Minister Seethakka:ఏజెన్సీ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే వారందరూ ఇసుకను ఉచితంగా తరలించుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ (సీతక్క) తెలిపారు. శుక్రవారం కొత్తగూడెం మండల కేంద్రంలోని రైతు వేదిక ప్రాంగణంలో కొత్తగూడా గంగారం మండలాలకు సంబంధించిన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తో కలిసి మంత్రి సీతక్క అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… నిరుపేదల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్య చదువుకునేందుకు తోడ్పాటు అందించాలన్నారు. ఉన్నతంగా చదువుకుంటేనే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వివరించారు. ఇసుక తరలించేందుకు డిఎఫ్ఓ నుంచి అనుమతులు ఇప్పించాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు.
Also Read: Ponguleti Srinivas Reddy: వర్షాకాలానికి ముందస్తు ప్రణాళికలు.. మంత్రి కీలక అదేశాలు!
ఒక్కో ఇంటికి ఎంత ఇసుక అవసరం ఉంటుందో అందుకు సంబంధించిన ఒక చీటీపై రాసిస్తే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇసుకను తీసుకెళ్తారని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే వారందరూ పక్కా ఇళ్లను నిర్మించుకోవాలని, తమ పిల్లలను ఉన్నత స్థాయి చదివించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేసి నిరుపేదల కడుపు నింపేందుకు కృషి చేస్తుందన్నారు.
మొదటి దశలో వచ్చిన వారందరూ పూర్తిస్థాయిలో ఇళ్ల నిర్మించుకుంటే అందుకు సంబంధించిన బిల్లులను త్వరితగతిన రిలీజ్ చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ అనేది ఇంతటితోనే ఆగిపోదని.. ఇది నిరంతరం సాగే ప్రక్రియ అన్నారు. ఇల్లు రాని వారు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదని రెండోదప మూడోదఫా నాలుగో దఫా కూడా ఇండ్లు మంజూరు చేసి వారందరూ నిర్మాణం చేసుకునేందుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని పేర్కొన్నారు. అటవీ ప్రాంతంలో నివసించే వారందరికీ సరైన వ్యవసాయం, ఇతరత్రా ఆదాయ మార్గాలు ఉండవు కాబట్టి రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఏజెన్సీ ప్రాంత ప్రజలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానని వివరించారు.
Also Read: Plane Crashes In India: దేశాన్ని కుదిపేసిన ఘోర విమాన ప్రమాదాలు.. ప్రతీ ఘటన తీవ్ర విషాదమే!