Bigg Boss Couple: నటుడు, బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ ఒక్కసారి బిగ్ బాస్ ఇంట్లోకి ఒకసారి వెళ్తే .. అఖిల్ మాత్రం రెండు సార్లు బిగ్ బాస్ లోకి వెళ్ళి రెండు సార్లు రన్నర్ గా నిలిచాడు. ప్రస్తుతం, ఓ వైపు బిజినెస్ లు చేస్తూనే.. ఇంకో వైపు సినిమాలు, షో లు, వెబ్ సిరీస్ లు చేస్తూ ఫుల్ బిజీగా అయ్యాడు. రీసెంట్ గా ఆహాలో రిలీజైన వేరే లెవెల్ ఆఫీసర్స్ అనే వెబ్ సిరీస్ లో నటించాడు. అయితే, తాజాగా అఖిల్ కి సంబందించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అఖిల్, రీతూ చౌదరి కలిసి తాజాగా తిరుమల వెళ్లారు. అక్కడ వీరిద్దరూ సంప్రదాయంగా కనిపించారు. అఖిల్ పంచె కట్టు లో ఉంటే.. రీతూ లంగా వోణిలో మెరిసి అందరికీ బిగ్ షాక్ ఇచ్చింది. ఎందుకంటే, ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు జీన్స్ , టాప్స్ లోనే కనిపించింది. ఇక ఇప్పుడూ ఈ ఇద్దరూ జంటగా తిరుమల వెళ్లడంతో పెళ్లి చేసుకోవడానికి వెళ్ళారా? లేక పెళ్లి కూడా అయిపోయిందా అని అనుకుంటున్నారు.


ఎన్నడూ లేనిది ఇద్దరూ కలిసి వెళ్ళడంతో ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. అంతే కాదు.. వీరిద్దరూ కలిసి వెబ్ సిరీస్ లో కూడా నటించారు. ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రీతూ , అఖిల్ కి ముద్దు పెట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ వీడియో పై నెటిజన్స్ మండి పడ్డారు. ఎందుకిలా చేస్తున్నారు.. మీరు అందరికీ ఆదర్శంగా ఉండాలి కానీ, ఇలా చేస్తే మీకు వచ్చేది ఏంటి అంటూ కొందరు ప్రశ్నించారు. మీరు టీవీ యాంకర్స్ అయి ఉండి కూడా .. ఇలా ఎలా చేస్తారంటూ మండి పడుతున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు