Minister Sridhar Babu( image credit: twittter)
తెలంగాణ

Minister Sridhar Babu: తెలంగాణ అన్ స్టాపబుల్.. ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్!

Minister Sridhar Babu: పెట్టుబడులు పెట్టేందుకు మాత్రమే రావొద్దు.. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు కలిసి రండి అని (Minister Sridhar Babu) మంత్రి శ్రీధర్ బాబు పారిశ్రామిక వేత్తలను కోరారు.  (Hyderabad) హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ‘ఇంటర్నేషనల్ బిజినెస్ కొలాబరేషన్(ఐబీసీ)’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గ్లోబల్ లీడర్స్ సమ్మిట్ – 2025’ను ప్రారంభించి మాట్లాడారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు సంక్షేమం, అభివృద్ధిలో రోల్ మోడల్‌గా నిలుస్తున్న (Telangana) తెలంగాణతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని ఆయా దేశాల ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ఆనతి కాలంలోనే తెలంగాణ అన్ స్టాపబుల్ అనే స్థాయికి ఎదిగిందన్నారు. రాష్ట్ర జీడీపీ రూ.16.12 లక్షల కోట్లకు చేరిందన్నారు.

తలసరి ఆదాయం రూ.3.79 లక్షలు

10.1 శాతం వృద్ధి రేటుతో దేశ సగటు (9.9%)ను దాటేసిందని, తలసరి ఆదాయం రూ.3.79 లక్షలు అన్నారు. ఇది దేశ సగటు కంటే 1.8 రెట్లు ఎక్కువ అన్నారు. ఏడాదిన్నర కాలంలోనే రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను సేకరించగలిగామని, గత 14 నెలల్లో లైఫ్ సైన్సెస్‌లో రూ.40వేల కోట్ల పెట్టుబడులను సాధించామని, 2 లక్షల ఉద్యోగాలు సృష్టించామని వివరించారు. రాష్ట్ర జీడీపీలో సేవల రంగం వాటా 66.3 శాతం అని, దేశంలో ఇది 55 శాతంగా ఉందని, ఇవి అంకెలు కాదు, ( Telangana) తెలంగాణ పురోగతికి నిదర్శనలు అని పేర్కొన్నారు.

 Also Read: Revanth Reddy: ఈ ఏడాది కొత్తగా 571 స్కూల్స్.. ఎన్‌రోల్‌మెంట్‌పై దృష్టిసారించండి!

డిజిటల్ ఫార్మింగ్, ఫ్యూచర్

ప్రతి భాగస్వామ్యం ఒక లావాదేవీ కాదు, అది ఒక మార్పు అన్నారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలతో తెలంగాణ ( Telangana)  పురోగతిని మరో అడుగు ముందుకు తీసుకెళ్లాలని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఆగ్రో ఇన్నోవేషన్, ఏఐ గవర్నెన్స్, స్మార్ట్ హెల్త్ సిస్టమ్స్, డిజిటల్ ఫార్మింగ్, ఫ్యూచర్ – రెడీ ఎడ్యుకేషన్, సస్టైనబుల్ మానుఫ్యాక్చరింగ్, క్లీన్ ఎనర్జీ తదితర అంశాల్లో ప్రపంచ దేశాలతో పని చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నామన్నారు.

మిగిలిన రాష్ట్రాలు ట్రెండ్‌ను అనుసరిస్తే, తెలంగాణ దాన్ని సృష్టిస్తుందన్నారు. ‘బ్రెజిల్, జర్మనీ, రష్యా, కామెరూన్, మాల్టా, యూకే, బల్గేరియా, బెల్జియం, యూఏఈ, దుబాయి తదితర 25 దేశాల ప్రతినిధులు ఒకే వేదిక పైకి రావడం శుభపరిణామం అని, ఇది ఒక సదస్సుగా మిగిలిపోకుండా వివిధ దేశాల మధ్య సంస్కృతి, వ్యూహాలు, టెక్నాలజీ బదలాయింపునకు వారధిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

 Also Read: Harish Rao: నీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం.. హరీశ్ రావు సంచలన కామెంట్స్!

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్