GHMC and HMDA: గ్రేటర్‌లో 24 లక్షల.. మొక్కలు నాటడమే లక్ష్యం!
GHMC and HMDA( IMAGE CREDIT: TWITTER)
హైదరాబాద్

GHMC and HMDA: గ్రేటర్‌లో 24 లక్షల.. మొక్కలు నాటడమే లక్ష్యం!

GHMC and HMDA: గ్రేటర్‌తో పాటు హెచ్ఎండీఏ(HMDA) పరిధిలోని సుమారు పదివేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పచ్చదనాన్నిపెంపొందించేందుకు కసరత్తు మొదలైంది. ఇప్పటికే వర్షాకాలం ప్రారంభం కావడంతో మళ్లీ మొక్కలు నాటేందుకు వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ,( GHMC)  హెచ్ఎండీఏలో వేర్వేరుగా ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. ముఖ్యంగా ఖాళీ ప్రదేశాలు, వివిధ ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యాలయాల్లోనూ అందర్నీ భాగస్వాములను చేస్తూ ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటేందుకు జీహెచ్ఎంసీ, (GHMC) హెచ్ఎండీఏలు( HMDA)  ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం.

వీటికి ఉభయ విభాగాల కమిషనర్లు ఆమోదం తెలుపగానే మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు యంత్రాంగం రెడీగా ఉన్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 30 కిలోమీటర్ల పరిధిలో 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఖాళీ ప్రదేశాల్లో సుమారు 25 లక్షల 52 వేల 599 మొక్కలు నాటేందుకు ప్రతిపాదనలు సిద్ధం కాగా, హెచ్ఎండీఏ పరిధిలోని ఉమ్మడి ఐదు జిల్లాల పరిధిలోని దాదాపు పదివేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సుమారు నాలుగు కోట్ల 94 లక్షల 84 వేల 176 మొక్కలు నాటేందుకు హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ రెండు విభాగాల ఆధ్వర్యంలో ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటడంతో పాటు ప్రజలు మొక్కలను పంపిణీ చేసేందుకు ప్రత్యేకంగా కౌంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.
జీహెచ్ఎంసీలో జోన్ల వారీగా నాటనున్న మొక్కలు
జోన్ మొక్కలు
❄️ఎల్బీనగర్ 4,53,095
❄️చార్మినార్ 3,24,504
❄️ఖైరతాబాద్ 2,50,000
❄️శేరిలింగంపల్లి 6,00,000
❄️కూకట్ పల్లి 6,25,000
❄️సికింద్రాబాద్ 3,00,000
మొత్తం 25,52,599
హెచ్ఎండీఏ నాటనున్న మొక్కలు, ప్రాంతాల వివరాలు
❄️పని పేరు లొకేషన్లు విస్తీర్ణం మొత్తం మొక్కలు
❄️పార్క్స్   64 55(ఎకరాలు) 35,99,643
❄️ఎవెన్యూ ప్లాంటేషన్   108 1083(కి.మీ.) 30,92,083
❄️సెంట్రల్ మీడియన్   80 421 (కి.మీ.) 69,89,339
❄️లేక్స్   24 35(కి.మీ.) 9,47,737
❄️ఇన్ స్టిట్యూషన్స్   17 134(హెక్టార్లు) 19,99,733
❄️అర్బన్ ఫారెస్ట్ బ్లాక్స్   28 1362(హెక్టార్లు) 34,05,741
❄️ప్రజలకు, శాఖలకు   249,65,724
మొత్తం321450,00,000
❄️మొక్కలున్న హెచ్ఎండీఏ నర్సరీలు 42 494,84,176

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..