? లేదా అనేది ఇక్కడ తెలుసుకుందాం..

ఓ నెటిజన్ ట్విట్టర్ (ఎక్స్) ద్వారా తన రివ్యూను పంచుకున్నారు. ఈ రోజు కోసమే చాలా నెలల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇంకెందుకు లేట్ మీసం తిప్పుదాం ఇక అంటూ రాసుకొచ్చారు. కింగ్ ఈజ్ బ్యాక్.. నాగార్జున ఖాతాలో పెద్ద హిట్ పడింది అంటూ రాసుకొచ్చారు.

Also Read: Suniel Narang: సినిమాలే చూడను.. వారి ముందు నేను ఎంత?.. కుబేర నిర్మాత సంచలన కామెంట్స్

కుబేర చిత్రంలో ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ సూపర్ గా ఉంది. 4-5 ఎమోషన్ సన్నివేశాలు ఉంటాయని.. అది వర్త్ అని.. ఇక మిగతావని బోనస్‌ అని రాసుకొచ్చాడు. రాశి పెట్టుకోండి. ధనుష్‌కి చాలా అవార్డులు వస్తాయని.. ఈ చిత్రంలో అలాంటి పాత్ర చేయడానికి ఒప్పుకున్న నాగార్జునకు ఎంతో గౌరవం దక్కుతుందన్నారు. రష్మిక కూడా చాలా బాగా చేసింది. ఈ పాత్ర కూడా ఆమె కెరీర్‌లో గుర్తుండి పోతుందన్నారు. అలాగే, దేశీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకే హైలెట్ గా నిలిచిందని తెలిపారు.

Also Read: Bigg Boss Couple: ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. తిరుమలలో బిగ్ బాస్ జంట.. పెళ్లి చేసుకోవడానికే వెళ్ళారా?

ఇంకొకరు ‘‘కుబేర మూవీ అందరూ చూడాల్సిన క్రైమ్ డ్రామా. ఈ చిత్రంలో ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ చాలా బాగున్నాయి. అంతే కాదు.. మంచి సీన్లు కూడా ఉంటాయి. అయితే ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సీక్వెన్స్‌ దగ్గర ల్యాగ్ ఇచ్చినట్టు అనిపించింది. ధనుష్ కెరీర్‌లో ఈ సినిమా గుర్తుండి పోతుంది. అతని నటనతో అందర్ని మెప్పించాడు.ఈ మూవీ ఆసక్తికరమైన కథాంశం” అని రాసుకొచ్చాడు.

Also Read: Ye Maaya Chesave : నాగ చైతన్యతో కలిసి సమంత మూవీ ప్రమోషన్స్? ఫ్యాన్స్ కోరిక నెరవేరుతోందా?

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?