Gurram Malsur Appointed( image credit: swetcha reporter)
తెలంగాణ

Gurram Malsur Appointed: సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సీపీఆర్వో ఎంపిక!

Gurram Malsur Appointed:  సీఎం సీపీఆర్వోగా గుర్రం మల్సూర్ నియామకం అయ్యారు. ఈ నేపథ్యంలో  సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని( Revanth Reedy)  ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం మల్సూర్‌కు (Malsur ) అభినందనలు తెలిపారు. అయితే, ఈ నియామకంపై జర్నలిస్టులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.

గతంలో ఏం జరిగింది?

జర్నలిస్టులకు, సీఎంఓ కార్యాలయానికి మధ్యవర్తిగా ఉండే అధికారి ఛీప్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్(సీపీఆర్వో). ఎన్టీఆర్ ప్రభుత్వం నుంచి ఈ పోస్ట్ కొనసాగుతున్నది. మర్రి చెన్నారెడ్డి, (Chenna Reddy)  కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి, ( Kotla Vijaya Bhaskar Reedy)  రాజశేఖర్ రెడ్డి ( RajaShekar Redd)  కాలంలో ఐ అండ్ పీఆర్ నుంచి డైరెక్టర్స్ స్థాయి అధికారులను ఈ పోస్ట్‌కు నియమించేవారు. అయితే, సీనియర్ జర్నలిస్టుల సేవలు ఈ పోస్టుకు అవసరమని అనుభవం ఉన్న, సీఎంకు సన్నిహితులుగా ఉన్నవారిని ఈ పోస్టులో నియమించి సేవలను వినియోగించుకునేవారు.

Also Read: Major Relief for Agri Gold Victims: అగ్రిగోల్డ్‌ స్కామ్‌ కేసులో.. కీలక పురోగతి!

రేవంత్ సర్కార్ కొత్త పద్దతి

సమాజంలో జరిగే పరిణామాలు, ప్రజల నాడిని సైతం ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరవేయడంలో జర్నలిస్టులైతే ముందుంటారు. సమాచార లోపం ఉండకుండా సరైన పద్దతిలో కమ్యునికేషన్ చేస్తారు. పరిజ్ఞానం, పరిచయాలతో తప్పుఒప్పులను పంచుకుంటారు. కానీ, రేవంత్ రెడ్డి ( Revanth Rddy)  సర్కార్ కొత్త పద్దతిని, సిద్దాంతాన్ని తెరపైకి తీసుకురావడంతో జర్నలిస్టులు ఒకింత అసహనానికి గురవుతున్నారు. అసలు రాష్ట్రంలో అనుభవం ఉన్న జర్నలిస్టులు లేరా, లేకుంటే ఉన్నా కావాలని వారిని దూరం పెట్టారా అనేది సర్వత్రా చర్చకు దారితీసింది.

రిటైర్డ్ ఆఫీసర్లు వద్దని.. ఇప్పుడెలా?

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1200 మంది రిటైర్డ్ ఆఫీసర్స్ సేవలు వద్దనుకుని ఉద్వాసన పలికింది. ఈ తరుణంలో మళ్లీ రిటైర్డ్ ఆఫీసర్ మల్సూర్‌ను ఎలా సీపీఆర్వోగా నియమిస్తారనే ప్రశ్న రాష్ట్ర ప్రజల్లో ఉత్పన్నమవుతున్నది. ఆయన మూలాలు కూడా నెల్లూరు జిల్లావే. ఖమ్మంలో సెటిల్ అయ్యారు. అదే జిల్లాకు చెందిన ఓ మంత్రికి ఎన్నో విధాలుగా చేదోడు వాదోడుగా ఉన్నందుకే ఇప్పుడు ఈ పదవి ఇచ్చారని ప్రచారం జరుగుతున్నది. గతంలో ఆయన పని చేసిన శాఖల్లో వచ్చిన ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

కమ్యునికేషన్ ఎలా?

సోషల్ మీడియాలో కాలనుగుణంగా ఏ విషయమైనా యాక్టివ్ అవుతుంది. ఏది జరిగినా విస్తృత ప్రచారం ఉంటుంది. ఏ చిన్నతప్పు జరిగినా క్షణాల్లో వైరల్ అవుతుంది. ఈ తరుణంలో నేరుగా ప్రజలతో సంబంధం ఉండే అటు జర్నలిస్టులకు, ఇటు జర్నలిస్టులతో సత్సంబంధాలతో ఉండే ఐఆర్ పీఆర్ అధికారులు కాకుండా నాన్ కేడర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి సీపీఆర్వో పోస్ట్ కట్టబెట్టడంతో కోఆర్డినేషన్ ఎలా కొనసాగిస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

 Also Read: Government Announces: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 3.64 శాతం డీఏ పెంపు!

Just In

01

OTT Movie: ఐరిష్ హిస్టరీ డార్క్ సైడ్‌ ఎలా ఉందంటే?.. మరీ ఇంత వైలెంటా..

Mahesh Kumar Goud: అక్టోబరులో డీసీసీ నియామకాలను పూర్తి: మహేష్ కుమార్ గౌడ్

TGSRTC: భారీ వర్షాల ఎఫెక్ట్.. ఎంజీబీఎస్‌లో రాకపోకలు బంద్.. ఆర్టీసీ కీలక ప్రకటన

TG Medical Council: తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కీలక నిర్ణయం.. ఆ డాక్టర్లపై వేటు..?

KTR: మెట్రోకు ఎంత నష్టం? భూములు అమ్ముతారా?.. కేటీఆర్ ఫైర్!