Cherasaala Movie Still
ఎంటర్‌టైన్మెంట్

Cherasaala: రిలేషన్ షిప్‌లో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? తెలియాలంటే చూడాల్సిందే

Cherasaala: ఎస్ రాయ్ క్రియేషన్స్ బ్యానర్‌పై కథ్రి అంజమ్మ సమర్పణలో కథ్రి అంజమ్మ, షికార నిర్మాతలుగా రామ్ ప్రకాష్ గున్నం హీరోగా నటిస్తూ, తెరకెక్కించిన చిత్రం ‘చెరసాల’. శ్రీజిత్, నిష్కల, రమ్య వంటి వారు ఇతర పాత్రలలో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 11న విడుదలకాబోతుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి, చిత్ర విశేషాలను తెలియజేశారు. రిలేషన్ షిప్‌లో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు అనే పాయింట్‌ను బేస్ చేసుకుని, ఓ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమాను రూపొందించినట్లుగా ఈ కార్యక్రమంలో టీమ్ తెలియజేసింది.

Also Read- Renu Desai: పొలిటికల్ ఎంట్రీ.. రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు

ఈ సందర్భంగా డైరెక్టర్, హీరో రామ్ ప్రకాష్ గున్నం మాట్లాడుతూ.. అందరికీ నచ్చే మంచి కాన్సెప్ట్‌తో ‘చెరసాల’ సినిమా రాబోతుంది. ఈ సినిమా కథ చెప్పిన వెంటనే నిర్మాతలు ఈ సినిమా మనం చేస్తున్నామని అన్నారు. ఇందులో శ్రీజిత్, నిష్కల అద్భుతంగా నటించారు. మంచి టీం ఉంటే ఎంత మంచి సినిమా తీయగలమో అనే దానికి ఈ సినిమానే ఉదాహరణ. ఇందులో ఓ బంధం ఎలా ఉండాలి? రిలేషన్ షిప్‌లో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అనే పాయింట్‌ను చక్కని వినోదం యాడ్ చేసి చూపించాను. మంచి ఎమోషన్స్‌తో పాటు ఆహ్లాదకరమైన వినోదం ఇందులో ఉంటుంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ‘చెరసాల’ చిత్రం ఉంటుంది. ఏప్రిల్ 11న రాబోతోన్న ఈ సినిమాను అందరూ చూసి సక్సెస్ చేస్తారని భావిస్తున్నానని అన్నారు.

చెరసాల సినిమాను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. నేను ఈ సినిమాకు తెలుగులోనే డబ్బింగ్ చెప్పాలని చాలా ప్రయత్నించాను. కానీ అది కుదరలేదు. సినిమా అంతా అద్భుతంగా వచ్చింది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్. మా దర్శకుడు ఈ చిత్రం కోసం నాలుగేళ్లు ఫోకస్ పెట్టారు. మధ్యలో ఇతర ఆఫర్లు వచ్చినా కూడా మా సినిమా మీదే దృష్టి పెట్టాడు. నేను కన్నడలో ఇది వరకు సినిమాలు చేశాను. నన్ను నమ్మి మా దర్శకుడు నాకీ అవకాశం ఇచ్చారు. ఇలాంటి మంచి చిత్రాలు మరిన్ని రావాలి. ఏప్రిల్ 11న అందరూ ఈ సినిమా చూసి ఆదరించండని అన్నారు హీరో శ్రీజిత్.

Also Read- Manchu Family Dispute: 150 మందితో నా ఇంటిపై దాడి చేయించింది అతడే.. ఫిర్యాదులో మంచు మనోజ్

హీరోయిన్ నిష్కల మాట్లాడుతూ.. ఇది నాకు తెలుగులో తొలి చిత్రం. ఇందులో నేను ప్రియ అనే పాత్రలో నటించాను. ఇంత మంచి సినిమాలో పని చేసినందుకు హ్యాపీ. డైరెక్టర్ రామ్ ప్రకాష్ ఈ సినిమాను అద్భుతంగా మలిచారు. మేం కష్టపడి, ఇష్టపడి ఈ సినిమాను చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. అందరికీ ఈ చిత్రం నచ్చుతుందని అనుకుంటున్నానిని తెలిపారు. ఇంకా నటి రమ్య, కథా రచయిత ఫణీంద్ర భరద్వాజ్, ఎడిటర్ భాను నాగ్ మాట్లాడుతూ.. ఈ అద్భుతమైన చిత్రంలో మంచి మెసేజ్ ఉందని తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

The Raja Saab: ‘కాంతార చాప్టర్ 1’కు, ‘ది రాజా సాబ్’కు ఉన్న లింకేంటి? నిర్మాత ఏం చెప్పారంటే?

Ritika Nayak: హిమాలయాల్లో ఉండే ఒక మాంక్ క్యారెక్టర్.. ‘మిరాయ్’లో తన పాత్ర ఏంటో చెప్పేసిన హీరోయిన్

Mega Little Prince: మెగా లిటిల్ ప్రిన్స్‌.. రామ్ చరణ్, నిహారిక పోస్ట్‌లు వైరల్..!

Bellamkonda Sai Sreenivas: ‘కిష్కింధపురి’ చూశాను.. మైండ్ బ్లోయింగ్.. బెస్ట్ ఏంటంటే?

OG Movie: రికార్డ్స్ రాకుండా చేస్తున్నారంటూ.. ‘ఓజీ’ అమెరికా డిస్ట్రిబ్యూటర్లపై ఫ్యాన్స్ ఆగ్రహం!