Government Announces: ప్రభుత్వ ఉద్యోగులకు( (Employees) సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 3.64 శాతం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా(Sandeep Kumar Sultania) ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన డీఏ 2023 జనవరి 1 నుంచి వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పెంచిన డీఏను 2025 జూన్ నెల జీతంతో కలిపి జూలైలో చెల్లిస్తామని వెల్లడించారు. అయితే, ఈ తాజా డీఏ పెంపుతో ప్రతి నెల సగటున ప్రభుత్వ ఖజానాపై రూ.200 కోట్లు, ఏడాదికి సుమారు రూ.2,400 కోట్ల అదనపు భారం పడనుంది.
2020 రివైజ్డ్ పే స్కేల్స్‌లో జీతం పొందుతున్న ప్రభుత్వ (Government) ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ బేసిక్ పేలో 26.39శాతం నుండి 30.03శాంతానికి పెంచారు. ఈ డీఏ పెంపు జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థలు, వర్క్ ఛార్జ్డ్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది, ఎయిడెడ్ సంస్థలు ,యూనివర్సిటీల్లోని టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బందికి కూడా అందనుంది. యూజీసీ,(UGC) ఏఐసీటీఈపే (AICTE) స్కేల్స్ ఉద్యోగులకు డీఏ 38శాతం నుండి 42శాతానికి పెంచారు.
Also Read: Minister Sridhar Babu: తెలంగాణ అన్ స్టాపబుల్.. ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్!
రెండో డీఏ మరో 6 నెలల్లో
ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని ఉద్యోగులకు 5 డీఏ బకాయిలు ఉన్నాయి. ఇటీవల రాష్ట్ర క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు (Employees) ఉద్యోగులకు రెండు డీఏలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో ఒక డీఏ తక్షణమే ఇస్తున్నట్లు తెలిపారు. రెండో డీఏను మరో 6 నెలల్లో ఇస్తామని ప్రభుత్వంలోని మంత్రులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా డీఏ ఉత్తర్వులు జారీ చేశారు. జీవో ప్రకారం 2023 జనవరి 1 నుంచి 2025 మే 31 వరకు ఉన్న డీఏ బకాయిలను ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) ఖాతాలకు జమ చేస్తారు.
2025 అక్టోబర్ 31లోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులకు మాత్రం, డీఏ బకాయిలను 28 సమాన నెలవారీ వాయిదాలలో చెల్లిస్తారు. ఇక 2004 సెప్టెంబర్‌లో ప్రభుత్వ సర్వీసులో చేరి, కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) కింద ఉన్న ఉద్యోగులకు, 2023 జనవరి 1 నుండి 2025 మే 31 వరకు ఉన్న డీఏ బకాయిలలో 10శాతం వారి ప్రాన్ ఖాతాలకు జమ చేశారు. మిగిలిన 90శాతం డీఏ బకాయిలను 28 సమాన నెలవారీ వాయిదాలలో చెల్లిస్తారు.
Also Read: Revanth Reddy: ఈ ఏడాది కొత్తగా 571 స్కూల్స్.. ఎన్‌రోల్‌మెంట్‌పై దృష్టిసారించండి!