Farmer Incentives( image crtedit: swetcha reporter)
తెలంగాణ

Farmer Incentives: సన్నధాన్యం బోనస్ కోసం.. రైతుల ఎదురుచూపు!

Farmer Incentives: వరి పంట సాగులో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఆరుగాలం కష్టపడి పంట పండించి అన్నం పెట్టే అన్నదాతకు ప్రోత్సాహం అందించే సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న వరి ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చింది. వర్షాకాలం పండించిన సన్నధాన్యానికి ప్రభుత్వం బోనస్ (Incentives)డబ్బులు రైతులకు చెల్లించి ప్రోత్సహించింది. రబీ సీజన్‌లోను సన్నరకం వరిధాన్యానికి (Incentives) బోనస్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో గతంలో ఎన్నడు లేని విధంగా రికార్డు స్థాయిలో యాంసంగిలో సన్నవడ్ల సాగు పెరిగింది.

అయితే, రబీ సీజన్(యాసంగి)కు సంబంధించిన సన్నవడ్లు రైతులు (Farmers) అమ్ముకుని రెండు నెలలు అయినా రాష్ట్రంలో ఒక్క రైతుకు కూడ (Incentives) బోనస్ డబ్బులు అందలేదు. దీంతో రాష్ట్రంలో రైతులు (Farmers) బోనస్ (Incentives) డబ్బులు వస్తాయా? రావా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించకపోవడం, ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో రైతుల్లో (Farmers) ఆందోళన మరింతగా పెరుగుతున్నది.

 Also Read: Congress Plans: లోకల్ కంటే ముందే.. కార్పొరేషన్ చైర్మన్లు!

యాసంగిలో పెరిగిన సన్నవడ్ల సాగు
సాధారణంగా వాతావరణ పరిస్థితులు దిగుబడికి దృష్టిలో ఉంచుకొని రైతులు (Farmers) వర్షాకాలమే సన్న వడ్లను సాగు చేస్తారు. యాసంగి పంట ఎక్కువగా దొడ్డు రకం సాగు చేస్తారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు కలిగిన పేదలకు సన్న బియ్యం అందించేందుకు నిర్ణయం తీసుకుని దానికి అనుగుణంగా సన్న వడ్లను దిగుబడిని పెంచే ఉద్దేశంతో సన్నవడ్లను సాగు చేసే రైతులకు ప్రోత్సాహం అందించేందుకు క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించడంతో ఈ యాసంగి సీజన్ లోనూ సన్న వడ్ల సాగు రికార్డుస్థాయిలో పెరిగింది. రాష్ట్రంలో ఏప్రిల్ మాసంలో రెండో వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కొనుగోలు కేంద్రాలు, డీఆర్డీడీఏ-సెర్ప్ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాలు, డీసీఎంఎస్ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 74 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇది కొత్త రికార్డుగా అధికారులు చెబుతున్నారు.  ఉమ్మడి జిల్లాలోని వరంగల్( Waeangal) జిల్లాలో 1,48,048 మెట్రిక్ టన్నులు, హనుమకొండ జిల్లాలో 1,80,819 మెట్రిక్ టన్నులు, జనగామా జిల్లాలో 23547 మెట్రిక్ టన్నులు, మహబూబాబాద్ జిల్లాలో 1,13,677 మెట్రిక్ టన్నులు, ములుగు జిల్లాలో 39412 మెట్రిక్ టన్నులు, భూపాల పల్లి జిల్లాలోని 25942 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం కొనుగోలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికీ ఒక్క రైతుకు కూడ బోనస్ డబ్బులు చెల్లించలేదు. మళ్ళీ వానాకాలం పంట సాగు ప్రారంభమైన సన్న వడ్లకు రావాల్సిన బోనస్ డబ్బులు ఖాతాల్లో జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

 Also Read: Local Body Elections: స్థానిక ఎన్నికల కోసం.. పార్టీల వెయిటింగ్!

కష్టాల సాగు.. బోనస్‌తో ఊరట
సన్నవడ్ల సాగు విస్తీర్ణం పెరిగిన ఆకాల వర్షాలు, వాతావరణం అనుకూలించకపోవడంతో దిగుబడి అనుకున్న స్థాయిలో దిగుబడి రాక ఒకవైపు రైతులు ఇబ్బంది పడి పంట సాగు చేశారు. మరో వైపు మిల్లర్లు తేమ, తరుగు, తాలు పేరుతో ధాన్యం దిగుమతి చేసుకునేందుకు ఇబ్బందులకు గురి చేసి అదనంగా తూకంలో కోత వింధించి ఇబ్బందులకు గురి చేసిన విధిలేని పరిస్థితుల్లో రైతులు (Farmers)  ధాన్యం విక్రయించారు. అన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ప్రకటించడంతో రైతులకు కొంత ఊరట కలిగించింది.

బోనస్ రాకపోవడంతో ప్రైవేట్ కంపెనీల నిరాకరణ
తెలంగాణలోని అనేక జిల్లాలలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు ప్రైవేట్ సీడ్ కంపెనీలు రైతులకు సన్నరకం అందించాయి. ప్రభుత్వం బోనస్ ఇస్తే తాము కూడా ఇస్తామని రైతులతో ప్రైవేట్ విత్తన సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం సన్నవడ్లకు బోనస్ (Incentives) ఇవ్వకపోవడంతో ప్రైవేట్ కంపెనీలు కూడా రైతులకు బోనస్ ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన సన్నవడ్లకు వెంటనే బోనస్ అందించాలని రైతుల (Farmers) కోరుతున్నారు. ప్రైవేట్ విత్తన సంస్థలు ఒప్పందాన్ని ధిక్కరించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

రెండు నెలలుగా ఎదురు చూస్తున్నాం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Governament) సన్నవడ్లకు బోనస్ ప్రకటించడంతో యాసంగిలో సన్నవడ్ల సాగు ఇబ్బందికరమని తెలిసినా సాగు చేశాం. 66 క్వింటాళ్లు ఉన్నవాళ్లను కొనుగోలు కేంద్రంలో విక్రయించాను. తూకం వేసి 2 నెలలు దాటిన ఇప్పటికీ బోనస్ ఇవ్వలేదు. బోనస్ (Incentives డబ్బుల కోసం అధికారుల చుట్టూ తిరిగాను. కానీ ఎవరు సరైనా సమాచారం ఇవ్వడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ప్రభుత్వం బోనస్ డబ్బులు చెల్లించాలి.
– పాక కుమారస్వామి, రైతు

వెంటనే డబ్బులు మా ఖాతాలో వేయాలి
అనేక ఇబ్బందులు పడి సన్న వడ్లు సాగు చేశాం. వాతావరణం అనుకూలించకపోవడం, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని పంట పండించాం. వడ్లు అమ్మిన డబ్బులతో పాటు బోనస్ డబ్బులు కూడా పడతాయి అనుకున్నాం. కానీ, రెండు నెలలు అయినా డబ్బులు రాలేదు. యాసంగి పంట అయిపోయి ఇప్పుడు వర్షాకాలం పంట సాగు చేసే సమయం వచ్చింది. బోనస్ డబ్బులు చెల్లిస్తే మా పెట్టుబడికి ఉపయోగపడతాయి. ప్రభుత్వం వెంటనే బోనస్ డబ్బులు విడుదల చేయాలి.

– కుమారస్వామి, రైతు

 Also Read: Minister Seethakka: ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలి!

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు