Revanth Reddy: తెలంగాణలో 20 మంది కన్నా ఎక్కువ పిల్లలున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలు ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. పాఠశాలలు పున:ప్రారంభమైన నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ) (AICC) లో విద్యాశాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ప్రమాణాల పెంపే తమ లక్ష్యమని సీఎం అన్నారు.
ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందాలని, ఇందుకు అవసరమైన మౌలిక వసతులు, ఉపాధ్యాయులకు శిక్షణ, ఇతర సదుపాయాల కల్పనకు ఎంత వ్యయమైనా వెనుకాడేది లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. ఈ క్రమంలో బోధన ప్రమాణాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు సూచించారు.
Also Read: Harish Rao: నీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం.. హరీశ్ రావు సంచలన కామెంట్స్!
విద్యా వ్యవస్థను మార్పు చేయాలి!
విద్యార్థులకు భాషా పరిజ్ఞానంతో పాటు నైపుణాల పెంపునకు వీలుగా విద్యా వ్యవస్థను మార్పు చేయాలని సీఎం సూచించారు. (Schools)హైస్కూల్ స్థాయి నుంచే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కల్పిస్తే భవిష్యత్‌లో వారు తమకు ఇష్టమైన రంగంలో రాణించే అవకాశం ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. తెలంగాణలో పట్టణీకరణ వేగంగా సాగుతున్న నేపథ్యంలో విద్యా శాఖ పురపాలక శాఖతో సమన్వయం చేసుకుని హెచ్ఎండీఏ, మున్సిపల్ లేఅవుట్లలో సామాజిక వసతుల కోసం గుర్తించిన స్థలాల్లో (School) పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇలా వివిధ విభాగాల కింద ఇంటర్మీడియట్ వరకు ఉన్న వివిధ విద్యా సంస్థలను హేతుబద్దీకరించి ప్రతి పాఠశాలలో నిర్దిష్ట సంఖ్యలో విద్యార్థులు ఉండేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.నాణ్యమైన భోజనం, యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలు అందిస్తుండడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు గురుకులాల వైపు మొగ్గు చూపుతున్నారని, డే స్కాలర్స్‌కూ ఆ పాఠశాలల్లోనే అవన్నీ అందించే విషయంపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.
Also Read: Congress Plans: లోకల్ కంటే ముందే.. కార్పొరేషన్ చైర్మన్లు!