Harish Rao: నీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం..
Harish Rao( IMAGE CREDIT: TWITTER)
Political News

Harish Rao: నీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం.. హరీశ్ రావు సంచలన కామెంట్స్!

Harish Rao: : ఫార్ములా ఈ కార్ల రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌  (KTR) కు మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడం రాజకీయ కక్షసాధింపే తప్ప మరొకటి కాదని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao)  మండిపడ్డారు. తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ రెడ్డి ( Revanth Reddy) దర్యాప్తు సంస్థలను యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నారనడానికి కేటీఆర్‌కు ఇచ్చిన తాజా నోటీసులే నిదర్శనమన్నారు. కాంగ్రెస్( Congress) ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయాలని నిరంతరం ప్రశ్నిస్తున్న కేటీఆర్ ( KTR)  నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకే రేవంత్ రెడ్డి ( Revanth Reddy) ఈ నోటీసులు పంపించారన్నారు.

రేవంత్ రెడ్డి ( Revanth Reddy) ప్రభుత్వం 18 నెలల పాలనలో డైవర్షన్ పాలిటిక్స్‌ను అమలు చేస్తూ (BRS) బీఆర్ఎస్‌ను బద్నామ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రేవంత్ రాజకీయ అరాచకత్వం గెలిచే ప్రసక్తే లేదని, ఆయన డ్రామా, డైవర్షన్ రాజకీయాలు ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యాయన్నారు. ఫార్ములా ఈ రేసింగ్‌తో తెలంగాణ ప్రతిష్ట పెరిగిందని, పెట్టుబడులు కూడా వచ్చాయని, తెలంగాణ ప్రతిష్ట పెంచినందుకా ( KTR) కేటీఆర్‌పై మీ నోటీసుల ప్రతాపం? అని నిలదీశారు.

 Also Read: Farmer Incentives: సన్నధాన్యం బోనస్ కోసం.. రైతుల ఎదురుచూపు!

బీఆర్ఎస్ ప్రభుత్వం, కేటీఆర్ కృషితో ఫార్ములా వన్
2000లో చంద్రబాబు ఫార్ములా వన్ కోసం కృషి చేసి నిర్వహించలేకపోయాడని, అలాంటిది బీఆర్ఎస్( BRS)  ప్రభుత్వం, కేటీఆర్ (KTR) కృషితో ఫార్ములా వన్ వంటి ప్రతిష్టాత్మక రేస్‌ను దేశానికి అందులోనూ ( Hyderabad) హైదరాబాద్‌కి తీసుకొని వచ్చారన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా తెలంగాణను మార్చేందుకు ఫార్ములా ఈ రేస్‌ను హైదరాబాద్‌లో నిర్వహించి పెట్టుబడులను ఆకర్షించారన్నారు. అమర్‌రాజా వంటి కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయన్నారు.

కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అందాల పోటీలు నిర్వహించి రాష్ట్ర పరువును, దేశ పరువును మంటకలిపిందన్నారు. కాంగ్రెస్ (Congress)  ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపినందుకు,( Revanth Reddy)  రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నందుకు కేటీఆర్‌కి ఏసీబీ నోటీసులు ఇచ్చిందని స్పష్టమైతున్నదన్నారు. రేవంత్ రెడ్డి, నువ్వు ఎన్ని రకాలుగా వేధించినా నీ వైఫల్యాలను ఎండగట్టడం మాత్రం బీఆర్ఎస్ ఆపదన్నారు.

 Also Read: Allegations Of Officials Misusing: అద్దె వాహనాల పేరుతో బిల్లులు.. తిరగకున్నా తిరిగినట్లు రికార్డ్!

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..